Breaking News

పెదవులపై ఉండే అవాంఛిత రోమాలకు చెక్‌పెట్టండిలా!

Published on Wed, 08/30/2023 - 13:58

చాలామందికి పైపెదవులపైన, గడ్డం వద్ద అవాంచిత రోమాలు వస్తుంటాయి. వాటిని తొలగించుకునేందుకు వాక్సింగ్‌, థ్రెడింగ్‌ వంటి నొప్పితో కూడిన ప్రక్రియలను ఆశ్రయిస్తారు. అలాకాకుండా ఇంట్లో ఉన్నవాటితో సహజంగా ఆ అవాంచిత రోమాలను తొలగించుకోవచ్చు. ఎలాంటి నొప్పి ఫేస్‌ చేయాల్సిన అవసరం ఉండదు పైగా ఈజీగా బయటపడొచ్చు కూడా. ఎలాగో చూద్దాం!.

సహజ పద్ధతిలో అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి..
పసుపు ఒక టేబుల్‌ స్పూన్‌, పాలు ఒక టేబుల్‌ స్పూన్‌ తీసుకోండి. ఆ మిశ్రమాన్ని పై పెదవికి అప్లై చేసి ఆరిన తర్వాత మెత్తగారుద్దండి. వెంట్రుకలు పలచబడటమేగాక తగ్గడం స్టార్ట్‌ అవుతుంది.

నిమ్మరసం, పంచాదార మిశ్రమాన్ని అప్లై చేసిన వెంట్రుకలు కుదుళ్లు వదులై త్వరగా పోయే అవకాశం ఉంటుంది. నిమ్మలో ఉండే యాసిడ్‌లు బ్లీచ్‌లా పనిచేస్తుంది. ఇక షుగర్‌ స్కిన్‌ ఎక్స్‌ఫోలియేషన్‌లో సహయపడుతుంది. పొడిచర్మం ఉన్నట్లయితే దీన్ని స్కిప్‌ చేయండి. 


గుడ్డు తెల్లసొన ఒక టేబుల్‌ స్పూన్‌, మొక్కజొన్నపిండి 1/2 టేబుల్‌ స్పూన్‌ తీసుకోండి ఈ మిశ్రమాన్ని పెదాలపై అప్లే చేస్తే ఈజీగా వెంట్రుకలు రాలిపోతాయి.


సెనగపిండి, పాలు ఒక టేబుల్‌స్పూన్‌ చొప్పున తీసుకుని దాంట్లొ కొంచెం పసుపు వేసుకుని ఆ మిశ్రమాన్ని పెదాలపై రాసి సుమారు 15 నుంచి 20 నిమిషాలు ఉంచి ఆరిపోయాక వేడి నీటితో కడిగేయండి. 


పెరుగు కూడా చక్కటి ఫలితం ఇస్తుంది. పెరుగు, తేనె ఒక టేబుల్‌ స్పూన్‌ పసుపు చిటికెడు వేసి కలిపి ఈ మ్రిశ్రమాన్ని అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి ఇక వెంట్రుకలు ఈజీగా రాలిపోతాయి.

ఈ చిట్కాలను క్రమం తప్పకుండా చేస్తే గనుకు సుమారు 15 రోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది. అలాగే అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్నవారిని నెల లేదా  రెండు నెలల్లో చక్కటి ఫలితం కనిపించి తీరుతుంది. 

(చదవండి: హెయిర్‌–డై వేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా!)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)