Breaking News

ఇంటర్‌ తర్వాత... మీ దారి కనిపెట్టాలి!

Published on Sun, 06/01/2025 - 08:53

ఇంటర్మీడియట్‌ పూర్తవగానే విద్యార్థి జీవితంలో మొదలయ్యే అసలైన టెన్షన్‌– ‘ఇప్పుడేం చేయాలి?’ పేరెంట్స్, టీచర్స్, బంధువులు, ఫ్రెండ్స్‌ రకరకాల సలహాలిస్తుంటారు. ‘‘ఇంజినీరింగ్‌ చెయ్, ఫ్యూచర్‌ బాగుంటుంది.’’‘‘నీట్‌ రాయి, ఎంబీబీఎస్‌ అయిపోతే జీవితం సెట్‌ అవుతుంది.’’‘‘బీకామ్‌ తీసుకుని సీఏ చెయ్యి, ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు.’’ఈ సలహాలు విని గుడ్డిగా ఒకదాన్ని ఎంచుకోవడం కాదు.

 మీకు సరిపోయే దారి కనిపెట్టడమే అసలైన విజయం.మీ మనసేం చెప్తోంది? ఇంటర్‌ తర్వాత ఏం చేయాలో ఇంకా అర్థం కాలేదంటే అది మీ తప్పు కాదు. ఎవరూ సరైన ప్రశ్నలు అడగలేదని మాత్రమే. అందుకే మీ మనసేం చెప్తుందో అడగండి. ఇది నిజంగా నా దారేనా? నేను నేనుగా ఉండే దారేది? నాలోని విజేతను వెలికితీసే కోర్సు ఏది? నాలో నిద్రిస్తున్న టాలెంట్‌ను తట్టి లేపే దిశ ఏది? వీటికి సమాధానం దొరకలేదా, కెరీర్‌ కౌన్సెలింగ్‌ మీకు సహాయపడుతుంది.

 మిమ్మల్ని మెప్పించే దారి కాకుండా, మీరు గర్వపడే దారిని చూపిస్తుంది. కొత్త దారిలో నడవండి...ఇంటర్‌ తర్వాత అనేక ప్రవేశపరీక్షలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. వాటిలో జయాపజయాలు మీ జీవితాన్ని నిర్ణయించలేవు. పరీక్షలు ఆటల్లాంటివి. మీ గెలుపు ఆటలో కాకుండా, మీ ఆట మీరే రాసుకున్నప్పుడు వస్తుందని గుర్తించండి. ఇంటర్మీడియట్‌ తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ తీసుకోకుంటే జీవితం వృథా అనే సలహాలు మిమ్మల్ని తప్పుదారి పట్టించేవిగా ఉంటాయి. సంప్రదాయ కోర్సులు కాకుండా, కొత్త దారిలో నడిచేందుకు ధైర్యం చేయండి. 

బైపీసీ తర్వాత మెడిసిన్‌ తప్ప మరేం చేసినా వేస్ట్‌. బైపీసీ తర్వాత మెడిసిన్‌ ఒక మార్గం మాత్రమే. మెడిసిన్‌ సీటు రాకుంటే జీవితం ఆగిపోయినట్లేం కాదు. న్యూట్రిషన్, ఫోరెన్సిక్‌ సై, జెనెటిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, అగ్రిటెక్‌లాంటి రంగాలు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. 

ఎంపీసీ అంటే బీటెక్, లెక్కలే!
ఎంపీసీ తర్వాత ఐఐటీలోనో, ఎన్‌ఐటీలోనో సీటు రాకపోతే కొంపలేం మునిగిపోవు. ఆర్కిటెక్చర్, డేటాసైన్స్, డిఫెన్స్‌ (ఎన్‌డీఏ), రోబోటిక్స్, ఏఐ వంటి మోడర్న్, ఫ్యూచరిస్టిక్‌ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

కామర్స్‌ అంటే సీఏ తప్ప దారిలేదు
కామర్స్‌ స్ట్రీమ్‌లో సీఏ ఒక్కటే కాదు. మరెన్నో కోర్సులు, అవకాశాలు ఉన్నాయి. ఫిన్‌ టెక్, బిజినెస్‌ అనలిటిక్స్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌ బ్రాండింగ్, క్రిప్టో స్ట్రాటజీ వంటి అధునాతన కెరీర్స్‌ ఇప్పుడు కామర్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవారిని అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతున్నాయి. 

ఆర్ట్స్‌ తీసుకుంటే స్కోప్‌ ఉండదు.. 
ఇది ఒక పెద్ద అపోహ. ఏ స్ట్రీమ్‌ చదువుతున్నామనే దానికంటే అందులో ఏ స్థాయిలో చదువుతున్నామనేది ముఖ్యం. సైకాలజీ, పబ్లిక్‌ పాలసీ, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్, మీడియా, కాగ్నిటివ్‌ సైన్స్‌ లాంటి సృజనాత్మత, మేధా రంగాలు కొత్త దారులు చూపిస్తున్నాయి. 

దారి చూపించే మూడు ప్రశ్నలు...
ముఖ్యమైన విషయమేమిటంటే, నిజానికి ఇది కోర్సు ఎంచుకునే దశ కాదు. ఇది జీవితాన్ని డిజైన్‌ చేసుకునే దశ. వందల కోర్సులు ఉన్నా, మీకు సూటయ్యే కోర్సు ఒక్కటే. 

అది మీకు ప్యాషన్‌ కలిగించాలి.
అది మీకు పర్పస్‌ నేర్పించాలి.
అది మీకు అవకాశాలను తెచ్చిపెట్టాలి.

  • అందుకే ఈ దశలో సమాజం చూపించే మార్గాల కన్నా, మీ లోపల ఉన్న ఓపిక, ఊహ, ఉత్సాహం ఏ దిశ చూపుతుందో వినాలి. ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. అందుకోసం మీరు మూడు ప్రశ్నలు వేసుకోవాలి. 

  • నాకు నచ్చేది ఏంటి? ఏ పని చేస్తుంటే కాలం తెలియకుండానే గడిచిపోతుంది? అదే మీ ఫ్యాషన్‌. 

  • నాకు బాగా వచ్చేది ఏంటి? ఇంకొకరికి వదలకుండా చేయగలిగే పని ఏది? అదే మీ బలం. 
    నాకు ఎలాంటి జీవితం కావాలి? స్వేచ్ఛా? గౌరవమా? సృజనాత్మకతా? ప్రభావమా? అదే మీ విజన్‌. 

  • ఈ మూడు సమాధానాలు కలిసి మీలోని గందరగోళాన్ని తుడిచేసి స్పష్టమైన వ్యూహంగా మార్చుతాయి. సెల్ఫ్‌ అండ్‌ అవేర్‌నెస్‌  స్కిల్‌ అండ్‌ మ్యాపింగ్‌ + ఫ్యూచర్‌ విజన్‌= రైట్‌ కెరీర్‌. ఈ ఫార్ములాతో నడిస్తే కోర్సు మాత్రమే కాదు, జీవితం మారుతుంది. డిగ్రీ కాకుండా డైరెక్షన్‌ వస్తుంది. కేవలం ఉద్యోగం కాకుండా ఊపిరిలాంటి పని వస్తుంది. విష్‌ యూ ఆల్‌ ద బెస్ట్‌!
     

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)