రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..
Breaking News
ఒక్క ఎల్నినో.. రైతు జీవితాన్నే తలకిందులు చేసింది!
సీజేపీ నేతలకు మరోసారి షాక్
పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల
టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ
టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
96 చోట్ల హింసాత్మక ఘటనలు: లేళ్ల అప్పిరెడ్డి
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బరితెగించిన పచ్చమూకలు.. వంతపాడిన పోలీసులు!
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
టాబ్లెట్స్ వేసుకున్నా తలనొప్పి తగ్గడం లేదా? అయితే ఇలా చేయండి
Published on Sat, 06/17/2023 - 11:32
తలనొప్పి..ఈరోజుల్లో ప్రతి ఒక్కరిని సాధరణంగా వేధించే సమస్య ఇది. ఒత్తిడి సహా అనేక కారణాల వల్ల తలనొప్పి రావొచ్చు. కొన్నిసార్లు గంటల సమయం నుంచి రోజుల వరకు తలనొప్పి వేధిస్తుంటుంది. తల పగిలిపోయినట్లు అనిపించే ఈ బాధ నుంచి బయటపడేందుకు చాలామంది నొప్పి నివారణ బామ్‌లు, పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకుంటుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సులభంగా, ఇంటి చిట్కాలతోనే తలనొప్పి నుంచి సత్వర ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

- నీటిని తగినంత తీసుకోకపోయినా తలనొప్పి వస్తుంటుంది. కాబట్టి రోజుకు 8-10 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి.
- కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవాలి.
- ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది. గోరు వెచ్చని ఆవుపాలు సైతం తలనొప్పి నివారణిగా పనిచేస్తుందట.

- బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు జీడిపప్పు, బాదం వంటి డైఫ్రూట్స్‌ను గుప్పెడు తింటే తలనొప్పి తగ్గుతుందట.
- మెగ్నీషియం లోపంతో కూడా తలనొప్పి వేధిస్తుంది. అందుకని మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవాలి.
- మంచినీటిలో ధనియాలు, చక్కెర కలిపి తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- గంధం చెక్కను అరగదీసి నుదిటిపై రాయడం ద్వారా కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

- నిత్యం క్రమం తప్పకుండా 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. దీంతో పాటు వేళకు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి.
- ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

- అల్లం ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలని కలిగి ఉంటుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు అల్లం టీని తాగడం వల్ల ఇన్‌స్టెంట్ రిలీఫ్ లభిస్తుంది.
#
Tags : 1