Breaking News

బంగాళదుంప Vs చిలగడ దుంప: డయాబెటీస్‌ పేషెంట్లకు ఏదీ మంచిది?

Published on Thu, 01/25/2024 - 14:14

మారుతున్న జీవనశైలి కారణంగా మనదేశంలో డయాబెటీస్‌ రోగులు అంతకంతకు పెరిగిపోతున్నారు. ఇది ఒక దీర్ఘకాలికి సైలంట్‌ కిల్లర్‌ వ్యాధి. నెమ్మదిగా శరీర భాగాల పనితీరుని దెబ్బతీస్తుంది. అప్రమత్తతతో గ్లూకోజ్‌ లెవెల్స్‌ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం డేంజర్‌లో ఉన్నట్లే. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉండే ఆహారం తీసుకోవడమే మంచిది. ఈ నేపథ్యంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదా కాదా అన్న సందేహం వస్తుంది. ముఖ్యంగా దుంప జాతికి సంబంధించిన చిలగడ దుంపలు, బంగాళ దుంపల విషయంలో చాలామందికి  ఈ డౌటు వస్తుంది. అయితే ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే..

ముఖ్యంగా ఈ రెండిటీ విషయంలోనే ఎందుకూ అందరూ తినొచ్చా? వద్దా? అన్న డౌటు పడుతున్నారంటే.. ప్రధాన కారణం రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటమే. ఇవి రెండు భూమిలోనే పెరుగుతాయి. ఇక చిలగ దుంప తియ్యగా కూడా ఉంటుంది. దీంతో బాబోయ్‌! అని వాటి జోలికి కూడా పోరు షుగర్‌ పేషెంట్లు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం చిలగడ దుంపలను బేషుగ్గా తినండి అని చెబుతున్నారు. ఎందుకంటే? గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ బంగాళదుంపలోనూ చిలగడదుంపల్లోనూ వేర్వురుగా ఉంటుందట. అందులో బంగాళదుంపలకు సంబంధించిన కొన్ని జాతుల్లో మరీ వ్యత్యాసం ఉంటుందట. అయితే చిలగడదుంపల్లో ఫైబర్‌తో కూడి ఉంటాయి. పైగా గ్లైసెమిక్‌ కంటెంట్‌ కూడా చాలా తక్కువే. ఇందులో ముఖ్యంగా అధిక ఫైబర్‌ తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ ఏ ఉంటాయని అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు చిలగడ దుంపలు తీసుకోవడమే మేలని సూచిస్తున్నారు.

బంగాళ దుంపలను వండుకుని తీనే తీరుని బట్టి డయాబెటీస్‌ రోగులకు మంచి షోషకాహారంగా ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే? ఉడకబెట్టిన బంగాళదుంపలో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగానే ఉంటుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. అదే వాటిని డీప్‌ ఫ్రై లేదా ఇతరత్ర విధానంలో ఫ్రై వంటి కూరల్లా చేసుకుంటే మాత్రం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. అలాగే చిలగ దుండపలను చక్కగా ఉడకబెట్టుకుని ఏదైనా ప్రోటీన్‌ మూలంతో తినడం మంచిదని అంటున్నారు. అమ్మో అవి స్వీట్‌గా ఉంటాయన్న భయం ఉంటే..కనీసం ఆ స్వీట్‌ పొటాటోని ఉకడబెట్టి వాటిపై దాల్చిన పొడి జల్లుకుని తీసుకున్న మీ శరీరానికి కావాల్సిన అ‍న్ని పోషకాలు అందుతాయని చెబుతున్నారు.

అలాగే బంగాళదుంపల్లో  పోటాషియం అధికంగా ఉండటమే గాక కొన్నిరకాల బీ కాంప్లెక్స్‌ విటమిన్లు ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ రెండిటిని మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. అంతేగాదు ఈ దుంపలు కార్బోహైడ్రేట్‌ వర్గంలోకి వస్తాయి కూరగాయాల కిందకి రావని అర్థం చేసుకోండని హెచ్చరిస్తున్నారు. ఇలాంటివి తినేటప్పుడూ చీజ్‌, ఆయిల్‌ వంటి ఇతరత్ర కొలస్ట్రాల్‌తో ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని వార్నింగ్‌ ఇస్తున్నారు. ఇక్కడ కార్బోహైడ్రేట్‌ అనేది శక్తి వనరుగా శరీరానికి అత్యంత అవసరమైనదని గుర్తించుకోవాలి. దాన్ని సమతుల్యంగా తీసుకుంటే ఎలాంటి సమ్య ఉండదని చెబుతున్నారు నిపుణులు

గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే ఇస్తున్నాం. పాటించే మందు మీ ఆరోగ్య స్థితిని దృష్టిలో ఉంచుకుని మీ వ్యక్తిగత వైద్యులు లేదా డైటీషియన్లన సలహాలు సూచనలతో ఫాలో అవ్వడం మంచిది. 

(చదవండి: కృష్ణఫలం గురించి విన్నారా? తింటే బొలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)