Breaking News

షకీరా పాట‌కు.. దేశీ టచ్‌!

Published on Sat, 01/24/2026 - 17:30

సంగీతానికి సరిహద్దులు లేవని, ఏ భాష పాటకైనా మన మట్టి వాసనను అద్ది కొత్తగా మార్చవచ్చని రాజస్థానీ జానపద కళాకారులు నిరూపించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పాటకి మన స్థానిక సంస్కృతిని జోడించి.. అందరిచే వహ్‌ వా అనిపించుకుంటున్న వారి సృజనాత్మకతకు నెటిజనులు ఫిదా అయ్యారు.

ఆఫ్రికన్‌ రిథమ్స్‌తో సాగే షకీరా పాడిన వాకా వాకా అనే ఆ పాటకు మన మూలాలను జోడించడం అద్భుతం. ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌లో మూడుసార్లు పాల్గొన్న ఈ కళాకారుల బృందం, తమదైన శైలిలో రాజస్థానీ సాంప్రదాయ సంగీతంలోకి వాకా వాకా పాటను రీమిక్స్‌ చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు.

సారంగి, ఖర్తాల్, డోలక్‌ వంటి వాద్యాలతో ఈ గ్లోబల్ పాటకు దేశీ టచ్‌ ఇచ్చారు. ఈ పాట చివరలో వచ్చే దిస్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఆఫ్రికా అనే ప్రసిద్ధ పంక్తిని వారు వెల్కమ్‌ టు రాజస్థాన్‌ (Welcome to Rajasthan) అని మార్చడం ఇందులోని ప్రత్యేక ఆకర్షణ. రంగురంగుల తలపాగాలు, ఎంబ్రాయిడరీ జాకెట్లు, అద్దాలతో అలంకరించిన డ్రస్సులతో పక్కా రాజస్థానీ వాతావరణాన్ని కళ్లముందు ఉంచారు ఆ కళాకారులు.

రాజస్థానీ జానపద కళాకారుల బృందం ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో వైరలయ్యింది. బస్సు ప్రయాణంలో కూడా తమ కళను ప్రదర్శిస్తూ వారు పంచుతున్న ఆనందం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

 చ‌ద‌వండి: కొత్త పెళ్లికూతురి స్ట‌న్నింగ్ క్యాచ్‌..! 

 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)