Breaking News

పోరాటానికి సిద్ధం చేసే సైకో ఆంకాలజీ

Published on Tue, 02/03/2026 - 05:38

‘నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ ప్రివెన్షన్  అండ్‌ రీసెర్చ్‌’2024 అధ్యయనం ప్రకారం మన దేశంలో 25 లక్షల మంది క్యాన్సర్‌తో  పోరాడుతున్నారు. గత ముపై ్ప ఏళ్లలో క్యాన్సర్‌ బాధితుల సంఖ్య 24 శాతం పెరగడమే ఇంత భారీ సంఖ్యకు కారణం. అయితే క్యాన్సర్‌ నయం చేయడంలో వైద్యంతో పాటు మనసును దృఢం చేయడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు సైకో అంకాలజిస్ట్‌లు. క్యాన్సర్‌  పోరాటంలో బాధితునికి సైకో ఆంకాలజిస్ట్‌లు అందించే సహాయం ఏమిటి?

‘ఇటీవల మా అధ్యయనం ఏం చెబుతున్నదంటే క్యాన్సర్‌ ట్యూమర్‌తో పాటు మనసుకు కూడా వైద్యం చేయడం వల్ల క్లినికల్‌గా మంచి ఫలితాలు వస్తాయని. ఆంకాలజీ విభాగంలో సైకాలజీ ఇక ఎంత మాత్రం ఆప్షనల్‌ కాదు.  తప్పనిసరి అవసరం’ అన్నారు న్యూఢిల్లీలోని ఎంఓసి క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ వైద్యుడు డాక్టర్‌ నిఖిల్‌ హింతాని. ‘అందుకే దేశంలోని క్యాన్సర్‌ సెంటర్లలో సైకో ఆంకాలజిస్ట్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది’ అన్నారాయన.

క్యాన్సర్‌ బారిన పడటం ఎవరినైనా కుంగదీసే విషయమే. క్యాన్సర్‌ నిర్థారణ అయ్యాక ప్రతి పేషంట్‌కు తనవైన భావోద్వేగ సవాళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కొనడంతో పాటు వ్యాధిని ఎదుర్కొనాలి... ఈ రెంటి సమన్వయానికి కౌన్సిలింగ్‌ తప్పనిసరి అంటున్నారు క్యాన్సర్‌ నిపుణులు. అందుకే ఇప్పుడు క్యాన్సర్‌ మీద  పోరాటంలో సైకో 
ఆంకాలజిస్ట్‌ల ప్రాధాన్యం పెరిగింది.

→ ఎవరీ సైకో ఆంకాలజిస్టులు?
క్యాన్సర్‌ వ్యాధికి చికిత్స అందించే నిపుణులను ‘ఆంకాలజిస్టు’ అంటారని తెలిసిందే. ఆ విభాగంలోనిదే ఈ ‘సైకో–ఆంకాలజీ’. సైకాలజీలో మాస్టర్స్‌ లేదా పిహెచ్‌డి చేసి, సైకో ఆంకాలజీని ప్రత్యేకంగా అధ్యయనం చేసిన వారు ‘సైకో ఆంకాలజిస్ట్‌లు’గా విధులకు సిద్ధమవుతారు. ఆంకాలజిస్ట్‌లతోటి, పేషంట్స్‌తోటి సమన్వయం చేసుకుంటూ పేషంట్‌ మనసుకు స్వాంతన ఇస్తూ వారిలో ధైర్యం నూరి పోయడం, క్యాన్సర్‌ను గెలవగలననే భరోసాను ఇవ్వడం వీరి ప్రధాన పని.

→ క్యాన్సర్‌ నయమైన వారికీ అండగా..
క్యాన్సర్‌ నయమైన తర్వాత కూడా క్యాన్సర్‌ విజేతలకు అనేక ఆందోళనలు ఉంటాయి. చికిత్స వల్ల వారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వాటిని తట్టుకోలేక కొందరు కుంగి పోతుంటారు. అటువంటి వారికీ ‘సైకో–ఆంకాలజీ’ అండగా ఉంటుంది. తిరిగి మేలైన జీవితాన్ని ఎలా ప్రారంభించాలో, ఎలా సహజంగా జీవించాలో నేర్పుతుంది. మానసిక ప్రశాంతత, ఆరోగ్య సూత్రాలు, ఒత్తిడి లేని జీవనాన్ని పాటించేలా సూచనలు చేస్తారు సైకో–ఆంకాలజిస్టులు. క్యాన్సర్‌ నయం కాగానే అంతా మామూలై పోయిందని చాలామంది భావిస్తుంటారు. అక్కడి నుంచే అసలైన సవాళ్లు మొదలవుతాయని నిపుణులు అంటున్నారు. ఆ మార్పులకు అనుగుణంగా వారిని సంసిద్ధం చేయడం అత్యవసరమని, దానికి ‘సైకో– ఆంకాలజీ’ తోడ్పడు
తుందని అంటున్నారు.

→ దశాబ్ద కాలంగా ‘సైకో–ఆంకాలజీ’పై పెరుగుతున్న అవగాహన 
మనదేశంలో ఎక్కువగా రొమ్ము, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బాధితులు ఉన్నారు. ఇందులో పురుషులు, స్త్రీలు బాధితులుగా ఉంటారు. వీరిలో ఒక్కొక్కరి ఒక్కో నేపథ్యం. పేద, మధ్యతరగతి ప్రజలు క్యాన్సర్‌ బారిన పడితే ఇక ఆ కుటుంబంలో నెలకొనే ఆందోళన గురించి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో క్యాన్సర్‌కు గురైన వారు ధైర్యంగా ఉంటే మిగిలినవారూ ధైర్యాన్ని కూడగట్టుకుంటారు. అందుకు ‘సైకో–ఆంకాలజీ’ కీలక భూమిక  పోషిస్తుంది. గత పదేళ్లుగా దీనిపై అవగాహన పెరుగుతోంది. ‘క్యాన్సర్‌ని ఎదుర్కొవడం మాత్రమే కాదు, జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలునూ ఎదుర్కునేలా వారిని సిద్ధం చేయడమే మా బాధ్యత’ అంటున్నారు ‘సైకో– ఆంకాలజిస్టులు’.

మానసిక ధైర్యమే కొండంత అండ
సైకో ఆంకాలజీలో పేషంట్‌కు అవసరాన్ని బట్టి ‘కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ’, ‘స్ట్రెస్‌ రిడక్షన్‌ టెక్నిక్స్‌’, ‘యాక్సెప్టెన్స్‌ అండ్‌ కమిట్‌మెంట్‌ థెరపీ’, ‘స పోర్టివ్‌ ఎక్స్‌ప్రెసివ్‌ థెరపీ’, ‘సైకో థెరపీ’, ‘ఫ్యామిలీ అండ్‌ కపుల్స్‌ థెరపీ’, ‘ట్రామా ఇన్‌ఫార్మ్‌డ్‌ థెరపీ’... వంటి అనేక థెరపీలు సైకో ఆంకాలజిస్ట్‌లు అందిస్తారు. ఎన్ని మందులు ఉన్నా వైద్యులు ఇచ్చే భరోసా  వారిలో కొండంత బలాన్ని నింపుతుంది. క్యాన్సర్‌ మీద ఉన్న అనేక అ పోహల కారణంగా ఈ వ్యాధికి గురైన వారు తీవ్ర మానసిక వేదనతో పాటు చుట్టూ ఉన్న వారి జాలిచూపులు, చికిత్స సమయంలో నొప్పి, తమకేమవుతుందోనన్న ఆందోళన, డబ్బు కోసం కుటుంబ సభ్యులు పడే ఆరాటం.. వీటన్నింటితో సతమతం అవుతుంటారు.  సైకో–ఆంకాలజిస్టులు వారితో మాట్లాడి బతుకు మీద ఆశ కలిగించేందుకు ప్రయత్నిస్తారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)