Breaking News

అందమైన అనుభవాలు.. అద్భుతమైన జ్ఞాపకాలు

Published on Mon, 06/02/2025 - 06:19

2024లో మిస్‌  పోలోనియా కిరీటాన్ని గెలుచుకున్న మాజా క్లాజ్డా ఈ ఏడాది మిస్‌ వరల్డ్‌ ఫైనల్‌లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. అందం,  తెలివితేటలు, సమతుల్యతతో న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను ఆకర్షించింది. ఆమె బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ చొరవ, నేటి అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటైన పిల్లలు, యుక్తవయస్కుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. మానసిక అనారోగ్య నివారణ, భావోద్వేగ సంఘర్షణలపై దృష్టి సారించి, 40 కి పైగా వర్క్‌షాప్‌లను నిర్వహించింది. 

మానసిక శ్రేయస్సు గురించి యువత తమను తాము, తమతో ఉన్న వారిని ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ఈ వర్క్‌షాపులు ఉపకరిస్తున్నాయి. మనస్తత్వశాస్త్ర విద్యార్థిగా, మాజా టీనేజర్లతో వారి స్వంత భాషలో కనెక్ట్‌ అవుతుంది. సామాజిక బహిష్కరణ ప్రమాదంలో ఉన్న పిల్లలకు మద్దతు ఇచ్చే గ్రోయింగ్‌ అప్‌ జోన్‌ ఫౌండేషన్ కు చెందిన 12 ఏళ్ల బాలుడి కలను మాజా ఇటీవల నెరవేర్చింది. ఆమె అతన్ని బార్సిలోనాలో జరిగే లైవ్‌ మ్యాచ్‌కు హాజరు కావడానికి బార్సిలోనాకు తీసుకువెళ్లింది. అతని జీవితకాల కోరికను నెరవేర్చింది.

సంతృప్తికరమైన అనుభవాలు
నేను పొందిన గొప్ప విజయాల్లో ఒకటి చిన్నచూపును అధిగమించడం. మొదట్లో న లుగురితో కలవాలంటే చాలా సిగ్గుపడేదాన్ని. దానిని దాటి ఈ దశకు వచ్చాను. ప్రజలతో కలిసి పోవడం, వారితో మాట్లాడుతూ ఉండటం అంటే నాకు ఇష్టం. కిరీటం దక్కక పోయినా అంతకు మించిన అనుభవాలు నాకు అద్భుతమైన జ్ఞాపకాన్ని ఇచ్చాయి. ఇక్కడి ఆతిథ్యం నాకు మా ఇంటిని గుర్తు చేసింది. ఇది నా రెండో కుటుంబంలా అనిపించింది. మెడికల్‌ టూరిజంలో భాగంగా ఏఐజీ హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు వారి ఆ΄్యాయత నన్ను ఆకట్టుకుంది. వారు ఎంతో బాధలో ఉండి కూడా చిరునవ్వుతో మాకు ఆహ్వానం పలికారు. ముచ్చటించారు. అది నా జీవితంలో మరచి పోలేను. ఇక్కడ ప్రతి ఒకరికి మరొకరితో ఉన్న కనెక్టివిటీ, రిలేషన్స్ చాలా బాగున్నాయి’’ అంటూ తెలంగాణలో మిస్‌ వరల్డ్‌  పాజెంట్‌ జరిగిన తీరు పట్ల సంతృప్తి వ్యక్తం 
చేసింది మాజా క్లాజ్డా

– నిర్మలారెడ్డి 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)