Breaking News

పార్కుగా మారనున్న రైల్వేస్టేషన్‌

Published on Sun, 07/23/2023 - 09:03

పార్కుగా మారనున్న పాడుబడ్డ స్టేషన్‌ ఇది పాతకాలం నాటి రైల్వేస్టేషన్‌. దశాబ్దాలుగా వినియోగంలో లేకపోవడంతో పూర్తిగా పాడుబడింది. ఇంగ్లండ్‌ కెంట్‌ కౌంటీలోని లాయిడ్‌ పట్టణంలో ఉంది ఈ స్టేషన్‌. దీనిని 1881లో నిర్మించారు. తొలినాళ్లలో ఇక్కడకు రైళ్ల రాకపోకలు బాగానే కొనసాగేవి. అయితే, ఐదు దశాబ్దాలుగా రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. స్థానికంగా గొడవలు జరిగినప్పుడు ఇక్కడి యువకులు ఈ స్టేషన్‌పై రాళ్లు రువ్వడం, నిప్పుపెట్టడం వంటి పనులు చేస్తుండటం పరిపాటిగా మారింది.

స్థానికుల దాడుల వల్ల ఈ భవంతి బాగా దెబ్బతింది. దీని గోడల నిండా ఆకతాయిలు రాసిన పిచ్చిపిచ్చి రాతలు కనిపిస్తుంటాయి. ఇన్నాళ్లకు స్థానిక అధికారులకు ఈ రైల్వేస్టేషన్‌ను పార్కుగా మార్చాలనే బుద్ధిపుట్టింది. పాడుబడిన రైల్వేవ్యాగన్లతో ఇరవై జంట క్యారవాన్లను, ఆరు సింగిల్‌ క్యారవాన్లను సిద్ధం చేయనున్నారు. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా తగిన వసతులను ఏర్పాటు చేసి, త్వరలోనే పూర్తిస్థాయి పార్కుగా మార్చనున్నారు.

(చదవండి: ఇంకో యాభై ఏళ్లలో ఆ దేశం అదృశ్యం!)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)