Breaking News

రకుల్‌ ప్రీత్‌ ‘ఫెన్నెల్‌ టీ’ పోస్ట్‌ వైరల్‌, దీని లాభాలేంటో తెలుసా?

Published on Tue, 08/27/2024 - 17:32

అందానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేనటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌  ఫిట్‌నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.   క్రమంగా జిమ్‌ చేస్తూ, బలవర్ధక ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చే రకుల్‌ ప్రీత్‌ తాజాగా ఒకటీ గురించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో అసలు ఏంటీ ఫెన్నెల్‌ టీ, దీని ప్రయోజనాలేంటి అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. మరి ఫెన్నెల్ టీతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా?

ఫెన్నెల్‌ టీ అంటే సోంపు గింజలతో  తయారు చేసే టీ. దీన్నే ఫెన్నెల్ సీడ్స్ వాటర్,  లేదా ఫెన్నెల్-ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అని కూడా పిలుస్తారు.  ప్రతిరోజూ ఉదయం ఈ సోంపు గింజల నీళ్లను తీసుకోవడం ద్వారా అనేక అరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సోపు గింజలను నీటిలో వేసి కాచడం ద్వారా ఫెన్నెల్ టీని తయారు చేస్తారు. దీని రుచి చిరు చేదుగా, చక్కటి సువాసనతో ఉంటుంది. శతాబ్దాలుగా దీన్ని ఔషధంగా ఉపయోగిస్తున్నారు.

ఫెన్నెల్ టీ ఎలా తయారు చేయాలి
ఒక టేబుల్ స్పూన్ ఫుల్ ఫెన్నెల్ గింజలను తీసుకుని వాటిని రెండు కప్పుల  నీటిలో మరిగించాలి. ఆ నీటిని వడకట్టి చల్లబడిన తరువాత గానీ, వేడి వేడిగా కానీ సేవించవచ్చు ఉదయం ఖాళీ కడుపుతో ఫెన్నెల్ టీ తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
 

ఫెన్నెల్ టీ  లాభాలు
సోంపు గింజలలో ఉండే  విటమిన్ సీ ఐరన్, ఖనిజాలు నిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. సోంపు గింజల నీటిని తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల నుంచి రక్షణ అందిస్తుంది. ఫెన్నెల్‌ టీ వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సోంపు గింజలలో అనెథోల్ వంటి నూనెలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. జీర్ణక్రియలో సాయపడతాయి. సోంపు గింజలలో కార్మినేటివ్ గుణాలు ప్రేగు కదలికలను  మెరుగు పరుస్తాయి. జీర్ణశయాంతర ప్రేగులలోని కండరాలను ప్రేరేపించి, గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గించడంలో సాయపడతాయి. తద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే అజీర్ణం, గుండెల్లో మంటకు ఉపశమనం లభిస్తుంది. 

మధుమేహులకు లేదా డయాబెటిస్ రిస్క్ ఉన్నవారికి  ఇది చాలా ప్రయోజనకరం. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. సోంపు గింజల వాటర్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది.  వయస్సు-సంబంధిత మచ్చలు తగ్గుతాయి.  కంటి సమస్యల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.

సోంపు గింజలలో పొటాషియం ఉంటుంది. సోంపు గింజలలోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సాయ పడుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఫెన్నెల్ టీ పీరియడ్స్ క్రాంప్‌ల నుండి ఉపశమనం పొందడంలో సహాయ పడుతుంది. ఋతు చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.  కండరాలకు శాంతి కలుగుతుంది. దీంతో ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)