Breaking News

శరీరం 10 శాతం కాలితే ఐసీయూ కాపాడలేదా?

Published on Thu, 06/04/2026 - 07:45

న్యూఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం దేశ రాజధానిని ఒక్కసారిగా కుదిపేసింది. ఈ ప్రమాదంలో 21 మంది సజీవ దహనమవ్వడం అత్యంత విషాదకరం. అయితే, ఈ దారుణ ఘటన భారతదేశ అత్యవసర వైద్య సేవల్లో, ముఖ్యంగా కాలిన గాయాల బాధితులకు అందించే చికిత్సా వసతులలో ఉన్న ఒక తీవ్రమైన లోపాన్ని మరోసారి బహిర్గతం చేసింది. బాధితులను కాపాడటంలో సాధారణ ఐసీయూల పరిమితులు ఏంటో ఈ ప్రమాదం కళ్లకు కట్టినట్లు చూపింది.

10 శాతం మార్క్ కీలకం
ఒక వ్యక్తి శరీర ఉపరితల వైశాల్యం(టీబీఎస్‌ఏ)లో కేవలం 10 శాతానికి మించి కాలిన గాయాలైతే, ఆ బాధితుడి శరీరం స్పందించే తీరు పూర్తిగా మారిపోతుంది. సాధారణ గాయాల కంటే ఇవి అత్యంత సంక్లిష్టమైనవి కావడం వల్లే ఈ 10 శాతం మార్క్ అనేది వైద్యంలో అత్యంత కీలకమైనదిగా మారుతుంది. మన చర్మం అనేది శరీరానికి ఒక రక్షణ కవచం లాంటిది. అది 10 శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్నప్పుడు, శరీరం నుండి ద్రవాలు వేగంగా ఆవిరైపోతాయి. దీనివల్ల రక్తపోటు పడిపోవడం, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు సోకడం, చివరికి శరీరంలోని కీలక అవయవాలు పని చేయడం మానేసే ప్రమాదం పొంచి ఉంటుంది.

సాధారణ ఐసీయూలలో..
సాధారణ ఐసీయూలను గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, శ్వాసకోస సమస్యలు లేదా ఇతర తీవ్రమైన ఇన్ఫెక్షన్ల నిర్వహణ కోసం రూపొందిస్తారు. కానీ 10 శాతానికి పైగా తీవ్రంగా కాలిన రోగులకు కావలసిన ప్రత్యేక సదుపాయాలు అక్కడ ఉండవు. కాలిన గాయాల బాధితులకు నిరంతరం గాయాలను శుభ్రం చేయడం, శరీర ద్రవాలను భర్తీ చేయడం, ప్రత్యేక పోషకాహారం అందించడం, కొన్ని వారాల పాటు వరుస సర్జరీలు చేయడం అవసరమవుతుంది. ఈ బహుళ అవసరాలకు సరిపోయే సదుపాయాలు సాధారణ ఐసీయూలలో అందుబాటులో ఉండవు. అందుకే ఇవి తీవ్రమైన బర్న్ కేసులకు సరిపోవు.

ప్రత్యేక బర్న్ ఐసీయూలలో..
కాలిన గాయాల బాధితులకు అతిపెద్ద శత్రువు ఇన్ఫెక్షన్. చర్మం దెబ్బతినడం వల్ల బ్యాక్టీరియా సులభంగా రక్తంలోకి ప్రవేశించి ‘సెప్సిస్’ అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది. అందుకే  ప్రత్యేక బర్న్ ఐసీయూలను (Burn ICUs) ప్రత్యేకమైన ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలతో, ఐసోలేషన్ సదుపాయాలతో నిర్మిస్తారు. అక్కడి సిబ్బందికి బర్న్ మేనేజ్‌మెంట్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సాధారణ వార్డులలో లేదా ఐసీయూలలో ఉండే గాలి ద్వారా కూడా ఈ రోగులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది.

పొగను పీల్చడం వల్లే..
మాలవీయ నగర్ ప్రమాదంలో మెజారిటీ బాధితులు మంటల కంటే ముందుగా దట్టమైన విషపూరిత పొగను పీల్చడం వల్లే మరణించారని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్నిప్రమాదాల్లో పొగ అనేది ఒక అదృశ్య హంతకి. విషవాయువులు, వేడి గాలి ఊపిరితిత్తులను, శ్వాసనాళాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే పైకి తక్కువ గాయాలు కనిపించినప్పటికీ, విషపూరితమైన పొగ పీల్చడం వల్ల తలెత్తే సమస్యలకు ప్రత్యేక విభాగాల్లోనే చికిత్స అందించాల్సి ఉంటుంది.

బర్న్ కేర్ మౌలిక వసతుల లేమి..
ప్రస్తుతం భారతదేశం బర్న్ కేర్ మౌలిక వసతుల కొరతను ఎదుర్కొంటోంది. దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల మందికి పైగా జనం కాలిన గాయాల బారిన పడుతుండగా, సుమారు 1,40,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత భారీ సంఖ్యలో బాధితులు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా కేవలం 67 నమోదిత బర్న్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో ప్రత్యేక బెడ్ల సంఖ్య కేవలం 1,330 మాత్రమే కాగా, బర్న్ ఐసీయూ బెడ్లు 300 కంటే తక్కువగా ఉన్నాయి. మాలవీయ నగర్ లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రమే మన దేశంలో ఉన్న ఈ మౌలిక వసతుల కొరత తీవ్రత వార్తల్లో కనిపిస్తుంటుంది.

ఇది కూడా చదవండి: ‘చికెన్స్ నెక్‌’పై భారత్ పట్టు.. చైనా, ‘బంగ్లా’ కుట్రలకు చెక్‌!

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)