Chintada Ravi: దేశ ప్రతిష్టను పాతాళానికి తొక్కేసాడు ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడును ఏకిపారేసిన చింతాడ రవి
Breaking News
అంధ లెఫ్టినెంట్ కల్నల్ నుంచి వీల్‌చైర్ మోడల్ వరకు..!
Published on Sun, 12/07/2025 - 18:09
దివ్యాంగులకు సాధికారత కల్పించడం అనేది అందరి కర్తవ్యవం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. వారంతా ప్రత్యేక సామర్థ్యంతో తమలోని అసామాన్య ప్రతిభతో ఆకట్టుకుంటారని ప్రశంసించారు. గత మంగళవారం జరిగిన 2025 జాతీయ వికలాంగుల సాధికారత అవార్డుల వేడుకలో దివ్యాంగుల ప్రతిభను మెచ్చుకుంటూ 32 మందికి అవార్డులు ప్రదానం చేశారు. వాళ్లంతా లింగ వివక్షను, వైకల్యాన్ని అధిగమించి అసాధారణ విజయాలను అందుకున్న వారు. అవార్డులందుకున్న ఈ 32 మందిలో ప్రతిఒక్కరిలో ఉన్నా అసామాన్య ప్రతిభ స్ఫూర్తిని రగిలికస్తూ ఉంటుంది. మరి ఆ అసామాన్య ప్రతిభావంతులెవరూ..వారి ప్రత్యేకత గురించి సవివరంగా చూద్దామా..!.
80% లోకోమోటర్ వైకల్యం ఉన్న యాజీన్ జాతీయ వికలాంగులు సాధికారత అవార్డు గ్రహిత. ఆయన కళ్లకు గంతలు కట్టుకుని కీబోర్డుని అవలీలగా ఆలపించగలరు. ఆయన ఊహ గొప్పతనాన్ని చెప్పిన వ్యక్తి. ఒకప్పుడూ తాను సంజు సామ్సన్‌తో ఆడానని, ఇప్పుడూ ఈ వైకల్యం కారణంగా వీల్‌చైర్‌కే పరిమితమయ్యా..కానీ తనని ఆపేది ఏది లేదని చెప్పుకొచ్చారు.
ఇక బెంగళూరుకు చెందిన షీబా కోయిల్‌పిచాయ్ బహుళ వైకల్యంతో పోరాడుతోంది. ఆమె మాట్లాడలేకపోయిన సుమారు మూడు వేలకు పైగా వార్లీ పెయింటింగ్‌లతో తన అనుభవాలను చెబుతుంది. ఆమె రచనలు కర్ణాటకలో రాష్ట్రపతి భవన్, లోక్‌భవన్ ప్రపంచ సేకరణలో ప్రచురితమయ్యాయి. ఆమె శిక్షణ పొందిన సంస్థలోనే టీచర్‌గా పాఠాలు బోధిస్తుంది.
నాగ్‌పూర్‌కు చెందిన అబోలి విజయ్ జరిత్ దేశంలోని మొట్టమొదటి వీల్‌చైర్ మోడల్, ప్రేరణాత్మక వక్తకూడా. తన కుటుంబమే అతిపెద్ద బలం అంటోంది.
లెఫ్టినెంట్ కల్నల్ ద్వారకేష్ చంద్రశేఖరన్ పూర్తిగా అంధుడైనప్పటికీ భారసాయుధ దళాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన జాతీయ ఈత రికార్డులను బద్దలు కొట్టారు. భారతదేశంలో బ్లైండ్ షూటింగ్‌ని ప్రవేశపెట్టిన ఘనత అతడిదే. అలాగే సియాచిన్ హిమానీనదం వరకు ట్రెక్కింగ్ చేశారు.
బెంగళూరుకు చెందిన సీనియర్ యాక్సెసిబిలిటీ స్పెషలిస్ట్ మేఘ పతంగి దృష్టి లోపంతో బాధపడుతున్నా.. డిజిటల్ టెక్నాలజీ లక్షలాదిమంది అంధులకు హెల్ప్ అయ్యేలా కృషి చేసింది.
ఈ అవార్డు గ్రహీతల్లో చత్తీస్‌గఢ్‌లోని ధమ్తారికి చెందిన బసంత్ వికాస్ సాహు కూడా ఉన్నారు. 95% లోకోమోటర్ వైకల్యంతో జీవిస్తూ.. తన జీవన్ రంగ్ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక వికలాంగులు, గిరిజన యువతకు శిక్షణ ఇస్తూన్నారు. పైగా తన చేతికి బ్రష్ కట్టుకుని చిత్రలేఖనాలు గీస్తారాయన. ఆయన చిత్రాలు గిరిజన జీవితంపై స్పష్టమైన ఆలోచనను అందిస్తాయి.
వడోదరకు చెందిన రాజేష్ శరద్ కేత్కర్ భారతీయ సంకేత భాష (ISL)ను సమర్థించే యాక్సెసిబిలిటీ భావనను పునర్నిర్మించారు. ఆయన మార్గదర్శక ISL-ఆధారిత అభ్యాస వ్యవస్థలను ప్రవేశపెట్టారు. దాంతో లక్షలాది మందికి బధిరులు నడిపే వార్తా వేదికను నిర్మించారు. అలాగే కమ్యూనికేషన్‌ను సాధికారతగా మార్చారు.
చివరగా అవార్డు గ్రహీతలంతా ఒక ఏకైక సత్యాన్ని వివరించారు. అదేంటంటే..వైకల్యం ప్రతిబంధకం, మనల్ని కోల్పోవడం కాదని ప్రూవ్ చేశారు. ఆ వైకల్యం మన అభ్యన్నతిని ఏ మాత్రం ఆపలేదని తమ సక్సెస్‌తో నిరూపించారు.
(చదవండి: Gucchi Mushrooms: పుతిన్ రాష్ట్రపతి భవన్ విందులో గుచ్చి పుట్టగొడుగుల రెసిపీ..! స్పెషాలిటీ ఏంటంటే..)
Tags : 1