Breaking News

వాన చినుకులలో వడ్డన..!

Published on Sun, 01/12/2025 - 08:27

ఒకవైపు వాన చినుకులు పడుతుంటే, మరోవైపు పక్కనే వేడి వేడి టీ, పకోడీలాంటివి ఉంటే ఎంత బాగుంటుంది! ‘అయితే, అలా తినాలంటే రోజూ కుదరదు కదా!’ అని బాధపడేవారికి ఒక చక్కని వార్త. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ నగరంలోని సియోంగ్‌ ప్రాంతంలో ఉన్న ‘రెయిన్‌ రిపోర్ట్‌ క్రాయిసెంట్‌’ హోటల్లో ప్రతిరోజూ వానాకాలాన్ని ఆస్వాదించొచ్చు. 

రెస్టారెంట్‌ ఇంటీరియర్‌ మొత్తం వాతావరణ వార్తలు, వర్షం పడే దృశ్యాలతో నిండి ఉంటుంది. హోటల్‌లో మొత్తం నిరంతరం వాన తుంపరలు పడేలా సెట్‌ చేశారు. వెదురు చెట్ల చుట్టూ కుర్చీలు, బల్లలు వేసి, పాదాలకు నీటి ప్రవాహం తగిలేలా అక్కడి ఫ్లోర్‌ను సెటప్‌ చేశారు. ఇక పక్కనే ప్రవహించే నీటిలో నేలపై కుర్చునే వీలుంది. అంతేకాదు, కుటుంబమంతా కలసి ఎంజాయ్‌ చేయడానికి రెండో అంతస్తులో ఒక మినీ సినీ థియేటర్‌ కూడా ఉంది.

సౌకర్యవంతమైన కుషన్స్‌లో పడుకొని సినిమా చూడొచ్చు. అక్కడ దొరికే  మెన్యూ ఐటమ్స్‌లోని పానీయాలు, వంటకాల పేర్లన్నీ కూడా రెయిన్‌ రిపోర్ట్‌ స్టయిల్‌లోనే ఉంటాయి. ఉదాహరణకు ‘సన్‌ షైన్‌’, ‘క్లౌడ్‌’, ‘రెయిన్‌ డ్రాప్‌’ ఇలా వివిధ వాతవరణ సూచనల పేర్లతో ఉండే క్రాయిసెంట్స్, ‘రెయిన్‌బో మిల్క్‌’, ‘సెసేమ్‌ క్లౌడ్‌’, ‘వెట్‌ క్లౌడ్‌’, ‘వైట్‌ లాట్టే’ వంటి పానీయాలు ఉన్నాయి. బాగుంది కదా! వానాకాలాన్ని ఆస్వాదించాలంటే వెంటనే ఈ రెయిన్‌ రిపోర్ట్‌ రెస్టరెంట్‌కి వెళ్లాల్సిందే మరి. 

(చదవండి: ఘోస్ట్‌ కోసం బీస్ట్‌ పిరమిడ్‌ వాసం)
 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)