Breaking News

మేమున్నాం అనే భరోసా చాలు

Published on Sun, 06/21/2026 - 08:30

‘హిమక్రీములు, రంగు పడుద్ది, అబ్బ దబ్బ జబ్బ, ఎందుకు ఏమిటి ఎలా, అక్కుం బక్కుం, అం అః కం కః, డిసైడ్‌ చేస్తా, కిందినుంచి వచ్చా, కొంచెం లెంగ్త్‌ ఎక్కువయింది...’ ఇలాంటి ఎన్నో సినిమా డైలాగులు దివాకరబాబు మాడభూషి కలం నుంచి జాలువారినవే! శుభలగ్నం, ఘటోత్కచుడు, మావిచిగురు, చూడాలని వుంది, ఇద్దరు మిత్రులు, ఆహ్వానం, మాయలోడు, రాజేంద్రుడు–గజేంద్రుడు, యమలీల, వినోదం వంటి వందకు పైగా సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే అందించిన దివాకరబాబు పిల్లల పెంపకంలో తను తీసుకున్న శ్రద్ధను ఇలా ఆవిష్కరించారు.

‘‘పెద్దలు వాళ్ల పనులు వాళ్లు సక్రమంగా చేస్తూ ఉంటే, పిల్లలు వారితో పాటే ఎదుగుతారు. అదే, మేం పాటించింది. మా నాన్నగారి నుంచి నాకు రచనాశక్తి అబ్బింది. ఆయన ఏనాడూ ‘ఇలాగే ఉండు..’ అని చెప్పింది లేదు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తూనే నాటకాలకు రాస్తూ ఉండేవాడిని. మంచి పేరొచ్చాక సినిమాలలో రాయడానికి అవకాశాలు వచ్చాయి. 

బ్యాంకు జాబ్‌ వదిలేసి, పూర్తి రైటర్‌గానే కొనసాగాను. నేనూ, నా భార్య లక్ష్మి, మాకు ఇద్దరు పిల్లలు సాహిత్య, శ్రీకర్‌బాబు. ఎవరి పనులు వారివే. ఒక్కరోజు కూడా ‘కూర్చొని చదువుకో’ అని గట్టిగా గద్దించింది లేదు. తల్లి తండ్రి అంటే ఫ్రెండ్స్‌ ఉండాలనేమీ లేదు, ఒక గైడ్‌గా ఉంటే చాలు. ఒక దశ దాటి మరొక దశలోకి పిల్లలు వెళుతున్నప్పుడు గమనించి, వారి ఇష్టాలేమిటో, ఎలా వెళుతున్నారో చూసుకోవాలి. ఆ దిశలో వెళ్లేందుకు సహకరించాలి. 

మా పిల్లల్ని ‘టెన్త్‌ క్లాస్‌ పూర్తయ్యాక పై చదువులు ఏం చదవాలనుకుంటున్నారు..’ అని అడిగా. పాప డాక్టర్‌ అవ్వాలని ఉంది అని చెప్పింది. బాబు మ్యాథ్స్‌ వైపు ఆసక్తి అన్నాడు. ‘అలాగే చదవండి’ అన్నాను. నాకు రాయడం, పుస్తకాలు చదివే అలవాటు వల్ల ఇంట్లో ఎక్కువ శాతం అదే వాతావరణం ఉండేది. నా శ్రీమతి కూడా పనులు చేసుకుంటూ, పుస్తకాలు చదువుతూ, రచనలు చేయడంపైన ఆసక్తి చూపుతుంటుంది. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ వాళ్లూ సాహిత్య పుస్తకాలు చదువుతుండేవారు. 

మా అమ్మాయి తను అనుకున్న విధంగా ఎంబీబీఎస్‌ చదివింది. బాబు డిగ్రీ చదువు పూర్తవుతూనే సినిమా చేసే అవకాశం వచ్చింది. సినిమాయే కెరీర్‌గా తీసుకోవాలా, వద్దా అనే చర్చ ఇంట్లో వచ్చింది. ‘క్లిక్‌ అయితే పర్వాలేదు, లేదంటే ... ఏంటి పరిస్థితి’ అని అన్నవారున్నారు. నేను ఎవరి మాటలను పట్టించుకోలేదు. ఉద్యోగం చేయమని ఒత్తిడి తీసుకురాలేదు. ‘నిజానికి సినిమా రంగంలో ‘ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి’ అని ఎంతోమంది ప్రయాస పడుతుంటారు అలాంటిది ‘అవకాశం నీ కోసం వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవడం. కష్టం వస్తే.. అనే ఆలోచనను కూడా తీసేయ్, నేనున్నాను..’ అని చెప్పాను. 

ఇప్పుడు తను నటుడిగా, డైరెక్టర్‌గా బిజీగా ఉన్నాడు. మా అమ్మాయికి కూడా అదే భరోసా ఇచ్చాను. అమ్మాయి డాక్టర్‌గా చేస్తూనే వెబ్‌సీరీస్‌ కూడా తీస్తుంటుంది. ఇలా ఎందుకు చెబుతున్నానంటే పక్కింటి కుర్రాడు క్రికెట్‌లో అదరగొడుతుంటే చప్పట్లు కొడుతుంటాం. మనింట్లో పిల్లవాడు క్రికెట్‌ ఆడుతుంటే వాడి వీపు పగలకొడతాం. పిల్లలందరూ ఎవరికి వారు భిన్నం. ప్రతి ఒక్కరికీ ఒకే విధమైన టాలెంట్స్‌ ఉండవు. వారి తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నా బ్యాలెన్స్‌ చేసేలా పెద్దలు ఉండాలి. 

చదువు, కెరీర్‌ మాత్రమే కాదు అతి ముఖ్యమైన పెళ్లిళ్ల విషయాల్లోనూ పిల్లల ఇష్టానికే ప్రాధాన్యం ఇచ్చాం. మా అమ్మాయిది లవ్‌ మ్యారేజ్‌. ఇద్దరూ వచ్చి పెళ్లి గురించి ప్రస్తావించారు. అబ్బాయి పేరెంట్స్‌తో మాట్లాడి, సింపుల్‌గా పెళ్లి చేసేశాం. అబ్బాయిది అరేంజ్డ్‌ మ్యారేజీ. సాధారణంగా పిల్లలకు ఏదైనా కష్టం వస్తే బయటి వాళ్లకు చెప్పుకుంటారు. అమ్మానాన్నలు తిడతారని, భయపడి వాళ్లకు చెప్పరు. 

దీని వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. పొరపాట్లు జరగడం సహజం. చాలామందిని చూస్తుంటాం. పిల్లలకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే ముందు ఊరంతా తెలిశాక ఆ పేరెంట్స్‌కు తెలుస్తుంది. కానీ, ముందుగా అమ్మానాన్నలకు చెప్పాలనే ఆలోచన, స్వేచ్ఛ పిల్లలకు కలిగేలా పెద్దలు ఉండాలి. ఇప్పుడు కూడా మేం మా పనుల్లో బిజీ. పిల్లలు వారి పనుల్లో బిజీ. కానీ, అందరం కలిసే మంచి చెడులను పంచుకుంటాం. ఆ స్వేచ్ఛ, భరోసా పిల్లలకు ఉంది. 

స్వేచ్ఛగా ఎదగాలంటారు..
నేను, అన్నయ్య కాలేజీ స్థాయికి వచ్చేవరకు మా చుట్టూ సాహిత్యం ఉందనే విషయం, ఆ గొప్పతనం గురించి అంతగా తెలియలేదు. మేం టెక్ట్స్‌ బుక్స్‌ చదువుతుంటే ‘కాస్త రిలాక్స్‌గా ఉంటుంది, కొంచెం టైమ్‌ కేటాయించి ఈ బుక్‌ చదువు’ అని నవలనో, కథల పుస్తకాన్నో చేతిలో పెట్టేది అమ్మ. నాన్న చెప్పకపోయినా ఆయనకు ఉండే రచనాసక్తి, బుక్‌ రీడింగ్‌ హ్యాబిట్‌ 
మాకూ అబ్బింది.  
సాహిత్య (దివాకరబాబు కూతురు)

నిర్మలారెడ్డి 

(చదవండి: ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు)

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)