Breaking News

ఆ టైంలో కూడా గుండె సమస్యలు వస్తాయా?

Published on Fri, 11/03/2023 - 15:44

మలయాళ బుల్లి తెర నటి డాక్టర్‌ ప్రియా గుండెపోటుతో కుప్పకూలి చనిపోయిన సంగతి తెలిసింది. నిండు గర్భిణి అయిన ఆమె సాధారణ చెకప్‌ కోసం ఆస్పత్రికి వచ్చినప్పుడే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దీంతో వైద్యులు ఆపరేషన్‌  చేసి ఆమె కడుపులో ఉన్న శిశువుని బయటకు తీసి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నెలల నిండక మునుపే పుట్టడంతో వైద్యులు ఆ చిన్నారిని అబ్జర్వేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. గర్భంతో ఉన్నప్పుడు మహిళలకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయా? ఎందువల్ల ఇలా జరుగుతుంది తదితరాల గురించే ఈ కథనం!.

అధిక రక్తపోటు, ధూమపానం తదితరాలే గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకాలు. కానీ నిపుణల అభిప్రాయం ప్రకారం గుండె సంబంధ సమస్యలకు మరో ప్రధాన కారకం ఉంది. అదే గర్భధారణ సమయంలో వచ్చే ప్రీక్లాంప్సియా. ఈ ప్రీక్లాంప్సియా అనేది ప్రమాదకరమైన తీవ్ర రక్తపోటు పరిస్థితి. ఇది మహిళలకు గర్భం దాల్చిన 20 వారం నుంచి మొదలవుతుంది. ఈ ప్రీక్లాంప్సియా చరిత్ర ఉన్న స్త్రీలు గుండెపోటు లేదా స్ట్రోక్‌తో చనిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.

గర్భస్రావమైన లేదా నెలలు నిండకుండానే ప్రసవించిన మహిళలకు ఈ ప్రమాదం మరింత ఎక్కువుగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే డెలివరీలలో 8% వరకు క్లిష్టతరం కావడానికి ప్రధానం కారణం ఈ ప్రీక్లాంప్సియానే అని వైద్యలు చెబుతున్నారు. యూఎస్‌లో 15% అకాల ప్రసవాలకు ఈ పరిస్థితి వల్లేనని తెలిపారు వైద్యులు.

ప్రీక్లాంప్సియా లక్షణాలు ఎలా ఉంటాయంటే..

  • తలనొప్పి
  • మబ్బు మబ్బుగా కనిపించడం
  • కంటిలో నల్లటి మచ్చలు
  • కడుపులో కుడివైపు నొప్పి
  • చేతులు, ముఖం వాచి ఉండటం
  • ఊపిరి ఆడకపోవడం

గర్భధారణ సమయంలో గుండె పదిలంగా ఉండాలంటే..

  • రక్తపోటును క్రమం తప్పకుండా చెక్‌ చేయించుకోవాలి
  • ఆరోగ్యకరమైన, కాలానుగుణ ఆహారాన్ని తినడం
  • వ్యాయామం చేయడం. ఇందులో మోస్తరు నుండి అధిక-తీవ్రత వర్కౌట్‌లు లేదా యోగా ఉంటాయి
  • అధిక బరువు పెరగకుండా ఉండండి
  • ఒత్తిడికి దూరంగా ఉండండి
  • శరీరంలో సరైన రక్త ప్రసరణ ఉండేలా చూసుకోవడం

తదితరాలను పాటిస్తే గర్భధారణ సమస్యలో ఈ గుండె సంబంధిత సమస్యల ఎదురవ్వవు. 

(చదవండి: త​క్కువ వ్యాయామమే మంచి ఫలితాలిస్తుంది!పరిశోధనల్లో షాకింగ్‌​ విషయాలు)


 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)