Breaking News

నూతన ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించనున్న నీతా అంబానీ..ఏకంగా లక్షలాదిమంది..

Published on Sun, 10/27/2024 - 12:52

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్‌ నీతా అంబానీ నూతన ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 10 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నూతన ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించారు. అందులో భాగంగా సుమారు 50 వేల మంది పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు ఉచిత స్క్రీనింగ్‌ పరీక్షలు, చికిత్స, 50 వేల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ కేన్సర్‌లకు ఉచిత స్క్రీనింగ్‌ పరీకలు, చికిత్స, అలాగే దాదాపు పదివేల మంది బాలికలకు ఉచిత గర్భాశయ కేన్సర్‌ వ్యాక్సినేషన్‌ వంటి సేవలను అందజేయనున్నట్లు నీతా అంబానీ ప్రకటించారు.

ప్రతి భారతీయుడికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి ఇలా సరసమైన ధరలో తమ రిలయన్స్‌ ఫౌండేషన్‌ వైద్యసేవలు  అందిస్తోందన్నారు. ఇప్పటి వరకు తమ ఫౌండేషన్‌ ద్వారా మిలియన్లమందికి జీవితాలను ప్రసాదించి లెక్కలేనన్ని కుటుంబాల్లో కొత్త ఆశను అందించామని అన్నారు. అలాంటి ప్రతిష్టాత్మక సేవలందింస్తోన్న తమ రిలయన్స్‌ ఫౌండేషన్‌ సంస్థ పదేళ్ల వార్షికోత్సవం సందర్భంగా అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు, మహిళలకు మరిన్ని సేవలందించేలా ఇలా కొత్త ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంబించామని అన్నారు. 

మంచి ఆరోగ్యం సంపన్న దేశానికి  పునాది అని, అలాగే ఆరోగ్యవంతమైన స్త్రీలు, పిల్లలు సమాజానికి పునాది అని తాము విశ్వసిస్తున్నామని అన్నారు. కాగా, రిలయన్స్‌ పౌండేష్‌ గత దశాబ్ద కాలంలో  1.5 లక్షల మంది పిల్లలతో సహా 2.75 మిలియన్ల భారతీయులకు వైద్య సేవలను అందించింది. 

అత్యాధునిక వైద్యం అందించడంలో అత్యుత్తమైన ఆస్పత్రిగా నిలిచింది. అంతేగాదు ఐదు వందలకు పైగా అవయవ మార్పిడి తోపాటు కేవలం 24 గంటల్లో ఏకంగా ఆరు అవయవాల మార్పిడి చేసి బహుళ ప్రాణాలను కాపాడిని ఆస్పత్రిగా రికార్డు సృష్టించింది. ఇది భారతధేశంలోనే నెంబర్‌ వన్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ గుర్తింపు పొందింది.  

(చదవండి: బ్రెయిన్‌ స్ట్రోక్‌: ఇన్‌టైంలో వస్తే.. అంతా సేఫ్‌..!)
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)