Breaking News

‘రండి.. ఫొటో దిగుదాం’

Published on Wed, 09/17/2025 - 11:25

అది తెలంగాణ రాష్ట్రంలోని ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌లోని మొదటి అంతస్తు.. మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతం.. అమీర్‌పేట నుంచి అక్కడకు రీలోకేట్‌ అయిన పాస్‌పోర్టు సేవా కేంద్రం (పీఎస్‌కే) ప్రారంభమైంది. కేంద్ర విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖలో (ఎంఈఏ) సంయుక్త  కార్యదర్శి హోదాలో ఉన్న చీఫ్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌ డాక్టర్‌ కేజే శ్రీనివాస ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఫొటో సెషన్‌ నడిచింది. పాస్‌పోర్టు కార్యాలయం, పీఎస్‌కే ఉద్యోగులు, అతిథులు ఆయనతో ఫొటోలు దిగారు. 

టోలిచౌకి నుంచి రాయదుర్గానికి రీలోకేట్‌ అయిన పీఎస్‌కేను ప్రారంభించాల్సి ఉంది. అందరూ అక్కడకు వెళ్లే హడావుడిలో ఉండగా.. ‘రండి ఫొటో దిగుదాం’ అనే మాట శ్రీనివాస నోటి వెంట వచి్చంది. అక్కడ ఉన్న నాల్గో తరగతి ఉద్యోగులను ప్రత్యేకంగా ఆహా్వనించిన ఆయన రీజనల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌ స్నేహజ జోన్నలగడ్డతో కలిసి ఫొటోలు దిగారు. ‘మా కేంద్రాలు సజావుగా నిర్వహించడానికి మీరూ కీలకమే’ అంటూ ఆ పారిశుద్ధ్య, సెక్యూరిటీ ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన విలక్షణ వ్యక్తిత్వాన్ని చూసి అక్కడి వాళ్లంతా అవాక్కయ్యారు.

ఎవరీ శ్రీనివాస? 
బెంగళూరుకు చెందిన కోటేహాల్‌ జయదేవప్ప శ్రీనివాస మైసూర్‌ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్యనభ్యసించారు. 2002 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అధికారి. బెంగళూరులోని రీజనల్‌ పాస్‌పోర్టు కార్యాలయం నుంచి పాస్‌పోర్టు పొందడానికి శ్రీనివాస 1997లో దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో దాని కోసం ఉదయం 5 గంటలకే ఆర్‌పీఓ కార్యాలయానికి వెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. అన్ని వెరిఫికేషన్లు పూర్తయి, పాస్‌పోర్టు పొందడానికి 60 రోజులు వేచి ఉన్నారు.

ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న శ్రీనివాస తాను ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన తర్వాత పాస్‌పోర్టు జారీలో సంస్కరణలపై దృష్టి పెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాలకీ మొబైల్‌ పాస్‌పోర్టు సేవా వ్యాన్లు మొదలు చిఫ్‌ బేస్ట్‌ ఈ–పాస్‌పోర్టుకు రూపం ఇవ్వడంలోనూ పాత్ర కీలక పాత్ర వహించారు..  

(చదవండి: ఓవైపు అసిస్టెంట్‌ కమిషనర్‌గా..మరోవైపు కళాకారిణిగా..)

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)