Breaking News

చింత చిగురు పులిహోర.. అద్భుతమైన రుచి

Published on Thu, 04/25/2024 - 17:09

చింతపండుతోపాటు చింత చిగురు లేదా  చింతాకు కూడా చాలా వంటకాల్లో  ఉపయోగపడుతుంది. చింత చిగురును మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి.  చింత చిగురు సీజనల్‌గా దొరికే ఆకుకూర లాంటిదనే చెప్పవచ్చు. చింతపండులాగానే ఈ చింత  చిగురు రుచిగా పుల్లగా ఉంటుంది. (మటన్‌కు షాకిస్తున్న చింతచిగురు! ఈ ప్రయోజనాలు తెలుసా?)

చింతాకు ఎముకల గట్టితనానికి, జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.  చింత చిగురుతో పప్పు, పచ్చడి,  మటన్‌, చికెన్‌, చేపలు, రొయ్యలతో కలిపి కూర చేసుకోవచ్చు. వీటిన్నింటిలో ప్రధానమైంది చింతచిగురు పులిహోర.

కావాల్సిన పదార్థాలు 
రెండు కప్పులు బియ్యం
కప్పు సన్నగా తరిగిన లేత చిగురు 
టేబుల్ స్పూన్లు నూనె 
3 - 4 పెద్ద పచ్చిమిర్చి 
5, 6 ఎండు మిరపకాయలు
 కొద్దిగా వేరు శనగపప్పు,లేదంటే జీడిపప్పు   పసుపు, ఇంగువ 
 పోపు కోసం  మినపప్పు, శనగపప్పు, జీలకర్ర , ఆవాలు,  కరివేపాకు  

తయారీ: బియ్యాన్ని బాగా కడిగి, మరీమెత్తగా కాకుండా పొడిగా ఉండేలా  ఉడికించి పక్కన పెట్టుకోవాలి.  బాణలిలో నూనె వేసి  ఆవాలు,  శెనగపప్పు, జీడిపప్పు, ఎండు మిరపకాయలు వేయించాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా కొద్దిసేపువేగనివ్వాలి. కొద్దిగా ఇంగువ కూడా వేయాలి.  వేగిన తరువాత శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న చింత చిగురు వేసి బాగా కలపాలి.  పసుపు, ఉప్పు వేసి మూత పెట్టాలి.  (క్రికెట్‌ గాడ్‌ సచిన్‌కు అత్యంత అపురూపమైన 13 నాణేల గురించి తెలుసా? )

సాధారణంగా ఉప్పు వేసిన తరువాత వచ్చే నీరుతో  చింత చిగురు ఉడికిపోతుంది. లేదంటే కొద్దిగా నీరు చిలకరించుకుంటే సరిపోతుంది.  చిగురు ఉడికి కమ్మటి వాసన వచ్చి, నూనెపైకి తేలేవరకు సన్నని మంటమీద ఉడికించాలి. చివరగా  ఉడికిన అన్నంలో, ఈ మిశ్రమం వేసి అన్నం పగలకుండా  కలుపుకుంటే కమ్మ కమ్మగా..పుల్లపుల్లగా చింతచిగురుపులిహోర రడీ.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)