Breaking News

మనిషిని మార్చే సాన్నిధ్యం

Published on Tue, 04/01/2025 - 10:24

వర్ధమాన మహావీరుని కాలంలోనే మక్కలి గోశాల్, అజిత్‌ కేశకంబల్, సంజయ్‌ విలేతిపుత్ర అనే ప్రముఖులూ ఉండేవారు. వారంతా మహామేధావులు, పండితులు, చక్కటి సంభాషణా చతురత గల వారు. ఒక్కొక్కరికీ వేలమంది శిష్యులుండేవారు. వారు వారి గురువు లను ‘తీర్థంకరుడు’ అనే గౌరవానికి అర్హులుగానే భావించేవారు. కానీ మహావీరుడు ‘తీర్థంకరుడై’ వేల ఏండ్లుగా జనంచే పూజింపబడుతున్నాడు. కానీ వారేమో చక్కటి వాగ్ధాటి, పాండిత్యం ఉన్న వారైనా కనుమరుగై కాలగర్భంలో కలిసి పోయారు.

ఎక్కువ కాలం మౌనంగా ఉండి, ఎపుడో నాలుగు మాటలు చెప్పిన మహావీరుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. కారణం ఏమై ఉంటుంది? మహావీరుని జ్ఞానం స్వాను భవంతో వచ్చినది, ఇతరులది కేవలం శాస్త్ర పాండిత్యం. అంతరంగంలోని కరుణ నుండి వెలువడిన వాక్కులు మహావీరునివి! వారి వేమో మెదడు నుండి బయల్పడినవి. మహావీరుని మాట కాదు... ఆయన ఉనికే చుట్టూ వున్న వారిపై గణనీయమైన ప్రభావం చూపి వారిలో సమూల మార్పు తెచ్చేది.

ఆనాడు దొంగతనం చేసి కుటుంబ పోషణ చేసే ఒక గజదొంగ తన అంత్యదశలో తన కుమారుడికి ఇచ్చిన సలహా: ‘నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ మహావీరుడున్న ప్రాంతానికి వెళ్ళవద్దు. ఈ ఊరికి ఆయన వచ్చాడని తెలిస్తే వెంటనే నీవు పొరుగూరికి పారిపో. పొరబాటున కూడా ఆయన చెప్పే ఒక్క మాట కూడా నీ చెవిలో పడకుండా జాగ్రత్త పడు. ఒక్క మాట విన్నా నీవు మన వృత్తిని కొనసాగించలేవు, కుటుంబ పోషణ చేయలేవు జాగ్రత్త.’ దీన్ని బట్టి మహావీరుని మాట ఎంతటి ప్రభావం చూపగలదో అర్థం చేసుకోవచ్చు. (27-35 పుటలు: హిడెన్‌ మిస్టరీస్‌–ఓషో) పుణ్య పురుషుల సాన్నిధ్యంలో క్రూరమృగాలు సాధు జంతువులవుతాయి, దుర్మార్గులు సన్మార్గులవుతారు.
– రాచమడుగు శ్రీనివాసులు

 

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)