Breaking News

ఔషధాలకు లొంగని అధిక రక్తపోటు..! సర్వేలో షాకింగ్‌ విషయాలు

Published on Wed, 09/24/2025 - 11:47

ఇటీవలకాలంలో చాలామంది ఔషధాలకు లొంగని రక్తపోటుతో బాధపడుతున్నారు. అంతేగాదు ఇండియా హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌ ఇనిషియేటివ్‌ ప్రకారం..సుమారు 20 కోట్ల మందికి పైగా అధిక రకపోటుతో బాధపడుతున్నట్లు అంచనా. అందులో రెండు కోట్ల మంది ఈ సమస్యను నియంత్రణలో ఉంచుకున్నట్లు నివేదికల్లో తేలింది. ప్రస్తుతం ఇది అత్యంత అత్యవసర ప్రజారోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రి దీనిపై వర్క్‌షాష్‌ నిర్వహించింది. 

ఆ ఆస్పత్రి వైద్యులు దేశంలో క్రమంగా రెసిస్టెంట్ హైపర్‌టెన్షన్ క్రమంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేయడమే అందుకు మంచి ఫలితాలనందిస్తున్న మూత్రపిండ నిర్మూలన చికిత్స(Renal Denervation - RDN) గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ మేరక సదరు ఆస్ప్రతి వైద్యులు ఈ రెసిస్టెంట్ హైపర్‌టెన్షన్(అధిక రక్తపోటు)  కారణంగా తరచుగా తలనొప్పి, తలతిరగడం, ఊపిరి ఆడకపోవడం లేదా అప్పుడప్పుడు ఛాతీలో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తాయని అన్నారు. 

అదీగాక కాలక్రమేణా, నిరంతరం పెరిగిన రక్తపోటు హృదయనాళ వ్యవస్థ, ఇతర ముఖ్యమైన అవయవాలపై ప్రభావం చూపి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చిరించారు. అందువల్ల ముందుగా ఈ అధిక రక్తపోటుని 10 mmHg తగ్గించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని 20%,  స్ట్రోక్ ప్రమాదాన్ని 27% మేర  తగ్గించగలమని క్లినికల్‌​ అద్యనాలు వెల్లడించాయని చెప్పారు. 

ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న యాంటీహైపర్‌టెన్సివ్ మందులు చాలా మందికి  ప్రభావవంతంగా ఉన్నప్పటికీ..గణనీయమైన సంఖ్యలో కొందరు రోగుల్లో ఈ నియంత్రణ కష్టంగా ఉందన్నారు. అలాంటి పేషెంట్లకు ఈ రీనల్ డెనర్వేషన్ (RDN) అనేది ఒక ఆశాజనకమైన చికిత్స అని చెప్పారు. అంతేగాదు ఆ చికిత్స పొంది.. మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్న రోగుల గురించి కూడా ఈ వర్క్‌షాప్‌లో వివరించారు.

ఈ నియంత్రణలేని అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్‌, మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచడమే కాకుండా అధిక ఆరోగ్య సంరక్షణ ఖర్చులు భారాన్ని మోపడమే గాక, ఆస్పత్రి పాలయ్యేలా చేస్తుందని నొక్కి చెప్పారు. అందువల్ల ముందుగానే ఈ అధిక రక్తపోటును ఆర్‌డీఎన్‌ వంటి చికిత్సలతో మెరుగుపరుచుకుంటే ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతామని అన్నారు వైద్యులు.  

(చదవండి: 'ఆ వయసులోనూ ఇంత అందంగానా'..? విస్తుపోయిన బరాక్‌ ఒబామా)
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)