Breaking News

గణేశ్‌ నిమజ్జనం: భర్తపై పూలు జల్లుతూ రాధికా అంబానీ.. !

Published on Fri, 08/29/2025 - 15:20

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముఖేశ్‌ అంబానీ ఇంట ఏ పండుగైనా ఏ రేంజ్‌లో జరుగుతుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ప్రథమ పూజలందుకునే గణేశ్‌ చతుర్థి గురించి ఇక చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖులు, బాలీవుడ్‌ తారాగణమే కదలివచ్చి మరీ ఈ వేడుకల్లో పాలు పంచుకుంటారు. అలానే ఈ ఏడాది ఆగస్టు 27న ముంబైలోని తమ ఇంటి యాంటిలియాలో గణపతి బప్పాను అంబానీ కుటుంబం ఘనంగా ఆహ్వానించింది. ఆ గణపతి విగ్రహాన్ని ముఖేశ్‌-నీతా దంపుతుల తోపాటు వారి చిన్న కుమారుడు అనంత్‌ -రాధికలు స్వయంగా ఇంటికి తీసుకు వచ్చారు. గణేశ్‌ చతుర్థిని ధూమ్‌ ధామ్‌గా జరుపుకున్నారు. ఆగస్టు 28న గణపతి నిమజ్జనం ఆచారాలు నిర్వహించారు. ఆ పండుగ తాలుకా వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.  

ఆ వీడియోలో గణపతి నిమజ్జనం వేడుకలో రాధిక గులాబి రంగు అనార్కలిలో మెరిసింది. బంధానీ నమునా కుర్తా, గుండ్రని స్ప్లిట్‌ నెక్‌న్‌, క్వార్టర్‌లెంగ్త్‌ స్లీవ్‌లు, ఎంబ్రాయిడరీ టాసెల్స్‌తో ఆకర్షనీయంగా ఉండే డిజైనర్‌వేర్‌లో సింపుల్‌ లుక్‌లో కనిపించింది రాధిక. ఆ డ్రెస్‌కి తగ్గ చెప్పులు, బంగారు గాజులు, డైమండ్‌ ఇయర్‌ స్టడ్స్‌తో సాధారణ అమ్మాయిలా ఆశ్చర్యపరిచారు. అయితే ఈ గణేశ్‌ నిమజ్జనం ఆచారాలన్నింటిని అనంత్‌ రాధికాలు కలిసి నిర్వహించారు. 

 

అనంతరం రాధిక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓర్హాన్ అవత్రమణి, అకా ఓర్రీ, మరికొందరు స్నేహితులు, కుటుంబసభ్యులతో కలసి ట్రక్కు లోపల కూర్చొని ఉన్నారు. ఇక అనంత్‌ తన భద్రతా బృందం, ఇతరులతో కలిసి వాహనం వెనుక నడిచి ఆనందరకరమైన ఆ సంబరాన్ని జరుపకుంటున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేగాదు రాధిక అనంత్‌ అంబానీపై సరదాగా పువ్వులు విసురుతున్నట్లు కూడా కనిపిస్తోంది. రాధిక చేసిన పనికి అనంత్‌ నవ్వుతూ కనిపించడం చూడొచ్చు. 

కాగా, గణేష్ నిమజ్జనం 2025 సెప్టెంబర్ 6న వస్తుంది. దృక్ పంచాంగం ప్రకారం ముందుగా చేయాలనుకునే వారు చతుర్థి తిథి మరుసటి రోజు (ఒకటిన్నర రోజుల తర్వాత) అంటే ఆగస్టు 28న చేయవచ్చు. ఇది గణేష్ నిమజ్జనంకు ప్రసిద్ధి చెందిన రోజులలో ఒకటి. ఆ రోజు మధ్యాహ్నం గణేష్ పూజ చేసిన తర్వాత విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.

 

(చదవండి: ఆరుపదులు దాటినా ఫిట్‌గా కనిపించాలంటే..! నాగార్జున ఫిట్‌నెస్‌ మంత్ర..)
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి