Breaking News

క్రీమ్‌ కలర్‌ సిల్క్‌ చీరలో రష్మిక మందన్న గ్లామరస్‌ లుక్‌..!

Published on Tue, 04/28/2026 - 17:35

టాలీవుడ్‌ నటి రష్మిక మందన్న, విజయ దేవర కొండల పెళ్లి ఫిబ్రవరి 26,2026న ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ సాంప్రదాయ శైలిని ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దాలో పాఠాలు నేర్పుతూనే ఉంది. తన పెళ్లి వేడుక కోసం కిలోల కొద్దీ బంగారు ఆభరణాల నుంచి రిసెప్షన్‌లో ధరించి కూర్గీ శైలి చీర వరకు ప్రతి సందర్భంలోనూ ఫ్యాషన్‌ ప్రియులను గ్లామరస్‌ లుక్‌తో కట్టిపడేస్తోంది. 

ఒక అవార్డుల వేడుకు కోసం రష్మిక క్రీమ్‌ కలర్‌ సిల్క్‌ చీరలో తళుక్కుమంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబంధించిన ఫోటోలను రష్మిక షేర్‌ చేశారు. ఆమె స్టైలిస్ట్‌ గౌర్వి ప్రత్యర్తి మృణాలినీ రావు కలెక్షన్ల నుంచి ఎంపిక చేసుకున్నారు ఈ చీరను. ఈ సిల్క్‌ పట్టు మాదిరి చీరకు క్లిష్టమైన పూల జర్దోజీ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ చీరకు ఎరుపు రంగులోని ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ని జత చేశారు. దాంతో ఈ చీర అత్యంత హైలెట్‌గా నిలిచి అందరి చూపులను ఆకర్షించింది. 

అంతేగాదు ఈ చీర ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 1.68 లక్షలు పైనే పలుకుతుంది. అందుకు తగ్గట్టుగా చాలా నేచురల్‌ మేకప్‌, హెయిర్‌ స్టైల్‌ కోసం మధ్యలో పాపిడి తీసిన పోనీటెయిల్‌తో తన ఆహార్యాన్ని పూర్తి చేశారు. అలాగే తన శారీకి అనుగుణంగా మధ్యలో పచ్చరాయితో మెరుస్తున్న స్టేట్‌మెంట్ చెవిపోగులు, చిన్న నెక్‌చైన్‌, మంగళ సూత్రంతో సాంప్రదాయబద్దమైన మహిళలా అద్భుతంగా కనిపించారామె. 

అంతేగాదు రష్మిక బ్యూటీఫుల్‌ ఫోటోలను రీపోస్ట్‌ చేస్తూ సదరు బ్రాండ్‌ ఇలా రాసింది. "మృణాలినీ రావు దుస్తులలో మిమ్మల్ని చూడటం మాకు ఎల్లప్పుడూ ఇష్టమే! ఈ చీరలో అద్భుతంగా కనిపిస్తున్నారు." అని పేర్కొంది.

 

(చదవండి: విమానం గాల్లో ఉండగానే ప్రసవం..! అయితే..)

 

Videos

ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్

కూటమి నేతల ఆర్గనైజ్డ్ క్రైమ్! అక్షరం మార్పు లేకుండా మక్కికి మక్కీ

Sir పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, మరింత జాగ్రత్తగా ఉండాలి

టీడీపీ ఆఫీసులకు భూ కేటాయింపు.. అమరావతి పేరుతో ఏపీ సర్కార్ మరో దుబారా

ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు

తిరుమలలో కొత్త జంట సందడి

మంగ్లీ తమ్ముడి అకౌంట్ ఫ్రీజ్.. బయటపడ్డ షాకింగ్ నిజాలు

అది జగనన్న బ్రాండ్. మీరు ఎంత గింజుకున్నా అది అవ్వదు

ఆరెంజ్ అలర్.. ఢిల్లీలో వడగళ్ల వాన

విజయ్ దే గెలుపు.. 120 సీట్ల విజయం ఖాయం!

Photos

+5

మల్లెపూల దండలతో సురేఖవాణి బర్త్ డే వేడుక.. ఢిఫరెంట్‌ లుక్‌లో కనిపించిన నటి (ఫోటోలు)

+5

రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్‌డే విషెస్ (ఫోటోలు)

+5

తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల పెళ్లి (ఫోటోలు)

+5

ఎపిక్.. మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హీరోయిన్ మెహ్రీన్ మెహందీ వేడుక (ఫొటోలు)

+5

అభిమానులతో కలిసి సమంత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సొంతూరిలో పూజాహెగ్డే.. భక్తిలో మునిగిపోయి (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (ఫొటోలు)

+5

ఏ‍ప్రిల్ గడిచిందిలా.. హీరోయిన్ రీతూవర్మ (ఫొటోలు)