Breaking News

పేరెంట్స్‌ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు

Published on Fri, 05/02/2025 - 09:55

పేరెంటింగ్‌ నియమాలు తరానికీ తరానికీ మారుతున్నాయి. కొత్త తరం పేరెంటింగ్‌లో చాలా ఫ్లెక్సిబుల్‌గా, ఎంçపతీతో ఉంటోంది. పిల్లలతో చాలా దృఢమైన బంధాన్ని కోరుకుంటోంది. పిల్లల ఎమోషనల్‌ వెల్‌ బీయింగ్‌ కోసం ఎటువంటి భయాలూ, బిడియాలూ లేకుండా తాము అనుకున్నది ధైర్యంగా కమ్యూనికేట్‌ చేయడాన్ని ప్రోత్సహిస్తున్నారు. పిల్లల స్వేచ్ఛను ప్రోత్సహిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే రోల్‌మోడల్‌ పేరెంటింగ్‌ రూల్‌ పాటించాలనుకుంటున్నారు. యాభైఏళ్ల కిందట పేరెంటింగ్‌లో క్రమశిక్షణ అనే పదం వీర విహారం చేసేది. 

నాన్న ఇంట్లో ఉంటే పిల్లల అల్లరి వినిపించకూడదు, పుస్తకం పట్టుకుని కనిపించాలి. నాన్న ప్రశ్నిస్తే వినయంగా సమాధానం చెప్పాలి. నాన్న ఎదుట పడాలంటే భయం. ఈ చట్రంలో పెరిగిన తరం, ఆ తర్వాతి తరం ఇప్పుడు పేరెంట్స్‌ అయ్యారు. ఈ జెన్‌  జెడ్‌ పేరెంట్స్‌ తమ పిల్లల విషయంలో భౌతికపరమైన క్రమశిక్షణ పాటించడం కంటే తల్లిదండ్రుల మాట మీద విశ్వాసం, అర్థం చేసుకోవడం దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇంటి నిండా బొమ్మలే!
జెన్‌  జెడ్‌ పేరెంట్స్‌ తమ బాల్యంలో ఎదురైన సంఘటనలను బేరీజు వేసుకుంటూ ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదోననే నియమావళిని రూపొందించుకుంటున్నారు. బాల్యంలో తాము నొచ్చుకున్న సందర్భాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ పిల్లల మనసు గాయపరచకూడదనే నియమాన్ని పాటిస్తున్నారు. 

ఇందులో విపరీతమైన షాపింగ్‌ ఒకటి. గత తరం పేరెంట్స్‌ చేతిలో డబ్బు పరిమితంగా ఉండేది. ఇప్పుడు డబ్బు పుష్కలంగా అందుతోంది. రోజువారీ శ్రామికుల కుటుంబాలు కూడా తమ రాబడిలో ఎక్కువ భాగాన్ని సరదాలకు ఖర్చుపెడుతున్నాయి. అప్పట్లో ఏడాదికో రెండేళ్లకో ఒక బొమ్మ కొనిస్తే... ఇప్పుడు ప్రతి ఇంట్లో పాతిక–ముప్పై బొమ్మలకు తక్కువ కాకుండా షెల్ఫ్‌లు నిండిపోతున్నాయి. 

పిల్లలు తమ భావోద్వేగాలను వ్యక్తం చేసే క్రమంలో ‘నో’ చెప్పడాన్ని ప్రోత్సహిస్తున్న జెన్‌ జెడ్‌ పేరెంటింగ్‌ పిల్లలకు తాము కూడా ‘నో’ చెప్పవచ్చనే సంగతి మర్చిపోతున్నారు. ఇక మగపిల్లలు ఏడవకూడదనే సామాజిక షరతును ప్రశ్నిస్తున్న మనస్తత్వ నిపుణులు ‘మగపిల్లలను కూడా ఏడవనివ్వండి’ అంటున్నారు. కాలం మారుతున్న క్రమంలో వస్తున్న మార్పులివన్నీ. ‘మగపిల్లలను కూడా ఏడవనివ్వాలి, వారిలోని సున్నితత్వాన్ని పరిరక్షించాలి’ అని చెబుతున్న న్యూజెనరేషన్‌ పేరెంటింగ్‌ దానిని అమలు చేయడంలో మాత్రం తార్కికతను కోల్పోతోందన్నారు ట్రాన్స్‌పర్సనల్‌ హోలిస్టిక్‌ కోచ్‌ అర్పితాగుప్త. 

సంతోష క్షణాలు!
ఈ తరంలో దాదాపుగా అన్నీ న్యూక్లియర్‌ ఫ్యామిలీలే. పేరెంట్స్‌ కూడా తమ బిడ్డ ఆడుకోవడానికి అక్క,చెల్లి, అన్న, తమ్ముడు లేని బాల్యాన్ని మిగిల్చామని అర్థం చేసుకుంటున్నారు. తోబుట్టువులు లేని లోటు తీర్చడం కోసం పిల్లలతో తల్లులే కాదు తండ్రులు కూడా చక్కగా ఆడుకుంటున్నారు. వారిని ఆటల్లో ఎంగేజ్‌ చేయడానికి తగినంత సమయం కేటాయిస్తున్నారు. 

వాళ్లు పెద్దయిన తర్వాత బాల్యాన్ని గుర్తు చేసుకుంటే తల్లిదండ్రులతో ఆడుకున్న తీపి జ్ఞాపకాలు గుర్తు వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే పిల్లల మెదళ్లలో విరిసిన ఆలోచనను చక్కగా వ్యక్తం చేయగలిగేటట్లు ప్రోత్సహిస్తున్నారు. పిల్లల ఆలోచనలను, ఆకాంక్షలను కొట్టిపారేయకుండా తగిన ప్రాధాన్యతనిస్తున్నారు. పిల్లల కెరీర్‌ విషయంలోనూ వారి అభిరుచులను సమాజం గిరిగీతలను పట్టించుకోకుండా స్వాగతిస్తున్నారు. 

మొత్తంగా చూస్తే తమ బాల్యంలో తమకు కలలుగానే ఉండిపోయిన అన్నింటినీ తమ పిల్లలకు అందిస్తున్నారు. ఒక్క మాటలో చె΄్పాలంటే పిల్లల బాల్యంలో తామను తాము ప్రతిక్షేపించుకుంటున్నారు. తమకు దక్కని సంతోషాలను చాలా ఎక్కువగా అందించాలని తపన పడుతున్నారు. ఆదర్శవంతమైన పేరెంటింగ్‌కి ప్రతిరూపాలుగా ఉండాలని అభిలషిస్తున్నారు. ఆచరణలో ఒకింత సమతుల్యత, సమన్వయం అలవరుచుకుంటే జెన్‌  జెడ్‌ పేరెంటింగ్‌ రోల్‌ మోడల్‌ పేరెంటింగ్‌ అవుతుంది.

ఓ ఆశ్చర్యకరమైన సంఘటన
అది మహారాష్ట్రలో ఓ పర్యాటక ప్రదేశం. నడిరోడ్డు మీద ట్రాఫిక్‌ స్తంభించి΄ోయింది. ఏం జరిగిందో చూద్దామని కొందరు తమ వాహనాలు దిగి ముందుకెళ్లారు. అక్కడ ఓ యువకుడు, 30 ఏళ్లుంటాయి, తన కారును చూసుకుంటూ బిగ్గరగా ఏడుస్తున్నాడు. ‘ఏమైంది’ అని అడిగారెవరో. కారు మీద పడిన గీతలు చూపిస్తూ మళ్లీ భోరుమన్నాడతడు. అది అతడికిష్టమైన కారు, ముచ్చటపడి కొనుక్కున్న కారని చెప్పి వెక్కిళ్లు పెడుతున్నాడు. 

అతడి తల్లిదండ్రులు కారు లోపల ఉన్నారు. ‘మా అబ్బాయి చాలా సున్నితమనస్కుడండీ. తనకిష్టమైన కారుకి గీతలు పడితే భరించలేక΄ోతున్నాడు’ అన్నారు వాళ్లు సమర్థింపుగా. మగవాళ్లు ఏడవకూడదని బాల్యంలోనే మైండ్‌ని కండిషన్‌  చేసే పెంపకం ఒకప్పటిది. ఎమోషన్స్‌సకి లింగభేదం ఉంటుందా అని ఏడుపు వచ్చినప్పుడు అన్‌ కండిషనల్‌గా ఆ ఎమోషన్‌ని వ్యక్తం చేయవచ్చనే వాదన నేటిది. 

అయితే పైన చెప్పుకున్న కండిషన్‌లో ఆ కుర్రాడి కారణంగా ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ట్రాఫిక్‌లో ఇబ్బంది పడుతున్న వాళ్లు కూడా ఎమోషన్స్‌ని ఆపుకోలేక కోపాన్ని ప్రదర్శిస్తే పరిస్థితి విషమిస్తుంది. పరిణతి చెందిన వాళ్లం కొంతమందిమి కలగచేసుకుని ‘కారు పక్కకు తీసుకుని, ఎమోషన్‌  కంట్రోల్‌ అయిన తర్వాత ప్రయాణాన్ని కొనసాగించండి’ అని సర్దిచెప్పి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చిందని చెబుతున్నారు అర్పితాగుప్తా, హోలిస్టిక్‌ కోచ్‌ 

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

(చదవండి:

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు