పీరియడ్స్‌ టైంలో నొప్పిగా ఉందా? రక్తహీనతతో బాధపడుతున్నారా? ఈ ఆకు రసాన్ని..

Published on Fri, 06/23/2023 - 16:57

ప్రకృతి ఓ ఔషదాల గని. అత్యంత ప్రమాదకర అనారోగ్యాలకు వైద్యాన్ని, ఔషధాలను ప్రకృతిలో లభించే మొక్కలతో తయారు చేసుకోవచ్చు. మర పెరట్లో లభించే అనేక మొక్కల్లో పునర్నవ ఒకటి.పునర్‌ అంటే తిరిగి, నవ అంటే కొత్తగా అని అర్థం. ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవింప చేయగలదు కాబట్టే ‘పునర్నవ’ అయ్యింది. పల్లెల్లో దానిని అటుక మామిడి అనీ, గలిజేరనీ, ఎర్రగలిజేరనీ అంటారు.పునర్నవ ఆకులవల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..


► కాలేయ వ్యాధుల చికిత్సకు సంబంధించిన చికిత్సల్లో  పునర్నవ ఒక సంప్రదాయ చికిత్స. ఈ ఔషధ మొక్కను కాలేయ పనితీరు మెరుగుపర్చేందుకు ఉపయోగిస్తారు. 

► పునర్నవ మూత్రపిండాల్లో రాళ్ళను నివారించేందుకు సహాయపడుతుంది. పునర్నవ ఆకు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుందని క్లినికల్ అధ్యయనాలు కనుగొన్నాయి.

► పునర్నవను మజ్జిగతో కలిపి తీసుకుంటే ఐరన్ స్థాయిలను పెంచుతుంది. రక్తహీనత లక్షణాల్ని 90 రోజుల్లోనే తగ్గిస్తుంది.

► పునర్నవ ఋతు సమయంలో వచ్చే తిమ్మిర్లు తగ్గడానికి సహాయం చేస్తుంది. పీరియడ్స్‌ సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.గర్భాశయంలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. వాపు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.ఇన్సులిన్ స్థాయిల్ని పెంచి బీటా-కణాల్ని పునరుద్దరించడం ద్వారా చక్కెర వ్యాధిని పునర్నవ తగ్గిస్తుంది.

► పునర్నవ బరువు తగ్గించేందుకు సహాయం చేస్తుంది.

► వృద్దాప్య లక్షణాలు తగ్గించడానికి, ముఖంపై ముడతలు, గీతలను నివారిస్తుంది.

► తెల్ల గలిజేరు కఫము, దగ్గు, శరీరంలో కలిగే వాపులు, వాత వ్యాధులు, పొట్టకు సంబంధించిన వ్యాధులు, లివర్ వాపుకి, గుండె బలహీనత వల్ల వచ్చిన వాపుని పోగొడుతుంది. కిడ్నీల పని తీరును మెరుగు పరుస్తుంది.

► పునర్నవ కంటిచూపును మెరుగుపరుస్తుంది.తెల్ల గలిజేరు ఆకుని రసం పది గ్రాముల మోతాదు తీసుకుని పెరుగులో కలిపి ఉదయం, సాయింత్రం తీసుకుంటే కామెర్లు నయమవుతాయి. ఇలా మూడు రోజులు తీసుకోవాలి.

► ఈ ఆకు రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపి సన్నని సెగ మీద కాచాలి. రసం ఇంకి పోయి నూనె మాత్రమే మిగిలేదాకా కాచాలి. ఈ నూనెను కీళ్ల నొప్పులకు మర్దనా చేస్తే తగ్గుతాయి. నడక రాని పిల్లలకు ఈ తైలం మర్ధన చేసి తర్వాత స్నానం చేయిస్తే నడక వస్తుందని ఆయుర్వేద వైద్యులు వివరిస్తారు.

► గలిజేరు ఆకురసాన్ని పటిక బెల్లంతో పాకంపట్టి.. రోజూ ఒక చెంచా చొప్పున నీళ్లలో కలిపి తీసుకుంటే గుండె దడ, బలహీనత తగ్గుతాయి. ఈ ఆకు రసం ఒక స్పూన్ తీసుకుని దానికి కొద్దిగా అల్లం రసం కలిపి నెల రోజులు తాగితే శరీరంలో ఉబ్బు తగ్గుతుంది.

అయితే ఈ ఆకు కూరని అతిగా తినకూడదు. హుద్రోగ వ్యాధి గ్రస్తులు వైద్యుడి సలహా తీసుకుని తినాలి. డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు చలువ చేసే పదార్థాలు అధికంగా తీసుకుంటూ ఈ ఆకు కూరని మితంగా తినాలి. పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు ఈ ఆకు కూర తినకూడదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారైనా వారానికి ఒకసారి మాత్రమే తినాలి. కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం వారానికి రెండు మూడు సార్లు తీసుకుంటే మంచిది. చాలా త్వరగా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)