Breaking News

బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారా? ఆరోగ్యానికి మంచిది కాదా!

Published on Wed, 07/12/2023 - 17:12

పోషకాహార ప్రపంచంలో బంగాళ దుంపలను విలన్‌గా చూస్తారు. అమ్మో! బంగాళదుంప తింటే..ఇంకేమైనా ఉందా..! బరువు పెరిగిపోతాం అని భావిస్తారు చాలామంది. దాని జోలికి పోవడానికే భయపడిపోతారు. ఇందులో కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయని తీసుకోవడానికే జంకుతారు. కానీ ఇది నిజం కాదంటున్నారు ఆహార నిపుణలు. ఇవి ఆరోగ్యానికి చాలమంచి సమతుల్య ఆహారం అని చెబుతున్నారు.

అందరూ బంగాళ దుంపలను చూసి భయపడటానికి కారణం వేయించిన ఆహారంగా భావించడమేనని నిపుణులు చెబుతున్నారు. నిజానికి బంగాళ దుంప ఆరోగ్యానికి చెడ్డది కాదని అంటున్నారు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పైగా చాలా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందులో విటమిన్ సీ, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌ తదితర పోషక విలువలు ఉంటాయి. ఐతే ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి కాబట్టి రైస్‌తో జోడించి తీసుకోవద్దని సూచిస్తున్నారు న్యూట్రీషియన్లు.  

ప్రతిరోజు మీడియం సైజులోని బంగాళదుంపలను నిరంభ్యంతరంగా తీసుకోవచ్చని అంటున్నారు. ఇందులో స్టార్ట్‌ అధికంగా ఉంటుంది కాబట్టి ప్రోటీన్‌తో కూడిన ఆహారాన్ని జత చేయకూడదు. వేయించిన బంగాళ దుంపలను అస్సలు దగ్గరకు రానీయద్దు. కేవలం ఉడకబెట్టడం, లేదా వేరే కాయగూరలతో కలిసి తీసుకోవడం వంటివి చేయొచ్చు.  

వీటిలో ఉండే పోషకాలు..

  • బంగాళదుంపల్లో విటమిన్‌ సీ, పోటాషియం, విటమిన్‌​ బీ6 ఉంటాయి. 
  • వీటిలో డైటరీ ఫైబర్‌, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే తయరీ విధానం అనుసరించి పోషక కంటెంట్‌ మారుతుంది
  • ఇందులో ప్రధానంగా కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది శరీరానికి మంచి శక్తినిస్తుంది. 
  • ఇందులో కరిగే, కరగని ఫైబర్లు ఉంటాయి. ఈ ఫైబర్లు జీర్ణక్రియకు సహాయపడతాయి. 
  • రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

ఆరోగ్య ప్రయోజనలు
►దీనిలో ఉండే విటమిన్‌ సీ రోగనిరోధక వ్యవస్థకు, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది
►గుండె, కండరాల పనితీరుకు ఇందులో ఉండే విటమిన్‌ సీ, ఫైటోకెమికల్స్‌ రక్షణగా ఉంటాయి.
►ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొన్ని వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి. 
అయితే ఈ బంగాళదుంపల్లో గ్లైసెమిక్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచే అవకాశం ఉంది. అందుకే దీన్నీ ఆకుకూరలు, వంటి ఇతర కూరగాయాలతో మిక్సింగ్‌ చేసి తీసుకోవడమే ఉత్తమం. చక్కెర స్థాయిలను తగ్గించేలా చేసుకునే బంగాళదుంపల వంటలను ఎంపిక చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే స్టార్చ్‌, అధిక కార్బోహైడ్రేట్‌ కంటెంట్‌ కారణంగా మితంగా ఉపయోగించడమే మంచిది. 

గమనిక: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.

(చదవండి: బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగే అలవాటుందా? ఇందులోని నైట్రేట్‌ వల్ల..)

#

Tags : 1

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి