Breaking News

సంజయ్‌ మరణానికి కారణం ఓ తేనెటీగ : వైద్యులు ఎంత శ్రమించినా.!

Published on Fri, 06/13/2025 - 12:41

అహ్మదాబాద్‌లో జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్నో కంపెనీల్లో అంతులేని శోకాన్ని నింపింది. ఒక్కో కుటుంబానికి ఒక్కో విషాద గాథ. ఎన్నో ఆశలతో విమానం ఎక్కిన వందలమంది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు.  ఈ విషాదం ఇలా ఉండగానే  బిజినెస్‌  ప్రపంచంలో మరో విషాదం చోటు  చేసుకుంది.  సోనా కామ్‌స్టార్‌కు చెందిన ఉంజయ్ కపూర్ అకస్మాత్తుగా కన్నుమూశారు. విమాన ప్రమాదంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన కొన్ని గంటల తరువాత గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. అయితే ఆయన మరణం ఎలా జరిగిందో  తెలిస్తే షాకవ్వక మానరు. మరణం ఎటువైపు ఎలా ముంచుకు వస్తుందో తెలియదు అనడానికి ఈ  సంజయ్‌ మరణం నిదర్శనంగా నిలుస్తోంది. 


పోలో క్రీడలో ప్రసిద్ధుడు, వ్యాపారవేత్త బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్, 53 ఏళ్ల వయసులో గుండెపోటుతో యునైటెడ్ కింగ్‌డమ్‌లో మరణించారు.  పోలో ఆడుతున్నప్పుడు, ఒక తేనెటీగ సంజయ్ నోటిలోకి దూరిపోయింది. పొరపాటున దాన్ని మింగడంతో అది గుండెపోటుకు దారితీసిందని చెబుతున్నారు. తక్షణమే  వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని. నిపుణులు కూడా పరిస్థితిని పరిష్కరించలేకపోయారట.

భారతదేశ ఆటోమోటివ్ రంగంలో ప్రముఖ వ్యాపారవేత్త,  కపూర్ ఆటోమోటివ్ మార్గదర్శకుడు సురీందర్ కపూర్ కుమారుడు   సోనా కామ్‌స్టార్ చైర్మన్ సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం బిజినెస్‌ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎయిరిండియా ప్రమాదంపై తన విచారాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అంతలోనే ఆయన కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు,  సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ప్రమాదంపై ఆయన ట్వీట్‌ 
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా  విమాన ప్రమాదంపై కపూర్ సోషల్ మీడియా ద్వారా విచారం వ్యక్తం చేశారు. "అహ్మదాబాద్‌లో జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా ప్రమాదం భయంకరమైన వార్త. బాధిత కుటుంబాలందరికీ నా సానుభతి. ఈ క్లిష్ట సమయంలో  ధైర్యాన్ని, శక్తిని పొందాలని కోరుకుంటున్నాను"

ఎవరీ సంజయ్‌ కపూర్‌
గురుగ్రామ్‌లో ఉన్న ప్రముఖ ప్రపంచ ఆటో విడిభాగాల తయారీదారు సోనా కామ్‌స్టార్‌ అధినేత సంజయ్‌ కపూర్. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ACMA) అధ్యక్షుడిగా కూడా పనిచేశారు . అలాగే  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) తయారీ మండలికి సహ-అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తాను చదువుకున్న డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు.  బకింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నుండి HRలో BBA పూర్తి చేసిన తరువాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఓనర్-ప్రెసిడెంట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో చేరారు. సంజయ్ 2003లో తన తండ్రి కంపెనీలో పగ్గాలు చేపపట్టి ప్రపంచ బ్రాండ్‌గా దాన్ని తీర్చిదిద్దారు. సోనా కామ్‌స్టార్ అనే కంపెనీకి సంజయ్ ఛైర్మన్‌గా  ఉన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)