అడవుల్లో బతికేస్తున్న పాపులర్‌ టిక్‌టాకర్‌

Published on Mon, 07/31/2023 - 12:15

ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పెద్దమనిషి కొంతకాలంగా అడవుల్లో సంచరిస్తూ గుహలలోనే తలదాచుకుంటూ బతికేస్తున్నాడు. గుహలలో తలదాచుకోవడానికి, అడవుల్లో సురక్షితంగా తిరగడానికి అవసరమైన మెలకువలు చెబుతూ సెల్ఫీ వీడియోలను ‘టిక్‌టాక్‌’లో షేర్‌ చేసుకుంటున్నాడు. అమెరికాలోని కొలరాడోకు చెందిన ఈ ఆధునిక అడవి మనిషి పేరు డానీ డస్ట్‌. ‘టిక్‌టాక్‌’లో ఇతడికి ఏకంగా కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

‘గుహలలో తలదాచుకోవడం అంత తేలికైన పనేమీ కాదు. తలదాచుకోవాలనుకున్న గుహ సురక్షితమైనదో కాదో చూసుకోవాలి. గుహలో ఏదైనా జంతువు విసర్జకాలు ఉన్నట్లయితే, అది ఆ జంతువు సొంతం. అలాంటి గుహలో తలదాచుకోవడం ప్రాణాలకే ప్రమాదం. అలాగే గుహల్లో ఉండే సాలెగూళ్లు, తేనెపట్లులాంటివి ఏవైనా ఉన్నా జాగ్రత్తగా చూసుకోవాలి.

గుహ పైభాగంలో పగుళ్లు ఉన్నాయో లేదో చూడాలి. పైభాగంలో పగుళ్లు ఉంటే, ఏ క్షణంలోనైనా పెళ్లలు విరిగి నెత్తిన పడే ప్రమాదం ఉంటుంది. అన్నీ సజావుగా ఉన్న గుహను ఎంపిక చేసుకోవడం ఒక కష్టమైతే, అందులోని రాతి నేల మీద అలాగే పడుకోలేం. అందుకని తగినంత ఎండుగడ్డిని పోగు చేసుకుని, పరుచుకుంటే పడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది’ అని చెబుతాడు డానీ. అడవుల్లో పక్షులను, జంతువులను వేటాడుతూ, వాటి మాంసంతోను, అడవిలో దొరికే పండ్లు కాయలతోనే కాలక్షేపం చేస్తూ ఇతడు తీసే వీడియోలు క్షణాల్లోనే వైరల్‌ అవుతుండటం విశేషం.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)