Breaking News

గోల్డ్‌ డిజైనర్‌వేర్‌లో రాధికా మర్చంట్‌ స్టన్నింగ్‌ లుక్‌!

Published on Tue, 05/12/2026 - 12:34

భారతదేశ జాతీయ పెవిలియన్ ప్రారంభోత్సవాన్ని జరుపుకోవడానికి  అంబానీ కుటుంబం అంతా ఇటలీలోని వెనిస్‌కు చేరి అత్యంత అద్భుతమైన కళాత్మక దుస్తుల్లో కనిపించి అబ్బరుపరిచారు. తాజాగా ఈ 61వ అంతర్జాతీయ కళా ప్రదర్శన – లా బినాలే డి వెనిజియాలో అంబానీ చిన్న కోడలు సరికొత్త లుక్‌కి సంబంధించిన ఫోటోలు సన్సేషన్‌ సృష్టిస్తున్నాయి. 

ఎప్పటిలాగే రాధికా ఈ వేడుకలో తన గ్లామర్‌ లుక్‌తో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను రియా కపూర్ మే 11న ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫోటోలలో రాధికా ఫ్యాషన్‌ను భారతీయ హస్తకళలను మేళవించిన డిజైనర్‌వేర్‌ ఆధునిక కాలపు అందగత్తెలా మెరిశారామె. కస్టమ్‌ ఎర్డెమ్‌  ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తులలో రాధికా లుక్‌ అదుర్స్‌ అనిపించింది. 

యూరోపియన్‌ కౌంచర్‌ సౌందర్యాన్ని, భారతీయ వస్త్రాల గొపతనాన్ని మేళవించేలా డిజైన్‌ చేసింది. భారతీయ ఫ్యాబ్రిక్‌పై పూల మోటిఫ్‌లతో అలంకరించిన మెటాలిగ్‌ గోల్డ్‌ బ్రోకేడ్‌ ప్రధాన ఆకర్షణగా ఉంది. ఒక రకంగా ఈ డ్రెస్‌ ప్రపంచ వేదికపై భారతీయ నేత కార్మికుల నైపుణ్యాన్ని అందంగా ప్రదర్శించింది. ఈ డిజైనర్‌వేర్‌ ఆఫ్-షోల్డర్ డ్రేప్డ్ కార్సెట్ విత్‌ నేలవరకు జాలువారే కేప్‌ని కలిగి ఉంది. 

దాంతో రాధికా లుక్‌ని రాజసం ఉ‍ట్టిపడేలా చేసింది. దీనికి మ్యాచింగ్‌గా స్ట్రెయిట్-కట్ బేజ్ రంగు ప్యాంటుతో జతచేసి,ఆధునిక ఫ్యాషన్‌తో కలగలిసిన భారతీయ వారసత్వ సంప్రదాయాన్ని ప్రదర్శించింది. అందుకు తగ్గట్టుగా రాధికా మెరిసే ఐషాడో, వింగ్డ్ ఐలైనర్, మస్కారా పూసిన కనురెప్పలతో తన రూపాన్ని తీర్చిదిద్దుకుంది. హెయిర్‌ని కూడా పాపిడి తీసి మొత్తాన్ని కర్ల్స్‌లో వదిలేయడంతో మరింత గ్లామరస్‌గా కనిపించింది. కాగా రాధికా శిక్షణ పొందిన భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి. అలాగే ఆమె  తల్లిదండ్రులతో కలిసి ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యురాలిగా కార్పొరేట్ ప్రపంచంలో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

 

(చదవండి: వెనిస్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నీతా అంబానీ కుటుంబం)

 

Videos

అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

పూర్తి ఆధారాలతో వస్తా.. సిట్ కు బండి భగీరథ్ లేఖ

మందులు, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు విముక్తి

కేసులు పెట్టే ముందు ఆలోచించు! నూరి ఫాతిమా సీరియస్

వామ్మో బంగారం కొనలేం.. 2 లక్షలకు పెరిగే చాన్స్

అమెరికా విద్యార్థులకు బిగ్ షాక్.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై నిఘా

కృష్ణాజిల్లాలో దారుణం.. వైన్ షాప్ నిర్వాహకుడిపై టీడీపీ నేత దాడి

బండి భగీరథ్ ఎక్కడ? పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్

పోలీసుల విచారణకు హాజరుకాని బండి భగీరథ్..

కూల్ డ్రింక్ VS ఫ్రూట్ జ్యూస్...ఏది విషం? ఏది అమృతం?

Photos

+5

విడాకుల రూమర్స్.. ట్రెండింగ్‌లో మౌనీరాయ్ (ఫొటోలు)

+5

అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆలియా భట్ (ఫొటోలు)

+5

మధ్యాహ్నం 2 గంటల లోపు పీఎస్ కు రావాలని భగీరథ కు నోటీసులు

+5

గంగరంగ వైభవం గంగమ్మ జాతర...పోటెత్తిన జనం (ఫొటోలు)

+5

హనుమాన్ జయంతి... భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర...'బైరాగి వేషంలో మొక్క చెల్లించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

అనంతపురం జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

నారా రోహిత్‌ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)