Breaking News

వీధుల్లో బిక్షాటన చేసే అమ్మాయి నేడు డాక్టర్‌గా..!

Published on Wed, 10/23/2024 - 17:32

జీవితం అంటేనే కష్టాల మయం అనుకుంటాం. కటిక దారిద్ర్యంలో మగ్గుతున్న వాళ్లకు కూడా జీవితం కొన్ని సువర్ణావకాశాలు అందిస్తుంది. అయితే ఆ అవకాశాలను తెలివిగా అందిపుచ్చుకున్న వారే అద్భుతాలు చేసి చూపిస్తారు. అలాంటి కోవకు చెందిందే పింకీ హర్యాన్‌. మురికి వాడల్లో తల్లిదండ్రులతో బిక్షాటన చేస్తూ బతికిన అమ్మాయి..నేడు డాక్టర్‌ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచడమే గాక ఎందరికో స్ఫూర్తిని కలిగించింది. 

వివరాల్లోకెళ్తే.. పింకీ హర్యానా హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని మెక్లీడ్‌గంజ్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించింది. చరణ్‌ ఖుద్‌లోని మురికివాడలో నివసించే ఆ కుటుంబం రోడ్డుపై భిక్షాటను చేస్తూ జీవనం సాగిస్తుండేది. చెత్త కుండిల్లో ఆహారాన్ని ఏరుకుని తినే దుర్భర జీవితాన్ని సాగించేది పింకీ కుటుంబం. ప్రారంభ జీవితం అంతా కటిక దారిద్య్రం, కష్టాల మధ్య సాగింది. 

ఏదో అద్భుతం జరిగినట్లుగా ధర్మశాలలోని టోంగ్‌ లెన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు నేతృత్వం వహించే బౌద్ధ సన్యాసి లోబ్‌సాంగ్ జమ్యాంగ్‌ దృష్టిలో పింకీ పడింది. అదే ఆమె జీవితాన్ని మార్చబోతుందని ఆనాడు ఊహించలేదు. ఆయన పింకీని చూసి చదివించాల్సిందిగా ఆమె తండ్రి కాశ్మీరీ లాల్‌ను కోరాడు. అందుకు మొదట కాశ్మీరీ లాల్‌ అంగీకరించలేదు. ఐతే జమ్యాంగ్‌ తన మాటలతో అతడిని ఒప్పించి పింకీని ధర్మశాలలోని దయానంద్ పబ్లిక్ స్కూల్‌లో చేరిపించాడు. 

అలా అక్కడ నిరుపేద పిల్లల కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్‌ హాస్టల్‌లో నివశించిన తొలి విద్యార్థిగా పింకీ నిలిచింది. తన జీవితాన్ని మంచిగా మార్చుకునేందుకు దేవుడిచ్చిన ఈ సువర్ణావకాశాన్ని పింకీ అస్సలు వదులుకోలేదు. ఆ పాఠశాలలో చేరినప్పటి నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చకోవడమే గాక మంచి మార్కులతో అన్ని తరగతులు పాసయ్యింది. చివరికీ పింకీ 12వ తరగతి పరీక్షలు పూర్తి అయిన వెంటనే రాసిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌లో కూడా ఉత్తీర్ణత సాధించింది. కానీ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సంపాదించుకునేలా మంచి ర్యాంకు సాధించలేకపోయింది. 

అందువల్ల మిగతా పిల్లలు మాదిరిగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అంతంతా ఫీజులు చెల్లించి చదవుకులేని నిస్సహయ స్థితిలో పడింది పింకీ. మళ్లీ తన పరిస్థితి మొదటకొచ్చింది అనుకునేలోపే 2018లో, టోంగ్-లెన్ ఛారిటబుల్ ట్రస్ట్ మరోసారి ఆమెను ఆదుకుంది. చైనాలోని ప్రఖ్యాత మెడికల్‌ కాలేజ్‌లో అడ్మిషన్‌ పొందడంలో పింకీకి సహాయం చేసింది. అలా ఆమె ఆరేళ్లలో చైనీస్‌ కళాశాల నుంచి ఎంబీబీఎస్‌ పట్టా పొంది డాక్టర్‌ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ధర్మశాలకు తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె భారతదేశంలో వైద్యం అందించేందుకు అవసరమైన మెడికల్ లైసెన్స్‌ని పొందేందుకు ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌(ఎఫ్‌ఎంజీఈ) కోసం సిద్ధమవుతుంది. 

ఇంతలా పింకీ జీవితాన్ని మార్చిన బౌద్ధ సన్యాసి లోబ్సాంగ్ జమ్యాంగ్ ఆమెను చూసి గర్వపడుతున్నానని అన్నారు. పిల్లలు మంచి మనుషులుగా మారేలా ప్రోత్సహించబడితే నిస్సందేహంగా అద్భుతాలు చేస్తారని విశ్వసిస్తానని చెప్పారు. ఇక పింకీ తన జీవితాన్ని ఇంతలా గౌరవప్రదంగా మార్చిన జమ్యాంగ్‌ని తన తండ్రిగా అభివర్ణించింది. 

అంతేగాదు పింకీలా ఆ ధర్మశాలలో చదివిన వందలాది మంది పిల్లలు జీవితాలు మారడమే గాక వారంతా వైద్యులు, ఇంజనీర్లు, ప్రభుత్వాధికారులుగా స్థిరపడ్డారు. ఈ పింకీ గాథ జీవితంలో లభించే అవకాశాన్ని అందిపుచ్చుకుని కష్టపడితే కష్టాల నుంచి బయటపడటమే గాక అద్భుతాలు చేసి చూపించొచ్చని తెలుస్తోంది కదూ..!.

(చదవండి: ఈసారి దీపావళికి చీరను వెరైటీగా కట్టుకోండిలా..!)
 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌