Breaking News

కళింగలో పట్టు ప్రదర్శన

Published on Mon, 11/11/2024 - 16:53

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12 కళింగ కల్చరల్‌ హాలు వేదికగా ప్రతిష్టాత్మక ‘జాతీయ పట్టు వస్త్ర ప్రదర్శన’ ఆదివారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శణను రాష్ట్రీయ గౌరవ్‌ అవార్డ్స్‌ ఫౌండర్, ఆక్యుపేషనల్‌ హెల్త్‌ ఎన్విరాన్మెంటల్‌ సేఫ్టీ ఆఫీసర్‌ సాత్విక గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళింగ కల్చరల్‌ హాలులో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులు మన సాంస్కృతిక వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని తెలిపారు. 

భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూ్యమ్స్‌ వ్రస్తోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని సాతి్వక గుప్తా అన్నారు. ఈ సందర్భంగా  చేనేత కారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత గురించి తెలుసుకున్నారు. అనంతరం జాతీయ పట్టు వస్త్ర ప్రదర్శన నిర్వాహకులు జయేష్‌ గుప్తా మాట్లాడుతూ.. ఈ నెల 17 వరకూ కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన చేనేత కారులు, చేతిపని బృందాలు తమ సిల్క్‌ హ్యండ్లూమ్‌ చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్‌ వంటి 75 వేల రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు.


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)