Breaking News

సంగీతాన్ని నమ్ముకున్న పోలీసులు..

Published on Sun, 07/07/2024 - 03:29

ఫిన్లండ్‌ తీరనగరం ఎస్పో బీచ్‌లో యువతీ యువకులు తరచు గోలగోలగా పార్టీలు చేసుకోవడం, ఆగడాలకు పాల్పడటం, బీచ్‌కు వచ్చే సాధారణ జనాలతో దురుసుగా ప్రవర్తించడం కొంతకాలంగా సమస్యగా ఉంటూ వచ్చింది. అదుపులేని యువత తరచుగా ఆగడాలకు పాల్పడుతుండటం అక్కడి పోలీసులకు తలనొప్పిగా మారింది.

ఫిర్యాదులు వచ్చిప్పుడల్లా నిందితులను నిర్బంధంలోకి తీసుకోవడం, వారి మీద కేసులు పెట్టడం వంటి చర్యలు చేపడుతున్నా, వాటి వల్ల పెద్దగా ఫలితాలు కనిపించలేదు. ఆకతాయి యువతను బీచ్‌కు దూరంగా ఉంచడానికి ఏదో ఒకటి చేయాలని, సాధారణ ప్రజలు బీచ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంచరించే వాతావరణం కల్పించాలని పోలీసులు నిశ్చయించుకున్నారు.

అయితే, వారు మన పోలీసుల మాదిరిగా లాఠీలను నమ్ముకోలేదు, సంగీతాన్ని నమ్ముకున్నారు. పాప్, ర్యాప్‌లాంటి హోరెత్తించే సంగీతాన్ని ఇష్టపడే యువతకు శాస్త్రీయ సంగీతం అంటే సరిపడదని తెలివైన పోలీసు అధికారి ఒకరు గుర్తించారు.

ప్రయోగాత్మకంగా బీచ్‌లో జనాలు ఎక్కువగా గుమిగూడే ప్రతిచోటా లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేసి, శాస్త్రీయ సంగీతాన్ని వినిపించడం మొదలుపెట్టారు. శాస్త్రీయ సంగీతం ధాటికి ఆకతాయి యువత క్రమంగా బీచ్‌వైపు రావడం మానుకున్నారు. పోలీసుల సంగీతం చిట్కా ఫలించడంతో ఎస్పో నగరవాసులూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇవి చదవండి: ఈ వింతజీవి గురించి మేరెప్పుడైనా విన్నారా..!?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)