Breaking News

పర్వాల పూర్ణిమ..రాఖీ పౌర్ణమి పరమార్థం ఇదే!

Published on Thu, 08/07/2025 - 10:50

దైవీశక్తులతో కూడిన శ్రావణ శుద్ధ పూర్ణిమను రాఖీపూర్ణిమగా, జంధ్యాల పూర్ణిమగా జరుపుకుంటారు. శక్తిస్వరూపిణిగా వ్యవహరించబడే ఇంటి ఆడపడచు(సోదరి) చేత ఈరోజు రక్షాబంధనం కట్టించుకున్న సోదరులకు దేవతలు రక్షగా నిలిచి అరిష్టాలను తొలగిస్తారని, అన్నింటా అండదండగా నిలుస్తారని విశ్వాసం. రక్షాబంధన పండుగ పరమార్థం ఏమిటి?

తన సోదరుని జీవితం తీపివలె ఎల్లప్పుడూ కమ్మగా ఉండాలని, తలపెట్టే ప్రతికార్యం విజయవంతం కావాలని, అతనికి సకల సంపదలు చేకూరాలని కోరుతూ తోబుట్టువులు సోదరుని చేతికి రక్షాబంధనం కట్టే ఈ పండుగ నుంచి గ్రహించవలసిన పరమార్థం ఏమంటే–ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కల్మషమైన ప్రేమతో, స్వచ్ఛమైన మనస్సుతో జరుపుకునే ఈ పండుగ సమాజంలో అందరూ ఒకరికొకరు తోబుట్టువుల వంటి వారేనని, స్వంత సంబంధం లేకపోయినా, సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత, మమతానురాగాలు పరిఢవిల్లాలని, తోబుట్టువులు లేరని చింతించకండా సోదర ప్రేమ కలిగిన వారికి రక్షణగా నిలవాలన్నది ఈ పండుగ పరమార్థం. 

ఈరోజున బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు తదితర జంధ్యాన్ని ధరించే అన్ని కులాలవారు స్నానాన్ని ఆచరించి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. కొత్తగా ఉపనయనం జరిగిన వారికి ఉపాకర్మ జరిపిస్తారు. అందుకే దీనికి జంధ్యాల పూర్ణిమ అని పేరొచ్చింది.  ఈ రోజునే హయగ్రీవ జయంతి 
‘‘జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే’’ 
అంటూ  సర్వవిద్యలకూ ఆధారభూతంగా చెప్పుకునే హయగ్రీవుని స్తుతించడం వల్ల విద్యార్థులలో జ్ఞాపకశక్తి 
పెరుగుతుందని శాస్త్ర వచనం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)