Breaking News

భారత అత్యున్నత న్యాయమూర్తి ఫాలో అయ్యే డైట్‌ ఇదే!

Published on Fri, 03/22/2024 - 11:43

ధనంజయ్‌ యశ్వంత్ చంద్రచూడ్ భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. గతంలో ఆయన అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ, బాంబే హైకోర్టు న్యాయమూర్తిగానూ పనిచేశారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. సుదీర్ఘకాలంపాటు పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ కుమారుడే ఈ ధనంజయ్‌ యశ్వంత్‌ చంద్రచూడ్‌. ఇక ఆయన ఒక మీడియా ఇంటర్వ్యూలో తన జీవనశైలి, ఫాలో అయ్యే డైట్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అంతేగాదు తన దైనందిన జీవితంలో ఆహార ప్రాధాన్యతలు, అలాగే తన రోజు ఎలా ప్రారంభమవుతుందనే వాటి గురించి కూడా చెప్పుకొచ్చారు డివై చంద్రచూడ్‌. అవేంటో తెలుసుకుందాం!

ఆయన మంచి జీవనశైలే ఆరోగ్యంగా ఉండటంలోనూ రోజంతా ఉత్సాహంగా ఉండంటంలోనూ ఉపకరిస్తుందని అన్నారు. తాను ఉదయం 3.3 గంలకు యోగాతో రోజు ప్రారంభిస్తానని, ప్రాధమిక ఆయుర్వే ఆహార జీవనశైలిని అనుసరిస్తానని అన్నారు. ఇక తాను తన భార్య శాకాహారులమని చెప్పారు. తనకు ఎక్కువుగా మొక్కల ఆధారిత డైట్‌ బాగా పనిచేసిందన్నారు. ఎందుకంటే మన నాలుక మీదే మన శరీరం తీరు, మానసికోల్లాసం ఆధారపడి ఉందన్నారు. అంటే నాలుక రుచి కావాలనుకుంటే శరీరం బరువు అదుపుతప్పుతుంది. తద్వారా మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతుందని అర్థం.

ఇక్కడ నాలుకను నియంత్రణలో ఉంచుకుంటే ఎలాంటి ఆహారమైన అమృతంగా తీసుకోగలమని చంద్రచూడ్‌ చెబుతున్నారు. మరాఠి అయిన చంద్రచూడ్‌ తాను సాబుదానా కంటే రామాదాన ఇష్టపడతానన్నారు. అంటే ఇక్కడ రామదానా అంటే ఉసిరికాయ అని అర్థం. అలాగే తాను  ఆరోగ్యకరమైన తృణధాన్యాలను తీసుకుంటానని చెప్పారు. ఈ డ్రైట్‌ ఒక్కోసారి తాను కూడా స్ట్రిట్‌గా ఫాలో అవ్వలేనని అన్నారు. ఎందుకంటే ఒక్కోసారి నాకిష్టమైన ఐసీక్రీ కూడా వచ్చి చేరుతుందిగ అంటూ నవ్వేశారు. కానీ తాను నాలుకును, మనసును నియంత్రణలో పెట్టుకోగలనని అందువల్లో ఒక్కోసారి స్కిప్‌ అయ్యినా, ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోగలనని అన్నారు. 

మొక్కల ఆధారిత డైట్‌ అంటే..

  • గత కొన్నేళ్లుగా ప్రజల జీవనశైలిలో పలు మార్పులు వచ్చాయి. ఎక్కువగా శాకాహారంవైపుకు మళ్లుతున్నారు. ఒకకరకంగా జంతు హింస జరగకుండా ఉండేలా చేయడం నుంచి మొదలయ్యిందే ఈ మొక్కల ఆధారిత డైట్‌ అని చెప్పొచ్చు. ఈ డైట్‌లో పచ్చగా ఉండే వాటితో ఆరోగ్యాన్ని మెరుగ్గు ఉంచుకుంటారు. ఈ శాకాహారం డైట్‌లో తప్పనిసరిగా తీసుకోవాల్సినవి పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాలు, కాయధాన్యలు తోపాటు ఆకకూరలకు సంబంధించిన మొక్కల ఆధారిత ఆహారాలు. 
  • ఇక్కడ శాకాహార అనంగానే పాల ఉత్పత్తులను కూడా దగ్గరకు రానియ్యరు.
  • దాని బదలు, బాదంపాలు, సోయా పాలు, కొబ్బరి పాలు, తదితర మొక్కల ఆధారిత పాలను ప్రత్నామ్నాయంగా తీసుకుంటారు
  • కానీ ఇక్కడ ఇలా భారత అత్యున్నత  న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ మాదిరిగా మొక్కల ఆధారిత డైట్‌ ఫాలో అవ్వాలంటే శరీరం, మనస్సు నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే సులభంగా, రుచికరంగా శాకాహారాన్ని వండుకునే యత్నం చేయాలి. అప్పుడే ఈ డైట్‌ని సక్రమంగా ఫాలో అయ్యి, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇక్కడ ఏదైనా ఇష్టంతో, ఆరోగ్య స్ప్రుహతో చేయగలిగితేన మెరుగైన ఫలితాలు పొందగలరనేది అత్యంత కీలకం.  

(చదవండి: 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..!)


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)