Breaking News

మూవీ కోసం స్పీడ్‌గా బరువు తగ్గిన రణదీప్‌..తలెత్తుతున్న దుష్ప్రభావాలు!

Published on Fri, 04/12/2024 - 18:23

బాలీవు​డ్‌ నటుడు రణదీప్ హుడా  స్వాతంత్య్ర వీర్ సావర్కర్ కోసం విపరీతంగా బరువుత తగ్గిపోయాడు. అదికూడా తక్కువ వ్యవధిలోనే కిలోల కొద్ది బరువు తగ్గాడు. చూడటానికి కూడా గుర్తుపట్టలేనంతంగా అతడి శరీర ఆకృతి మారిపోయింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు కూడా. దీంతో అతడు వీలైనంత తొందరగా యథాస్థితికి వస్తానని వారికి హామీ ఇచ్చి మరీ ఇందుకు ఉపక్రమించాడు రణదీప్‌. అలా అతడు ఏకంగా 18 కిలోల వరకు తగ్గిపోయాడు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. అతడు మళ్లీ యథాస్థితికి వచ్చే క్రమంలో శరీరం సహకరిచటం లేదు. పైగా తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. నిజానికి ఇలా వేగంగా బరువు తగ్గటం మంచిదేనా? తలెత్తే దుష్ప్రభావాలేంటీ..?

పోషకాహార లోపాలు
వేగంగా బరువు తగ్గడానికి ఫ్యాడ్ డైట్‌లను అనుసరిస్తే, పోషకాహార లోపానికి దారితీస్తుంది. అటువంటి ఆహారాన్ని అనుసరిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోనక తప్పదు. బరువు తగ్గడం కోసం ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులను వేరే వాటితో భర్తి చేస్తే.. మరింత సమస్యలు ఫేస్‌ చేయాల్సి వస్తుంది. 

జుట్టు రాలడం
శరీరం స్పీడ్‌గా తగ్గే ప్రయత్నంలో  విటమిన్లు, ఖనిజాల కొరతకు దారితీస్తుంది. దీంతో జుట్టు రాలు సమస్యను ఎదుర్కొంటారు. బరువుతగ్గే క్రమంలో పోషకాలను అస్సలు పరిమితం చేయకూడదు.

కండరాల నష్టం
క్యాలరీ-నిరోధిత ఆహారంలో కొవ్వు తగ్గడం ఎలా ఉన్నా..కండరాలపై తీవ్ర ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఇది నెమ్మదిగా కండరాలను తినడం ప్రారంభిస్తుంది.అంతేగాదు వేగంగా బరువు కోల్పోవడం వల్ల కండరాల తిమ్మిర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. 

స్లో మెటబాలిజం
బరువు వేగంగా తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఎందుకంటే.. చాలా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. అలాగే హార్మోన్లలో మార్పులకు దారితీస్తుంది. ఈ రెండు కారణాల వల్ల జీవక్రియ మందగించి.. మెటబాలిజం దెబ్బతింటుంది.

డీహైడ్రేషన్
బరువు తగ్గే క్రమంలో డీహెడ్రేషన్​కు అనుమతించకూడదు. ఇలా ద్రవాలను తక్కువగా తీసుకునే యత్నం చేస్తే..ఇది చర్మాన్ని పొడిగా చేసి.. నిస్తేజంగా మార్చేస్తుందని వెల్లడించారు.

ఇతర సమస్యలు..

  • శక్తి తగ్గడం
  • పెళుసైన జుట్టు, గోర్ల పెరుగుదల లోపం
  • విపరీతమైన అలసట
  • రోగనిరోధక వ్యవస్థ
  • బోలు ఎముకల వ్యాధి
  • తలనొప్పి
  • చిరాకు
  • మలబద్ధకం

ఇలాంటి భయానక దుష్ప్రభావాలు ఎదురవ్వుతాయి. అందువల్ల మెల్లగా బరువు తగ్గడమే మంచిదని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. కానీ చాలామంది మూవీ కోసం, అందం కోసం వేగంగా బరువుతగ్గి చేజేతులారా సమస్యలు కొని తెచ్చుకుని ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

(చదవండి: డైట్‌లో ఇది చేర్చుకుంటే..మందులతో పనిలేకుండానే బీపీ మాయం!)

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)