Breaking News

ఓ మై గార్డ్‌...∙

Published on Sat, 06/06/2026 - 06:14

హీరో రామ్‌చరణ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘మీరు అతన్ని బాగా ఫేమస్‌ చేసేశారు, నేనిక అతన్ని బయటకు వెళ్లనివ్వబోవడం లేదు’ అంటూ జోక్‌ చేశారంటే... అది ఎవరి గురించి అయి ఉంటుంది? 

బహుశా రామ్‌ చరణ్‌ బాడీ గార్డ్‌ కెవిన్‌ కుంటా గురించే అయి ఉండొచ్చు.. అవును మరి... ఆయన ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాడు. ఈ బాడీగార్డ్‌ తమ కుటుంబంతో కలిసి దాదాపు నాలుగేళ్లుగా ప్రయాణిస్తున్నాడని, తమ వ్యక్తిగత దినచర్యల గురించి అతనికి బాగా అవగాహన ఉందని, పిల్లలతో కలిసి బయటకు వెళ్ళినప్పుడు తమతోపాటే ఉంటాడని రామ్‌ చరణ్‌ ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

వీడియోతో వైరల్‌...
నాలుగేళ్లుగా ఉన్నప్పటికీ...‘పెద్ది’ సినిమా దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాల సమయంలో మాత్రం రామ్‌చరణ్‌ పక్కనే నిలబడి నిలువెత్తు స్టైలిష్‌ లుక్‌లో కనిపించిన కెవిన్‌ అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరీ ముఖ్యంగా.. ఒక అభిమాని జాన్వి, చెర్రీల దగ్గరకు అకస్మికంగా దూసుకురాగా రెప్పపాటులో అడ్డుకున్న కెవిన్‌ అతడిని అమాంతం రెండు చేతుల్తో ఎత్తేసి అవలీలగా మోసుకుంటూ తీసుకెళ్లిన వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా అతను సెలబ్రిటీ బాడీగార్డ్స్‌లో సెలబ్రిటీగా మారిపోయాడు. మన దేశంలో తనకు లభిస్తున్న అనుకోని ఆదరణకు ఉబ్బితబ్బిబ్బయిన 28 ఏళ్ల కెవిన్‌ సోషల్‌ మీడియా ద్వారా నెటిజన్లకు, సినీ అభిమానులకు తనపట్ల వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేశాడు.

నేపథ్యం ఇదే...
ఇన్ స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌ ప్రకారం, కెవిన్‌ తాను గాంబియాలో జన్మించి ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్లో నివసిస్తున్న వ్యక్తిగా, అంతర్జాతీయ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఎ)ఫైటర్‌గా పరిచయం చేసుకున్నాడు. ఆన్ లైన్లో 81,900 మంది ఫాలోయర్లతో చెప్పుకోదగ్గ అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. అతని పోరాట రికార్డులు టాపోలజీ వంటి ఆన్‌లైన్‌ ΄్లాట్‌ఫార్మ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో అతను అబ్డో కాదిర్ర్‌ సోవె అనే అసలు పేరుతో నమోదవడం విశేషం. 

గాంబియా రెజ్లింగ్‌ అసోసియేషన్‌ గుర్తింపు ΄÷ందిన బిరుదు ల్యామిన్‌ ఆఫ్‌ బర్రాగా కూడా కెవిన్‌ రెజ్లింగ్‌ సర్కిల్‌లో సుపరిచితుడు. అతను గత నవంబరులో మిడిల్‌ వెయిట్‌ కేటగిరీలో ఎంఎంఎ ఫైట్‌లో పాల్గొన్నాడని కూడా సమాచారం. తన సేవలకు గానూ రోజువారీగా ఫీజు వసూలు చేసే కెవిన్‌... ప్రస్తుత సేవల ఖరీదు రోజుకు రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకూ ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా... ఒక ఇండియన్‌ సెలబ్రిటీ బాడీగార్డ్‌ ఇంత ఫాలోయింగ్‌ అందుకోవడం విశేషం. ఈ ఫాలోయింగ్‌ కెవిన్‌ను తెరకెక్కించే ఛాన్స్‌ కూడా లేకపోలేదు... చూద్దాం మరి! 

– ఎస్‌. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్‌

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)