Breaking News

వధువే వరుడై...  రివర్స్‌ పెళ్లి ఊరేగింపు!

Published on Sat, 11/29/2025 - 01:01

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒక పెళ్లి ఊరేగింపు ‘ఆహా’ ‘వోహో’ అనిపించింది. శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని బ్రేక్‌ చేసింది. ఈ పెళ్లి ఊరేగింపు ప్రత్యేకత ఏమిటంటే... రివర్స్‌  ఊరేగింపు!

సంప్రదాయం ప్రకారమైతే వరుడు ఊరేగింపుగా వధువు ఇంటికి వెళతాడు. కాని ఈ పెళ్లిలో మాత్రం వధువు అత్తమామల ఇంటికి ఊరేగింపుగా వెళ్లింది. ఈ రివర్స్‌ పెళ్లి ఊరేగింపును చూడడానికి ప్రజలు తరలి వచ్చారు.

వధువే వరుడి ఇంటికి ఊరేగింపుగా వెళ్లాలనేది వధువు తండ్రి రాజేష్‌ జైస్వాల్‌ కోరిక. అతడికి అయిదుగు అమ్మాయిలు. కొడుకు లాగే కుమార్తె వివాహా ఊరేగింపును జరుపుకోవాలనే అతడి సుదీర్ఘకాల కల ఫలించింది.

ఈ రివర్స్‌ పెళ్లి ఊరేగింపును హైలెట్‌ చేస్తూ ‘లడ్కీకి బరాత్‌’ పేరుతో పెళ్లి పత్రికలు పంచాడు. అప్పటి నుంచే అందరిలో ఆసక్తి మొదలైంది. ఇదిసరేగానీ ఇంతకీ వరుడికి, అతడి తల్లిదండ్రులకీ, బంధువుకు ఈ రివర్స్‌ బరాత్‌ కాన్సెప్ట్‌ నచ్చిందా?
‘బ్రహ్మాండంగా’ అంటున్నాడు రాజేష్‌ జైస్వాల్‌. 

వరుడి బంధువులు అత్యంత ఉత్సాహంగా పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నారు. రెండు కిలోమీటర్‌ల పాటు సాగిన ఈ ఊరేగింపులో వధువు పాటలు పాడుతూ, డ్యాన్స్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
‘నేను ఈ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోను సేవ్‌ చేసుకున్నాను. నాకు  ఇద్దరు ఆడపిల్లలు. భవిష్యత్‌లో నా బిడ్డల పెళ్లి విషయంలో ఇదే కాన్సెప్ట్‌ అనుసరిస్తాను’ అన్నాడు ఒక తండ్రి.
మంచిదే కదా!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)