Breaking News

రక్తంలో హిమోగ్లోబిన్‌ పెంచే ఉసిరి!.. ఆమ్ల క్యాండీ తయారీ ఇలా

Published on Fri, 11/04/2022 - 09:57

ఆరోగ్యసిరినిచ్చే ఉసిరితో ఆమ్ల క్యాండీ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఆరోగ్య ప్రయోజనాలు అందిపుచ్చుకోండి.
ఆమ్ల క్యాండీ తయారీకి కావలసినవి:
►ఉసిరి కాయలు – 250 గ్రాములు
►చక్కెర – 150 గ్రాములు
►జీలకర్ర పొడి– టీ స్పూన్‌

►శొంఠి పొడి– టీ స్పూన్‌
►చక్కెర పొడి –2 టీ స్పూన్‌లు
►ఫుడ్‌ కలర్‌ – చిటికెడు (ఇష్టమైతేనే).

తయారీ:
►ఉసిరికాయలను శుభ్రంగా కడగాలి.
►ఒక పాత్రలో వేసి కాయలు మునిగేటట్లు నీటిని పోసి మరిగించాలి.
►నీరు మరిగిన తర్వాత ఉసిరికాయలను వేసి రెండు నిమిషాలు మరిగించిన తర్వాత పాత్రను స్టవ్‌ మీద నుంచి దించి నీటిని వంపేయాలి.
►ఉసిరికాయలను కట్‌ చేసి గింజలను తీసివేయాలి.

►ఉసిరి పలుకులలో జీలకర్ర, అల్లం పొడి, చక్కెర వేసి పాత్రకు మూతపెట్టి పక్కన పెట్టాలి.
►మరుసటి రోజుకు చక్కెర కరిగి ఉసిరి పలుకులు చక్కెర ద్రావణంలో తేలుతుంటాయి.
►మూడవ రోజుకు చక్కెర ద్రావణాన్ని ఉసిరి పలుకులు దాదాపుగా పీల్చుకుంటాయి.

►మూడవ రోజు ఉదయం ఉసిరి ముక్కలను ఒక పాలిథిన్‌ షీట్‌ మీద వేసి ఆరనివ్వాలి.
►తేమ పూర్తిగా పోవాలంటే రెండు రోజులు ఎండలో ఆరబెట్టాలి.

►తగినంత ఎండ లేకపోతే మూడవరోజు కూడా ఆరబెట్టాల్సి ఉంటుంది.
►చివరగా చక్కెర పొడిలో ఫుడ్‌ కలర్‌ కలిపి ఆ పొడిని ఎండిన ఉసిరి పలుకుల మీద చల్లాలి.
వీటిని గాలిచొరని సీసాలో నిల్వ చేసుకుని రోజుకొకటి తినవచ్చు.

ఆరోగ్య లాభాలు
►ఇవి రక్తంలో హిమోగ్లోబిన్‌ పెరగడానికి దోహదం చేస్తాయి.
►నోరు రుచిలేనట్లు ఉన్నప్పుడు భోజనానికి గంట ముందు ఒక పలుకు తింటే రుచిగ్రంథులు ఉత్తేజితమవుతాయి.
►గర్భిణికి కడుపులో వికారం తగ్గిస్తుంది.

చదవండి: Health Tips: రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఇందులో ఉండే క్రోమియం వల్ల

ఇవి కూడా ట్రై చేయండి: Green Peas Akki Roti: బియ్యప్పిండి, పచ్చి బఠాణీలతో.. గ్రీన్‌ పీస్‌ అక్కీ రోటీ తయారీ 
కోవా, బెల్లం కోరు, డ్రై ఫ్రూట్స్‌.. నోరూరించే పన్నీర్‌ హల్వా తయారీ ఇలా

Videos

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)