నిజమైన ఫ్రెండ్‌ ఒక్కరున్నా చాలు

Published on Sun, 08/02/2026 - 01:30

ప్రపంచం ఎంత వేగంగా పరిగెత్తుతున్నా... మానవ సంబంధాల్లో స్నేహానికి ఉన్న స్థానం ఎప్పటికీ ప్రత్యేకం... స్నేహానికి విలువ ఇచ్చే రాశీ ఖన్నా అంటున్న మాటలివి. ఇంకా ఈ ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా తన జీవితంలోని అత్యంత ఆత్మీయమైన మిత్రులు, స్నేహం విలువ గురించి మనసు విప్పి మాట్లాడారామె. రాశీ ఖన్నా చెప్పిన కొన్ని ముచ్చట్లు ఆమె మాటల్లోనే...

స్నేహం... ఓ నటన లేని వేదిక
మనం సంతోషంగా ఉన్నట్లు నటించాల్సిన అవసరం లేని ఒకే ఒక్క ప్లాట్‌ఫామ్‌ ‘స్నేహం’. ఎటువంటి ఈర్ష్య, అసూయ, పోటీ లేకుండా, ఎలాంటి తీర్పులు, విమర్శలు లేకుండా... మన గెలుపును వారి గెలుపుగా భావిస్తూ, అలాగే మన కష్టకాలంలో వెన్నంటి నిలిచేవారే నిజమైన స్నేహితులు. అలాంటి నిజమైన స్నేహం ఎంతో విలువైనది.

ఒక్కరున్నా చాలు
మన జీవితంలో ఎంతమంది మిత్రులున్నారనేది ముఖ్యం కాదు. కష్టాల్లో అండగా నిలిచే ఒక్క ఫ్రెండ్‌ ఉన్నా చాలు. జీవితం గందరగోళంగా మారినపుడు, బయటపడే మార్గం కనిపించనపుడు మన బలాన్ని, వ్యక్తిత్వాన్ని గుర్తు చేసి సరైన మార్గదర్శకత్వం చేసే తోడు ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. నా లైఫ్‌లో అలాంటి మంచి మిత్రులు ఉన్నందుకు నేను వారికి కృతజ్ఞతతో ఉంటాను.

ప్రతి క్షణం నా వెంటే!
వాణి, సావంత్‌... ఇద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్‌. వారు నా లైఫ్‌లో  ఉండటం నా అదృష్టం. ఇద్దరి వ్యక్తిత్వాలు వేరయినప్పటికీ... నా లైఫ్‌కి దిక్సూచిలా నిలిచారు. గత రెండు దశాబ్దాలుగా నాకు తోడుంటూ ఈరోజు నేనీ స్థాయిలో ఉండటంలో కీలక పాత్ర పోషించారు. నాకు ఏదైనా హెల్ప్‌ కావలసి వస్తే వాణి, సావంత్‌లకు అర్ధరాత్రి కూడా ధైర్యంగా ఫోన్‌ చేయగలను. ఎందుకంటే వారు నా ఆనందంలో మాత్రమే కాదు... నా కష్టాల్లోనూ నా వెంటే ఉంటారన్న నమ్మకం, ధైర్యం నాకున్నాయి. నా విషయంలోనూ వారు అంతే భరోసాగా ఉంటారు.

ఆడంబరాలకు దూరం
పెద్ద పెద్ద పార్టీలు చేసుకోవడం వంటి ఆడంబరాలకు మేం దూరంగా ఉంటాం. రుచికరమైన భోజనం చేయడం, వీలైనంత ఎక్కువ సమయం కబుర్లు చెప్పుకోవడం, ఒకరి క్షేమ సమాచారాలను మరొకరం తెలుసుకోవడం వంటి నిరాడంబరమైన విషయాలకే  ప్రాధాన్యత ఇస్తాం. కొన్ని సందర్భాల్లో ఖరీదైన గిఫ్ట్‌లు, పార్టీల కంటే ఒకరికొకరు తోడుగా నిలబడటమే అత్యంత ముఖ్యం.... మేం అదే ఫాలో అవుతాం.

వినేవారు కావాలి...
మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక తోడు కావాలనుకుంటాం. మన బాధలను వారు ఓపికగా వినాలనుకుంటాం. అలాంటి స్నేహితులు ఉంటే... మనకు వాళ్లే మంచి ‘పిల్లర్‌’. మన ఆవేదనను అర్థం చేసుకుంటారు. పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అలాంటి క్షణాలు తప్పకుండా ఉంటాయి.

ముద్దు పేర్లతో...
నాకు అత్యంత సన్నిహితులు, స్నేహితులు నన్ను కొన్ని ప్రత్యేకమైన ముద్దు పేర్లతో పిలుస్తుంటారు. నిజం చెప్పాలంటే వాటిలో కొన్ని పేర్లు బయటకు చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంటుంది. సో... నేను చెప్పను (నవ్వేస్తూ).

అండగా నిలుస్తాం...
ఫ్రెండ్‌షిప్‌లో లెక్కలు చూసుకోవడం, హెచ్చు తగ్గులు చూపించుకోవడం ఉండదు. జీవితంలో వచ్చే కష్టసుఖాల్లో, గెలుపు, ఓటములలో మేమందరం ఒకరికొకరం అండగా నిలిచాం. వారికి అవసరమైన సమయాల్లో నేను తోడుగా ఉన్నాను, నా కష్టాల్లోనూ వారు అలాగే అండగా నిలిచారు. నేను వారిని, వారు నన్ను నమ్మగలమనే కొండంత విశ్వాసం మా మధ్య ఉంది. కొన్నిసార్లు వారు చేసిన ఒక్క ఫోన్‌ కాల్‌ నా ఆత్మస్థైర్యాన్ని పెంచి, నా మానసిక స్థితిని పూర్తిగా మార్చివేసిన రోజులు ఉన్నాయి. అదే అసలైన, నిజమైన స్నేహం.

ఏది సరైనదో అదే చె΄్తారు
నిజమైన స్నేహితులు కేవలం మనకు నచ్చే మాటలే కాదు... మనకు ఏది అవసరమో, మన జీవితానికి ఏది సరైనదో అదే నిర్మొహమాటంగా చె΄్తారు. నా స్నేహితులు వాణి, సావంత్‌ ఇద్దరూ నా పట్ల ఎంతో నిజాయితీగా ఉంటారు. వారి ప్రేమ, ఆప్యాయత నుంచే ఆ నిజాయితీ వస్తుంది కాబట్టి నేను వారికి ఎంతో విలువిస్తాను.

మాకూ ఒక వాట్సాప్‌ గ్రూప్‌
మాకు ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఉంది, అందులో సంభాషణలు సరదాగా సాగుతుంటాయి. మీమ్స్‌ షేర్‌ చేసు కుంటాం.. వాయిస్‌ మెసేజ్‌లు పంపుకుంటాం. ఎప్పటికీ చేయలేని, నెరవేరని ప్లాన్‌లు వేస్తుంటాం. అలాగే ఒకరి నొకరం ఆటపట్టించుకుంటూ సరదాగా గడుపుతుంటాం.

స్నేహానికి కొలతల్లేవు
స్నేహానికి కొలతలుండవు... ఎన్నిసార్లు కలుస్తున్నారు? సోషల్‌ మీడియాలో ఎన్ని ఫోటోలు పోస్ట్‌ చేస్తున్నారు వంటి అంశాలతో స్నేహాన్ని అంచనా వేయకూడదు. కష్ట సమయాల్లో మీ పక్కన ఎవరు నిలబడ్డారనేదాన్ని బట్టే స్నేహానికి ఉన్న అసలైన విలువను కొలవాలి.  లైఫ్‌లో నిజమైన ఫ్రెండ్‌ దొరకడం అనేది నా దృష్టిలో చాలా లక్‌. అందుకే మిమ్మల్ని అర్థం చేసుకునే వారిని, మీకు ప్రశాంతతను ఇచ్చే వ్యక్తులను వదులుకోవద్దు. 
అందరికీ హ్యాపీ ఫ్రెండిషిప్‌ డే.
                   
– డి.జి. భవాని

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)