Breaking News

Lighthouse Parenting: ఒడ్డుకు చేర్చేలా మాత్రమే..!

Published on Sat, 08/02/2025 - 11:07

లైట్‌హౌస్‌ అనేది సముద్రంలోని ఓడలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు లైట్‌హౌస్‌ పేరెంటింగ్‌ పిల్లలకు ఒక దిశను చూపుతుంది. అదే సమయంలో పిల్లలు వారి సొంత మార్గాల్లో పయనించేలా చేస్తుంది. ఈ పేరెంటింగ్‌ విధానంతో పిల్లలు బాధ్యతాయుతంగా ఎదగ గలిగే అవకాశాలెన్నో ఉన్నట్లు నిపుణుల పరిశీలన. ఈ తరహా పేరెంటింగ్‌ పిల్లలు భవిష్యత్తులో బాధ్యతయుతంగా పెరగడానికి ఎలా దోహదపడుతుందో  తెలుసుకుందాం.

లైట్‌హౌస్‌ పేరెంటింగ్‌ అంటే పిల్లలను సక్రమ మార్గంలో పెట్టడం. పిల్లలకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తూనే వారిని బాలెన్స్‌ చేయడం. ఈ వ్యూహాన్ని అమలు చేసే వారు తమ పిల్లలకు నిజాయితీగా మాట్లాడడానికి తగిన స్వేచ్ఛను ఇస్తారు. ఈ విధానంలో పిల్లలు తమకు ఏదైనా సాయం అవసరమైతే సంకోచించకుండా తల్లిదండ్రులను అడిగేలా పిల్లలను ప్రోత్సహిస్తుంది. తద్వారా పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

ప్రయోజనాలు ఏమిటి? 
లైట్‌హౌస్‌ పేరెంటింగ్‌ ప్రాథమిక ప్రయోజనాల్లో ఒకటి.. పిల్లల ఆత్మగౌరవంపై సానుకూల ప్రభావం చూపడం.

ఆరోగ్యకరమైన హద్దులు 
లైట్‌హౌస్‌ పేరెంట్స్‌ తమ పిల్లలకు సొంతంగా ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తారు. కానీ, వారికి కొన్ని హద్దులను నిర్దేశిస్తారు. పిల్లలు తమ ఆత్మవిశ్వాసం, స్వాతంత్య్రం వంటి ముఖ్యమైన జీవిత నైపుణ్యాలను నేర్చుకుంటారు. తల్లిదండ్రులు తమపై పూర్తి నమ్మకం ఉంచుతున్నారని తెలుసుకోవడం ద్వారా పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోవటానికి వారికి శక్తి వస్తుంది.

బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడం
ఈ పేరెంటింగ్‌ విధానానికి కమ్యూనికేట్‌ చేయడం చాలా ముఖ్యం. పిల్లలు తమ తల్లిదండ్రులను విమర్శిస్తారనే భయం లేకుండా నిశ్చింతతో ఉన్నప్పుడు సంబంధాలు బలపడతాయి. వారు తమ తల్లిదండ్రులను సలహాదారులుగా భావిస్తే.. ఆత్మస్థైర్య భావం పెరుగుతుంది.

కోపింగ్‌ నైపుణ్యాలను పెంపొందించడం
ఈ పేరెంటింగ్‌ విధానం ప్రాథమికంగా పిల్లలు ఎదురుదెబ్బలను అనుభవించేలా చేస్తుంది. అవసరమైనప్పుడు సాయం కోసం అడగడంలో వారికి మద్దతునిస్తుంది. పిల్లలు తమ భావాలను, ఇబ్బందులను సొంతంగా అధిగమించగల సామర్థ్యాన్ని పొందుతారు. జీవితంలో ఎదురయ్యే పెద్ద సమస్యలను అధిగమించేందుకు ఈ పేరెంటింగ్‌ ఎంతో తోడ్పడుతుంది.

సవాళ్లు 
లైట్‌ హౌస్‌ పేరెంటింగ్‌ విధానంతో అనేక ప్రయోజనాలను ఉన్నప్పటికీ, ఇది ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. తల్లిదండ్రులు తమ పిల్లల కష్టాలు ఎదుర్కొనే విషయంలో వెనుకడుగు వేయడం కష్టం. ఫెయిల్యూర్‌ అనేది నేర్చుకోవడంలో ఒక భాగమని తెలుసుకోవాలి. 

ఇందుకు చాలా సహనం అవసరం. పిల్లల ప్రత్యేక అవసరాలు, వారి పరిస్థితులపై ఆధారపడి కొంతమందికి మరింత ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం కావచ్చు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడు జోక్యం చేసుకోవాలి అనేదానిపై లైట్‌హౌస్‌ పేరెంటింగ్‌ ప్రాథమిక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి. 

(చదవండి: 77 ఏళ్ల 'ఫిట్‌నెస్ క్వీన్'..! ఓ బామ్మ సరిలేరు మీకెవ్వరూ..)

Videos

బైకును ఎత్తిండ్రు అన్నలు

నేషనల్ అవార్డుపై అనిల్ రావిపూడి ఫస్ట్ రియాక్షన్

సమంత చేతికి స్పెషల్ రింగ్.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందా..?

ఏం చేస్తారో చేసుకోండి.. మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఒకొక్కడికి..

దొరికిపోతారనే భయంతో సిట్ కుట్రలు

నాపై కోపంతో ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేయకండి

మీ పోరాటం రైతులకు ధైర్యం ఇస్తుంది.. అశోక్ బాబుని పరామర్శించిన పేర్ని నాని

విజయనగరంలో చరణ్.. బీభత్సమైన ఫైట్ సీన్స్ లోడింగ్

చంద్రబాబు ఉన్నంతవరకు రైతులకు భరోసా లేదు: చంద్రబాబు

KSR Comment: లోకేష్ ఖబర్దార్.. ఇక కాచుకో.. YSRCP యాప్ రెడీ!

Photos

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్ (ఫొటోలు)

+5

తెల్లజుట్టు.. మూడు కారణాలు..ఐదు పరిష్కారాలు (ఫొటోలు)

+5

శ్రావణ శుక్రవార వ్రతం చేసిన తెలుగు సీరియల్ బ్యూటీస్ (ఫొటోలు)

+5

‘బేబీ’ మూవీ నేషనల్‌ అవార్డు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

బబ్లూ పృథ్వీరాజ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌.. 60 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గానే (ఫోటోలు)

+5

11 నెలలు నీటిలో ఒక్క నెల మాత్రమే బయట ఈ శివాలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

క్యాప్షన్ ఇస్తూ.. పెళ్లి కూతురు గెటప్‌లో నిహారిక (ఫోటోలు)

+5

‘బకాసుర రెస్టారెంట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : భిన్న సంస్కృతుల నృత్య సమ్మేళనం (ఫొటోలు)

+5

శ్రావణ శుక్రవారం పూజలు చేసిన సురేఖవాణి, సుప్రీత (ఫొటోలు)