భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!
Breaking News
హనుమాన్ చాలీసాతోనే రోజు మొదలు..!: రణబీర్ కపూర్
Published on Thu, 10/29/2026 - 11:33
నితేష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న భారీ పౌరాణిక చిత్రం 'రామాయణం: పార్ట్ 1' (Ramayana: Rise of a Legend) సినిమా బృందం, అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి 18' (KBC 18)లో సందడి చేయనుంది. అందుకు సంబంధించిన ఎపిసోడ్ ఈ వారాంతంలోనే(అక్టోబర్ 29,30) సోనీటీవీలో ప్రసారం కానుంది.
అయితే ఆ క్విజ్ ఆధారిత రియాలిటీషోలో రాముడిగా నటించిన రణబీర్‌కపూర్, సీతగా కనిపించనున్న సాయిపల్లవి, రవి దూబే వంటి వారు హాట్‌సీట్‌ని పంచుకోనున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం రణబీర్ కపూర్ అమితాబ్‌తో మాట్లాడిని సంభాషణ హాట్‌టాపిక్‌గా మారింది.
ఆ కార్యక్రమంలో రణబీర్ కపూర్ తన కుమార్తె రాహా పుట్టినప్పటి నుంచి తమ కుటుంబ దైనందిన జీవితంలో ఒక ఆధ్యాత్మిక అలవాటు భాగమైందని అమితాబ్‌తో చెప్పారు. అంతేగాదు ప్రతి రోజు ఉదయం తమ కుటుంబమంతా మీరు పాడిన హనుమాన్ చాలీసాతోనే రోజు ప్రారంభిస్తుందని వెల్లడించాడు. ముఖ్యంగా తన కుమార్తె రాహా పుట్టినప్పటి నుంచే ఈ ఆధ్యాత్మిక అలవాటు మొదలైందని చెప్పాడు.
అందుకు అమితాబ్ స్పందిస్తూ..వాహ్ చాలా అద్భుతం అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ ప్రోమోలో రణబీర్‌కపూర్ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడారు. ముఖ్యంగా అలియా భట్‌తో ఉన్న బంధం గురించి కూడా మనసు విప్పి మాట్లాడారు. తమ బంధానికి బలమైన పునాది వేసిన విలువల గురించి ఆయన వివరించారు. ప్రేమ, వివాహంపై తన అభిప్రాయాలను పంచుకుంటూ రణబీర్ ఇలా అన్నారు. ‘మా బంధానికి మూలం స్నేహం అని భావిస్తాను. ఎందుకంటే ప్రేమ బంధాన్ని కలుపుతుంది. నమ్మకం బంధాన్ని దృఢపరుస్తుంది. గౌరవం బంధాన్ని నిలబెడుతుంది.
ఇవే ఒక బంధానికి అత్యంత ముఖ్యమైన పునాదులు అని ప్రగాడంగా విశ్వసిస్తున్నా.’ అని పేర్కొన్నాడు రణబీర్. కాగా, ఈ జంట 2022లో ఒక ప్రైవేటు వేడుకలో వివాహం చేసుకున్నారు. అదే ఏడాది వారికి ఒక కుమార్తె రాహా జన్మించింది. 2023 డిసెంబర్‌లో క్రిస్మస్ వేడుకల సందర్భంగా తమ కుమార్తె ముఖాన్ని తొలిసారిగా బహిరంగంగా చూపించి అభిమానులను అలరించారు.
ఇదీ చదవండి: మనసంతా తిండి మీదే! ఆ రీజన్ వల్లే ఈ సమస్య..
Tags : 1