Breaking News

క్వీన్ ఎలిజబెత్ II వెడ్డింగ్‌ గౌను.. వెరీ ఇంట్రెస్టింగ్‌!

Published on Wed, 11/27/2024 - 14:01

బ్రిటన్‌ దివంగత రాణి క్వీన్‌ ఎలిజబెత్‌ II పెళ్లి నాటి గౌను వెనుక చాల పెద్ద కథ ఉంది. ఆమె 1947 నవంబర్‌ 20న ప్రిన్స్‌ ఫిలిప్‌ని వివాహం చేసుకున్నారు. అయితే సరిగ్గా అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. దీంతో బ్రిటన్‌ దేశం ప్రజలు పొదుపు పాటించేలా గట్టి చర్యలు తీసుకుంది. అంటే ఆ సమయంలో ఎలాంటి ఫంక్షన్లకు విలాసవతంగా డబ్బులు ఖర్చుపెట్టడానికి వీల్లేకుండా ఆంక్షలు విధించింది. 

ఇది బ్రిటన్‌ రాజ వంశానికి కూడా వర్తిస్తుందట. ఎందుకుంటే యథా రాజా తథా ప్రజాః అన్న ఆర్యోక్తి రీత్యా బ్రిటన్‌ రాజవంశానికి కూడా పొదుపు పాటించక తప్పలేదు. దీంతో అదే టైంలో రాణి ఎలిజబెత్‌ II వివాహం జరగనుండటంతో ఆమె దుస్తుల ఖర్చుల కోసం ఆ రాజవంశం ఎలా పొదుపు పాటించిందో వింటే ఆశ్చర్యపోతారు.

దివంగత క్వీన్ ఎలిజబెత్ II వివాహం వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో ఘనంగా జరిగింది. రాణి వివాహ గౌనులో అత్యద్భుతంగా కనిపించింది. అక్కడకు విచ్చేసిన అతిధులందరి చూపులను ఆకర్షించింది. ఆమె గౌనుని బ్రిటన్ రాజ వంశానికి చెందిన ప్రముఖ ప్యాషన్‌ డిజైనర్‌ డచెస్ శాటిన్ రూపొందించారు. దీన్ని చక్కటి పూలు, ముత్యాలతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. 

అతని డిజైన్‌కి అనుగుణంగా వివాహ వెడ్డింగ్‌ హాలు పెయింటింగ్‌ను కూడా తీర్చిదిద్దారు. ఆ గౌనుపై దాదాపు 10 వేలకు పైగా ముత్యాలను వినియోగించారు. సుమారు 14 అడుగుల పొడవుతో ఎంబ్రాడరీ డిజైన్‌తో తీర్చిదిద్దారు. అయితే ఈ డిజైనన్‌ని పెళ్లికి మూడు నెలల ముందుగా ఆమోదించింది రాజకుటుంబం. అందువల్ల ఆ డిజైన్‌కి అనుగుణంగా వెడ్డింగ్‌ డెకరేషన్‌ని ఏర్పాటు చేశారు. 

దీని ధర వచ్చేసి ఆ రోజుల్లే దాదపు రూ. 25 లక్షల ధర పైనే పలికిందట. అయితే రెండో ప్రపంచ యుద్ధం దృష్ట్యా పొదుపుకి పెద్ద పీట వేస్తూ బ్రిటన్‌ దేశం ఇచ్చిన రేషన్‌ కూపన్‌లను వినియోగించుకుని విలాసవంతంగా డబ్బులు వెచ్చించకుండా జాగ్రత్త పడిందట రాజ కుటుంబం. యుధ్దం కారణంగా బ్రిటన్‌ ప్రభుత్వం పొదుపు చర్యల్లో భాగంగా ఆహారం, బట్టలు, సబ్బులు వంటి కొన్ని వాటిని రేషన్‌ చేసింది. 

దీంతో రాజకుటుంబం ఆ రేషన్‌ని ఉపయోగించుకునే మన రాణి ఎలిబబెత్‌ పెళ్లి గౌనుని కొనుగోలు చేసిందట. తాము రాజవంశస్తులమనే దర్పం చూపక పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది బ్రిటన్‌ రాజ కుటుంబం. 

(చదవండి: ఐపీఎల్‌ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?)

 

Videos

మాకు రావాల్సింది రాకపోతే... చంద్రబాబుకు బొప్పరాజు మాస్ వార్నింగ్

ఆ 55 ఎకరాలు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బిగ్ షాక్

ప్రకృతి డేంజర్ సిగ్నల్స్ ఇది వానా కాలమా.. ఎండా కాలమా..!

దళితులను, గిరిజనులను మనుషుల్లా చూడట్లేదు చంద్రబాబుపై దళిత నాయకులు ఫైర్

రూపాయి పతనం.. బంగారం ధరలపై ఎఫెక్ట్!

గుర్తుపెట్టుకో నైతిక విలువలు ముఖ్యం.. బొత్స అదిరిపోయే కౌంటర్

జగదీశ్వర్ రెడ్డి పై పగతో స్లో పాయిజన్ పోలీస్ విచారణలో కీలక విషయాలు

Bigboss: హౌస్ లో కొత్త డ్రామా.. రిస్క్ లో రామ్ ప్రసాద్.!

ఎవరూ శాశ్వతం కాదు.. మజ్జి శ్రీను పార్టీ మారడంపై స్ట్రాంగ్ రియాక్షన్

నువ్వు మంత్రివా! DSC స్కామ్ అడ్డంగా దొరికిన లోకేష్

Photos

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)

+5

వైష్ణవి చైతన్య ‘ఎపిక్‌’ లుక్స్‌.. షూటింగ్‌ ఫొటోలు వైరల్‌

+5

వినాయక చవితి 2026...నేను రెడీ అంటున్న గణేష్ (ఫొటోలు)

+5

కొత్త ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది (ఫోటోలు)

+5

‘కాగితం పడవలు’ సినిమా టీజర్ విడుదల (ఫొటోలు)

+5

అప్పటి కాలేజ్‌ లుక్‌.. ఇప్పటి స్టార్‌ హీరోయిన్స్‌! (ఫోటోలు)

+5

కాఫీ కప్‌తో కీర్తి.. అదిరిన కాఫీ లుక్‌! (ఫోటోలు)

+5

సింపుల్ లుక్‌లోనే స్టన్నింగ్ బ్యూటీ భూమిక చావ్లా.. వైరల్ అవుతున్న ఫొటోలు

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)