Breaking News

'కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా?

Published on Mon, 09/30/2024 - 15:53

ఇడ్లీ అనంగానే తేలిగ్గా అరిగిపోయే వంటకం. చాలా సులభంగా జీర్ణమయ్యే అల్పాహారం కూడా. పేషెంట్లే కాదు, సామాన్య ప్రజల వరకు అందరూ బ్రేక్‌ఫాస్ట్‌ మొదటగా ఈ రెసిపీకే ప్రాధాన్యత ఇస్తారు. అంతలా ఇడ్లీలు అందరి మనసులో దోచుకున్న గొప్ప ప్రసిద్ధ వంటకంగా పేరుగాంచింది. అయితే వీటిని పలు రకాలుగా చేస్తారు. ఆయా ప్రాంతాల వారీగా చేసే విధానం మారుతుంటుంది. అందులోకి ఆరోగ్య స్ప్రుహతో మరింత ఆరో​గ్యవంతంగా ఆస్వాదించే వైరైటీ ఇడ్లీలు కూడా మన ఆహారంలో భాగమైపోతుండటం మరింత విశేషం. అయితే ఇడ్లీలకే కింగ్‌గా పిలిచే వెరైటీ ఇడ్లీ వంటకం గురించి విన్నారా..?.

ఇడ్లీలకే రాజుగా పేరుగాంచిన ఈ వంటకం కేరళలోని పాలక్కాడ్‌లోని గ్రామానికి చెందింది. ఈ ఇడ్లీలు మనం తినే ఇడ్లీలకు చాలా విభిన్నంగా ఉంటుంది. పేరుకు తగ్గట్టు ఆకృతి పరంగా పెద్దవిగానూ మల్లెపువ్వులా మృదువుగా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని తయారు చేసే విధానం కూడా అత్యంత విభిన్నంగా ఉంటుంది. పాలక్కాడ్‌లోని రామస్సేరి గ్రామం కింగ్‌ ఆఫ్‌ ఇడ్లీలకు పేరుగాంచింది. ఈ ఇడ్లీలనే తినేందుకు పర్యాటకులు ఈ గ్రామానికి తరలి వస్తుంటారా..!. వీటిని పాన్‌కేక్‌ మాదిరిగా తయారు చేస్తారు.

తయారు చేయు విధానం..
మట్టికుండపై ఒక గుడ్డ కప్పి ఆవిరిపై ఉడకబెడతారు. 200 ఏళ్ల క్రితం తమిళనాడు, కాంచీపురం, తిరుపూర్‌, తంజావూర్‌ వంటి ప్రాంతాల నుంచి కొన్ని ముదలియార్‌ కుటుంబాలు కేరళకు రావడంతో ఈ వంటకం పుట్టుకొచ్చిందని స్థానికులు చెబుతుంటారు. వాళ్లంతా బతుకుదెరువు కోసం రామస్సేరి అనే చిన్న గ్రామానికి వచ్చి స్థిరపడటంతో ఈ వంటకం ఉనికిలోకి వచ్చిందని ఓ కథనం. ఆయా కుటుంబాల్లో మగవాళ్లంత చేనేత కార్మికులు కాగా, మహిళలు రుచికరంగా వంట చేసేవారట. అలా ఈ రామస్సేరి ఇడ్లీలు ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఈ ఇడ్డీని తయారు చేసేందుకు ఉపయోగించే మెష్‌క్లాత్‌ ఇడ్డీని సమానంగా ఉడికేలా చేయగా, స్లీమింగ్‌ కోసం ఉపయోగించే మట్టికుండా ఆ ఇడ్లీలకు ఒక విధమైన రుచిని అందిస్తాయి.  

తయారీ..
కావాల్సిన పదార్థాలు..

  • కప్పుల బియ్యం (ఇడ్లీ బియ్యం మరియు ముడి బియ్యం)

  • ఉరద్ పప్పు 1 కప్పు

  •  నీరు  1 కప్పు 

  • మెంతు గింజలు 1 స్పూన్ 

  • తగినంత ఉప్పు

నాలుగు గంటలు పైనే నానబెట్టిటన మినపప్పు, బియ్యం, మెంతులు కలిపి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఉప్పు వేసి కనీసం ఓ పది నుంచి 12 గంటలు వదిలేయాలి. ఆ తర్వాత ఇడ్లీల్లా మట్టిప్లేటులో పెద్ద మొత్తంలో పరుచుకుని మట్టికుండపై ఉడికిస్తే.. ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రామస్సేరి ఇడ్లీలు రెడీ..!.

(చదవండి:

 

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)