భగవంతుడు నిష్పక్షపాతి, అవునా? కాదా?

Published on Wed, 10/15/2025 - 11:52

ఒకడు కోటీశ్వరుల ఇంట్లో జన్మిస్తాడు. వానిని చూసి పేదవాడంటాడు – దేవునికి పక్షపాతముందని! లేకపోతే తనను పేదవానిగా, అతనిని ధనికునిగా ఎందుకు పుట్టిస్తాడని ప్రశ్నిస్తాడు. ఒకసారి పరమహంస యోగానంద ఒక కథ చెబుతారు. 

ఒక రాజుండేవాడు. ఆయన తన ప్రధానమంత్రి పట్ల చాలా ప్రేమను, గౌరవాన్ని కనబరచే వాడు. మిగిలిన వారికి అసూయ కలిగి, రాజు గారికి పక్షపాతముందని గుసగుసలాడేవారు. రాజు గారి చెవిన ఆ విషయం పడింది. మరుసటి రోజు అందరూ సమావేశమై ఉండగా దూరంలో సంగీతం వినబడింది. అక్కడ ఏమి జరుగుతున్నదో కనుక్కొని రమ్మని ఒకనిని పంపాడు రాజు. అతడు వెళ్ళి వచ్చి అక్కడొక వివాహం జరుగుతున్నదని చెప్పాడు ఆ వ్యక్తి. ఎవరు పెళ్ళి చేసుకొంటున్నారని రాజు ప్రశ్నించాడు. ఆ వ్యక్తి ‘తెలీదు’ అన్నాడు. కనుక్కొని రమ్మని మరొకనిని పంపించాడు రాజు. ఆ వ్యక్తి తిరిగి వచ్చి ఫలానా వారిదని చెప్పాడు. రాజు  మరొక్క ప్రశ్న వేశాడు. ఆ వ్యక్తి జవాబు చెప్పలేక ఊరికే నిల్చున్నాడు. కనుక్కొని రమ్మని మరొక్క వ్యక్తిని రాజుగారు పంపారు. అతడు వచ్చిన తర్వాత ఇంకొక ప్రశ్న వేస్తే జవాబు లేదు. చివరకు రాజు గారు తన ప్రధానమంత్రిని పంపారు. ఆయన వెళ్ళి వచ్చాడు. రాజు గారు అడిగిన ప్రతి ప్రశ్నకూ వివరంగా జవాబులు చెప్పాడు.

చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్‌ జీతాన్ని వదులుకుని రిస్క్‌ చేస్తే..!

అప్పుడు రాజు ‘ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఆయన పట్ల ఎందుకు గౌరవాన్ని చూపుతానో?’ అని అందర్నీ చూస్తూ అడిగాడు. అందరూ తలలు దించుకున్నారు. (పుట 292: మానవుడి నిత్యాన్వేషణ–పరమహంస యోగానంద). ఒక సాధారణ రాజుగారి చర్యకే ఇంతటి బలమైన కారణముంటే సర్వజ్ఞుడైన భగవంతుడు నిష్కారణంగా ఎవరికైనా ఇస్తాడా, చేస్తాడా?
– రాచమడుగు శ్రీనివాసులు

#

Tags : 1

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)