Breaking News

అరుదైన ఆపరేషన్‌.. మెడలోంచి మెదడులోకి 8 సెం.మీ మేకు!

Published on Fri, 05/30/2025 - 11:51

లక్నో: అరుదైన శస్త్రచికిత్సలో, కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU) వైద్యులు ఒక బాలుడి మెడలో గుచ్చుకున్న డైరెక్ట్‌గా మేకు మెదడులోకి  దిగిపోయింది.  ఎనిమిది సెంటీమీటర్ల పొడవున్న ఇనుప మేకును తొలగించడానికి 10 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించడం విశేషంగా నిలిచింది.. ఈ ఘటన  ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.  

బలరాంపూర్‌ జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలుడు ఆడుకుంటూ ఇనుప మేకుపై పడిపోయాడు. సుమారు 8 సెంటీమీటర్ల పొడవైన ఆ మేకు అతడి మెడను చీల్చుకుంటూ, అత్యంత సున్నితమైన మెదడు భాగంలో దిగబడింది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ కిందపడిన బాలుడి మెడకు గుచ్చుకున్న మేకు మెదడులోకి దిగబడింది. అత్యంత సున్నితమైన మెదడు భాగంలోకి దిగబడిన మేకును వైద్యులు పది గంటలపాటు శ్రమించి, విజయ వంతంగా వెలికి తీశారు. 

ఇదీ చదవండి: Miss world 2025 పెరిగిన ఇమేజ్‌!

బాధిత బాలుడిని కుటుంబసభ్యులు లక్నోలోని కింగ్‌ జార్జి మెడికల్‌ యూనివర్సిటీ (కేజీఎంయూ) కు తీసుకువచ్చారు. చాలా ప్రమాదకరమైన కేసుగా నిర్ధారణకు వచ్చిన ఆస్పత్రి  నిపుణుల బృందం మైక్రో సర్జికల్‌ సాంకేతికతను, న్యూరో నేవిగేషన్‌ వ్యవస్థను వాడుకుంటూ అత్యంత జాగ్రత్తగా రక్త నాళాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 10 గంటలపాటు సాగిన అత్యంత సంక్లిష్టమైన ఈ సర్జరీ విజయవంతమైంది. బాలుడు నెమ్మదిగా కోలుకున్నాడని, ప్రమాదం నుంచి బయటపడ్డాడని వైద్యులు తెలిపారు. అరుదైన ఈ ఆపరేషన్‌ వివరాలు త్వరలో అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితం కానున్నాయని చెప్పారు. 

చదవండి: అమెరికా నుంచి 1,080 మంది భారతీయుల బ‌హిష్క‌ర‌ణ‌
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)