Breaking News

వాటి వల్ల ప్రమాదమా?

Published on Sun, 02/02/2025 - 11:41

నేను ఇప్పుడు మూడునెలల గర్భవతిని. ఇంట్లో చాలా సంవత్సరాలుగా పెంపుడు కుక్కలు, పిల్లులు ఉన్నాయి. వీటి వలన నాకు ఏదైనా ప్రమాదం ఉందా? 
– నైనిక, వరంగల్‌
ప్రెగ్నెన్సీలో ఏ విధమైన ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చినా, శిశువుకు వ్యాపిస్తుంది. దానితో కొన్ని ఆరోగ్య సమస్యలను చూస్తాం. జంతువుల ద్వారా వ్యాపించే ఇన్‌ఫెక్షన్స్‌ కొన్ని ఉన్నాయి. ఈ రోజుల్లో ఇంట్లో పెంపుడు జంతువులు ఉండటం చాలా సాధారణం. వాటికి వాక్సినేషన్‌ షెడ్యూల్‌ ప్రకారం వాక్సినేట్‌ చేయించాలి. పిల్లులు పెంచుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లుల మల విసర్జనలో టాక్సోప్లాస్మా అనే ఆర్గానిజమ్‌ ఉంటుంది. ఇది వ్యాపిస్తే, టోక్సోప్లాస్మోసిస్‌ ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. ఇది కడుపులోని బిడ్డకు హానికరం. అందుకే, మీరు పిల్లులకు సంబంధించిన కొన్ని పనులను చేయకూడదు. అంటే పిల్లి పరుపు, బొమ్మలను శుభ్రం చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే రబ్బర్‌ గ్లౌవ్స్‌ వేసుకొని చెయ్యాలి. 

జబ్బు పడిన పిల్లులకు దూరంగా ఉండాలి. తరచు చేతులు శుభ్రం చేసుకోవాలి. పిల్లులు మాత్రమే కాదు, గొర్రెలు, గొర్రె పిల్లలను పెంచుకునే వారు కూడా ఇదే జాగ్రత్త తీసుకోవాలి. అసలు జాగ్రత్త తీసుకోని వారికి ఈ పెంపుడు పిల్లుల బాధ్యత తీసుకోవటం వలన  బేబీకి ఇన్‌ఫెక్షన్స్, పుట్టిన శిశువు తక్కువ బరువుతో ఉండటం, గర్భస్రావం, శిశువుకు గర్భస్థ వైకల్యాలు లాంటి సమస్యలు వస్తాయి. మొదటి మూడు నెలల్లో ఎక్కువ సమస్యలు వస్తాయి. బేబీ బ్రెయిన్‌ డామేజ్, బేబీ కళ్లు, ఇతర అవయవాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. రెండో త్రైమాసికంలో ఇన్‌ఫెక్షన్స్‌ వస్తే, పెంపుడు జంతువులకు చాలా వరకు వాక్సినేట్‌ చేస్తాం. కాని, కొంతమందికి రేబిస్‌ వ్యాపిస్తుంది. పెంపుడు కుక్కలు ఈ రేబిస్‌ వైరస్‌ని క్యారీ చేస్తాయి. వాటి గోళ్లను రోజూ శుభ్రం చేయాలి. ఈ జంతువుల టేబుల్‌వేర్, పెట్‌ నెట్స్‌ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్‌గా వాక్సినేట్‌ చెయ్యాలి. 

పెట్స్‌ని దూరంగా ఉంచాల్సిన అవసరం లేదు. కాని ఈ పై జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి పెట్స్‌తో ప్రెగ్నెన్సీలో అలెర్జీ, దురదలు వస్తాయి. వీటితో ఇనెఫెక్షన్స్‌ కావచ్చు. బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అందుకే, జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ పెంపుడు జంతువుల ద్వారా ఇన్‌ఫెక్షన్‌ రిస్క్‌ ఎంత ఉందని ప్రెగ్నెన్సీకి ముందు కొన్ని పరీక్షలు చేసి కనిపెట్టవచ్చు. మీకు ఇమ్యూనిటీ ఎంత ఉంది అని చెక్‌ చేసే టార్చ్‌ టెస్ట్‌ (ఖీౖఖఇఏ ఖీఉ ఖీ) ఉంది. మీకు  యాంటీబాడీస్‌ లేకపోతే ఇన్‌ఫెక్షన్‌ చాన్స్‌ ఎక్కువ అని అర్థం. ఈ పెంపుడు జంతువుల ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్స్‌ని వాక్సిన్‌ ద్వారా అరికట్టలేం. కాబట్టి ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా ఉండాలి. శుభ్రంగా చేతులు కడుక్కుంటూ, పరిశుభ్రత పాటిస్తున్నట్లయితే, చాలా వరకు ఇన్‌ఫెక్షన్స్‌ రాకుండా నివారించవచ్చు. 

డా‘‘ భావన కాసు
గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌
హైదరాబాద్‌ 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)