Breaking News

రొమ్ము కేన్సర్‌ అవేర్నెస్‌ రన్‌.. ‘పింక్‌థాన్‌’

Published on Fri, 09/26/2025 - 10:06

బ్రెస్ట్‌ కేన్సర్‌పై అవగాహన కల్పిండమే లక్ష్యంగా హైదరాబాద్‌తో పాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాల్లో పింక్‌థాన్‌ రన్‌ నిర్వహించనున్నారు. జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌ ఆధ్వర్యంలో డిసెంబరు 21న నిర్వహించనున్న ఈ రన్‌లో 30 వేల మందికి పైగా మహిళలు పాల్గోనున్నారని, ఇందులో అల్ట్రా రన్స్, రీలే రన్‌ ఉన్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. 

ప్రతి నెల మూడు నిమిషాల సెల్ఫ్‌ బ్రెస్ట్‌ ఎగ్జామ్‌ మహిళల ప్రాణాలను రొమ్ము కేన్సర్‌ నుంచి కాపాడగలదని జైడస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శరి్వల్‌ పటేల్‌ తెలిపారు. పింక్‌థాన్‌తో మరింత మందిని చైతన్యపరచడమే లక్ష్యమన్నారు. దేశంలో యేటా రెండు లక్షల మంది మహిళలు బ్రెస్ట్‌ కేన్సర్‌ బాధితులు అవుతున్నారని ఫిట్‌నెస్‌ ఐకాన్‌ పింక్‌థాన్‌ ఫౌండర్‌ మిలింద్‌ సోమన్‌ అన్నారు.

27న నేచర్‌ క్యాంప్‌ 
ఫారెస్ట్‌ ట్రెక్‌పార్కులో నేచర్‌ క్యాంప్, బర్డ్స్‌ వాక్‌ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రంజిత్‌ నాయక్‌ తెలిపారు. మంచిరేవులలోని ఫారెస్ట్‌ ట్రెక్‌పార్కులో 27 శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం ఉదయం పది గంటల వరకూ నేచర్‌ క్యాంప్‌ ఉంటుందని తెలిపారు. 

టీం బిల్డింగ్, టెంట్‌ పిచింగ్, నోక్టర్నల్‌ వాక్, నైట్‌æ క్యాంపింగ్, క్యాంప్‌ ఫైర్, ట్రెక్కింగ్, నేచర్‌ ట్రయల్, బర్డ్‌ వాచింగ్‌ ఉంటాయన్నారు. సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, ఉదయం టిఫిన్‌ అందిస్తామన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్కులో బర్డ్‌ వాక్‌లో పిల్లలు, పెద్దలు పక్షుల జాతులను గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు 73823–07476, 94935–49399లను సంప్రదించాలని సూచించారు.  

(చదవండి: 'గోల్డెన్‌ కేర్‌': పెద్దలకు భరోసా..!)

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)