దెయ్యాల దీవి..అక్కడ నేల కింద ఏకంగా లక్షలకు పైగా

Published on Sun, 10/08/2023 - 11:23

ఇదేదో హారర్‌ సినిమా పేరు కాదు. ఇటలీలో ఉన్న ఈ దీవి నిజంగానే దయ్యాల దీవిగా పేరు మోసింది. దాదాపు అర్ధశతాబ్దంగా ఇక్కడ నరమానవులెవరూ నివాసం ఉండటం లేదు. ఈ దీవిలోని నేల కింద 1.60 లక్షలకు పైగా శవాలు సమాధి అయి ఉన్నాయి. ఇటలీ ఉత్తర ప్రాంతంలో వెనిస్‌–లిడో నగరాల మధ్య ఉన్న ఈ దీవి పేరు పోవెగ్లియా. ప్రత్యేక అనుమతి ఉంటేనే తప్ప ఈ దీవిలో సందర్శకులెవరూ అడుగు పెట్టలేరు. ఒకప్పుడు ఈ దీవి మానసిక రోగుల చికిత్స స్థావరంగా ఉండేది. ఇక్కడి మానసిక చికిత్స కేంద్రంలో పనిచేసే ఒక డాక్టర్‌ రోగులపై క్రూరాతి క్రూరమైన ప్రయోగాలు చేసేవాడు. అప్పట్లో ఇక్కడ మరణించిన రోగులను ఇక్కడే పాతిపెట్టేశారు.

ఇక్కడి మానసిక చికిత్స కేంద్రం 1968లో మూతబడిన తర్వాత ఈ దీవి పూర్తిగా ఖాళీ అయిపోయింది. మూతబడిన కొత్తలో కొందరు సాహసికులు ఈ దీవిలోకి వచ్చి, అంతా కలియదిరిగి వెళ్లిపోయేవారు. కొంతకాలానికి ఈ దీవిలోకి జనాల ప్రవేశాన్ని నిషేధించారు. ఇప్పటికీ ఈ నిషేధం అమలులో ఉంది. పరిశోధనల వంటి కారణాల కోసమైతే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొంది మాత్రమే ఇక్కడకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇటీవల బ్రిటిష్‌ పరిశోధకులు మ్యాట్‌ నాడిన్, ఆండీ థామ్సన్‌ ఇటలీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొంది, ఈ దీవిలోకి అడుగుపెట్టారు.

శిథిలావస్థకు చేరుకున్న మానసిక రోగుల ఆస్పత్రి, చుట్టుపక్కల ఉన్న ఇతర శిథిల నిర్మాణాలు, చుట్టూ కీకారణ్యంలా పెరిగిన చెట్లు, మొక్కలు, కట్టడాల మధ్యలో మొలిచిన ఊడల మర్రిచెట్లు వంటివాటిని వీడియో తీసి తమ యూట్యూబ్‌ చానల్‌లో పెట్టడంతో ఈ దీవి కథ వైరల్‌గా మారింది. ఈ దీవిలో 1922లో మానసిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

అంతకు ముందు 1793లో ఒకసారి, 1814లో మరోసారి ప్లేగు మహమ్మారి విజృంభించినప్పుడు ఈ దీవిని క్వారంటైన్‌ కేంద్రంగా నిర్వహించేవారు. ప్లేగుతో చనిపోయినవారిని, ఆ తర్వాత మానసిక చికిత్స కేంద్రంలో డాక్టర్‌ ప్రయోగాలకు ప్రాణాలు కోల్పోయినవారిని ఇక్కడి నేలలోనే పూడ్చిపెట్టేశారు. వారి ఆత్మలు ఇక్కడ సంచరిస్తుంటాయని ప్రచారం జరగడంతో ఇక్కడి మానసిక చికిత్స కేంద్రం మూతబడిన తర్వాత ఈ దీవి పూర్తిగా నిరుపయోగంగానే మిగిలిపోయింది.

(చదవండి: బ్లాక్‌ యాపిల్‌ గురించి విన్నారా? ఒక్కొక్కటి ఏకంగా..)

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)