Breaking News

ఏకంగా 26 కిలోల బరువు తగ్గి షాకిచ్చిన ‘మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌’!

Published on Fri, 03/22/2024 - 13:38

నటించే పాత్రకు తగ్గట్టు పరకాయ ప్రవేశం చేయడం నటుల ప్రాథమిక లక్షణం. కట్టూ బొట్టు, ఆహార్యం ఇలా అన్నింటిలోనూ  ఆ పాత్రకు న్యాయం చేసేందుకు నటీనటులు చాలా కష్టపడతారు. ప్రేక్షకుల‌ని అల‌రించేందుకు ఎంతో రిస్క్‌ చేసి మరీ త‌మ బాడీని మ‌ల‌చుకుంటారు. అలాంటి వారిలో తాజాగా రణదీప్‌ హుడా మరోసారి ప్రత్యేకంగా నిలిచాడు. 'స్వతంత్ర వీర్ సావర్కర్' బయోపిక్‌ కోసం విపరీతంగా బరువు తగ్గి తన లుక్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

పాత్రకు తగ్గట్టు శరీరాన్ని, ఆహార్యాన్నిమార్చుకోవడంలో రణదీప్‌ ప్రత్యేకతే వేరు.అందుకే రణదీప్ హుడాను హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ బాలేతో పోల్చుతారు. 2016లో సరబ్‌జిత్ సినిమా కోసం 20 కిలోలు, అదే ఏడాది దో లఫ్జోన్ కి కహానీ సినిమా కోసం తన బరువును 77 కిలోల నుంచి 94 కిలోలకు చేరేలా కష్టపడ్డాడు. విలక్షణ శైలితో విమర్శకుల ప్రశంసలు పొందిన నటుడాయన.  'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' నుంచి సరబ్‌జిత్ సింగ్‌, ఇపుడు వీర సావర్కర్‌ దాకా పాత్రల్లో జీవించే ప్రతిభావంతుడైన నటుడు.

సోదరి డా. అంజలి సాయం
తాజాగా స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రంలో వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్రను పోషించాడు. ఈ పాత్రకోసం రణదీప్ ఏకంగా 26 కిలోల బరువు తగ్గాడు. సెల్యులార్ జైల్లో ఉన్నప్పుడు 'కాలా పానీ' పాత్ర సజీవంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నాడు. రణదీప్ హుడా సోదరి, డాక్టర్ అంజలి సాయం తీసుకున్నాడట. ఆమె రూపొందించిన పాలియో డైట్‌తో బక్క చిక్కిన దేహంతో ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేశాడు. 

నిపుణుల సమక్షంలో పాలియో డైట్‌
సోదరి డాక్టర్ అంజలి హుడా వృత్తిరీత్యా ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అని,తన కోసం పాలియో డైట్‌ను రూపొందించిందని స్వయంగా రణదీప్‌ హుడా వెల్లడించాడు. వివిధ దశలలో గుడ్లు, నట్స్‌, ఖర్జూరాలు , డార్క్ చాక్లెట్‌లు డైట్‌ చేర్చుకున్నానని  తెలిపాడు.  దీంతోపాటు ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ ద్వారా ఐదు రోజుల వ్యవధిలో 6-7 కిలోల బరువు తగ్గాననీ, ఈ జర్నీలో విటమిన్ సప్లిమెంట్లను కూడా తీసుకున్నానని చెప్పాడు. నిపుణుల పర్యవేక్షణలోనే ఇదంతా చేశానని చెప్పుకొచ్చాడు. పెర్‌ఫెక్ట్‌గా ఉండటమే తనకిష్టమని తెలిపాడు. ఖర్జూరం, పాలుతో బరువు తగ్గుతారు అనేది ఫేక్‌ న్యూస్‌ అని కూడా చెప్పాడు. అంతేకాదు ఈ సినిమాకు దర్శకుడిగా రణదీప్‌ ఎంట్రీ ఇవ్వడం విశేషం.  మార్చి 22 న ఈ మూవీ విడుదలైంది.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు