Breaking News

ఉద్ధండ ఆర్టిస్టులు : ప్రతి రూపాయి చిన్నారుల చదువుకే..

Published on Fri, 06/20/2025 - 11:29

సాక్షి, సిటీబ్యూరో: కళాకారుని సృజనాత్మకతకు మానవత్వం తోడైతే అద్భుతాలు సృష్టించ వచ్చని.. అది అనాథ, నిరుపేద చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపుతుందని పలువురు కళాకారులు నినదిస్తున్నారు. ఇందులో భాగంగా నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారుల విద్యకు సహకారం అందించడమే లక్ష్యంగా పరోపకార –2025 కళా ప్రదర్శన (Art Exhibition) నిర్వహించ నున్నారు. నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ నచికేత తపోవన్‌ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల సమగ్ర విద్య, సాధికారత కోసం ప్రత్యేక నిధుల సేకరణ కళా కార్యక్రమంగా ‘పరోపకార–2025’ సగర్వంగా ఆవిష్కరిస్తున్నారు. కళ, లగ్జరీ రంగాల్లో వ్యాపారవేత్త అయిన సుష్మ తోట నిర్వహణలో నగరంలోని జూబ్లీ హిల్స్‌ ‘ది కులినరీ లౌంజ్‌’ వేదికగా ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. 

ప్రతి రూపాయి చిన్నారుల చదువుకే.. 
నా పదేళ్ల అనుభవం.. నచికేత తపోవన్‌ కోసం ఈ పరోపకార– 2025 భారీ నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టేలా చేసింది. ఈ ఏడాది పరోపకార ఫండ్‌ రైజింగ్‌ ప్రధానంగా అనాథ, పేద, గిరిజన, మొదటి తరం విద్యార్థులకు ఉచిత విద్యపై దృష్టి సారిస్తోంది. పరోపకార 2025లో ప్రదర్శించే కళాఖండాల కొనుగోలు ద్వారా వచ్చే ప్రతి రూపాయి చిన్నారులు చదువుకోడానికి ఫీజులు, పుస్తకాలు, యూనిఫారŠమ్స్, ఆహారం అందించే నిధిగా వినియోగిస్తాం. కార్పొరేట్‌ సంస్థల కోసం ప్రత్యేకంగా ఎన్నో టీమ్‌ ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమాలను రూపొందించిన అనుభవం ఉంది.. కానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఉన్నటువంటి సంతృప్తి, సంతోషం మరెక్కడా లభించదు. విద్య, ఆరోగ్యం అనేవి ప్రతి ఒక్కరి హక్కు.. కలిసొచ్చే అదృష్టం కాదు.  – సుష్మ తోట, నిర్వాహకులు. 

ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శన.. 

ఉచిత విద్య, సామాజిక సేవ లక్ష్యంతో సుష్మ తోట సంకలనం చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమం.. కళను సమాజిక మార్పుకు నాంది పలికే విధంగా సరికొత్త లక్ష్యంతో మిళితం చేస్తుంది. ప్రఖ్యాత కళాకారులు తోట వైకుంఠం(Thota Vaikuntam), జోగెన్‌ చౌదరి, శక్తి బర్మన్, ఏలే లక్ష్మణ్(Laxman Aelay), రమేష్‌ గోర్జాల తదితరుల అద్భుతమైన కళాకృతులు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందనున్న చిన్నారుల ఆధ్వర్యంలో కూడా హృదయాన్ని హత్తుకునే ప్రదర్శనలు ఉంటాయి. ఈ వేదికగా రెండు రోజుల ప్రదర్శనలో ప్రసిద్ధ కళాకారులతో సమావేశాలు, విద్యార్థులతో సంభాషణలు ఉంటాయి.   

Videos

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు