Breaking News

కలియుగ కుంభకర్ణుడు: ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే!

Published on Sun, 09/14/2025 - 09:55

రామాయణంలో కుంభకర్ణుడి సంగతి అందరికీ తెలిసిందే! కుంభాలకు కుంభాలు భోంచేశాక శుభ్రంగా ఆరునెలల పాటు ఏకధాటిగా గుర్రుపెట్టి నిద్రపోయేవాడు. సుదీర్ఘకాలం నిర్విరామంగా నిద్రపోవాలంటే, ఎంతటి బద్ధకస్తులకైనా సాధ్యమయ్యే పనికాదు. అయితే, నాగపూర్‌లో పుర్ఖారామ్‌ అనే వ్యక్తిని మాత్రం అక్కడి జనాలు కలియుగ కుంభకర్ణుడని అంటున్నారు. అతగాడు ఒకేసారి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పాటు నిర్విరామంగా నిద్రపోగలడట! ఆయనకు ‘యాక్సిస్‌ హైపర్‌సోమ్నియా’ అనే అరుదైన నిద్ర వ్యాధి ఉంది. ఈ వ్యాధి కారణంగా శరీరం క్రమంగా అలసిపోతుంది, మెదడు వేకప్‌ బటన్‌నే మరచిపోతుంది. 

ఈ వ్యాధి ఫలితంగానే పుర్ఖారామ్‌కు నిద్రే జీవితం అయ్యింది. ఇలా ఇతను ఒక సంవత్సరం మొత్తంలో 300 రోజులు నిద్రలోనే గడిపేస్తాడు. ఇతడి కథ విన్నవారు ‘ఒకవైపు ప్రపంచం రోజుకు 8 గంటల నిద్ర తప్పనిసరి అని పోరాడుతుంటే, ఇతనికి మాత్రం నిద్రలోనే జీవితం గడిచిపోతోంది’ అంటూ ఆశ్చర్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇతడి విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో, నిద్ర సంబంధ వ్యాధులపై అనేక చర్చలు మొదలయ్యాయి. 
 

#

Tags : 1

Videos

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)