Breaking News

పిల్లలను మానసికంగా స్ట్రాంగ్‌గా మార్చే ‘10-10-10’ రూల్‌..!

Published on Mon, 06/08/2026 - 13:27

ప్రస్తుతం డిజిటల్‌ యుగంలో పిల్లలు తల్లిదండ్రులు మధ్య సత్సంబంధాలు సరిగా లేవనే చెప్పాలి. తల్లిదండ్రులిరువురు తమ ఉద్యోగాలతో బిజీ అయిపోవడంతో పిల్లలతో సాన్నిహిత్యంగా ఉండేది తక్కువనే చెప్పాలి. దాంతో వారిలో అభద్రతా భావం ఎక్కువైపోతోంది. పైగా చిన్న చిన్న వాటికే కోపతాపాలు ఎక్కువైపోవడం, చదువులో వెనకబడటం వంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా అలాంటి పిల్లలు ఏ సమస్యనైనా తేలిగ్గా తీసుకుని అధిగమించే ప్రయత్నం చేయరు. భయంతో వణికిపోవడం లేదా చికాకు, నిరాశ నిస్ప్రుహలతో చెడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి వచ్చేస్తున్నారు. అలా కాకుండా చిన్నారులు మానసికంగా బలంగా ఉండి, ప్రతి మాట తల్లిదండ్రులకు నివేదించేలా పెంచాలంటే ఏం చేయాలంటే..

ఈ డిజిటల్‌ యుగంలో పిల్లలు పెద్దలు స్క్రీన్‌లకు అతుక్కుపోతున్నారు. దాంతో ఇరువురి మధ్య దూరం ఎక్కువైపోతోందని అంటున్నారు. అదీగాక పిల్లలు కూడా ప్రతి చిన్న విషయానికి రియాక్ట్‌ అయ్యి..అభద్రతా భావనికి గురయ్యిపోతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ముందుగా వాళ్లలో మానసిక పరిణితి సరైన విధంగా ఉండటం లేదని అందువల్లో చిన్న వయసుకే అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుని చెడు మార్గాలకు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. 

మొదటగా పిల్లలు తల్లిదండ్రలు మధ్య విడదీయరాని అనుబంధం స్ట్రాంగ్‌గా ఉండాలంటున్నారు. అందుకోసం గంటలు గంటలు.. లేదా రోజుల తరబడి వెచ్చించాల్సిన పనిలేదు. ప్రతిరోజు మీ దినచర్యలో భాగమయ్యేలా ఓ పదినిమిషాలు పిల్లల కోసం కేటాయిస్తే చాలంటున్నారు. అదికూడా పేరెంట్స్‌ తమ స్క్రీన్‌ టైంకి జస్ట్‌ 30 నిమిషాలు వీడ్కోలు పలికేలా ప్లాన్‌ చేస్తే చాలంటున్నారు. పైగా అది బిజీ షెడ్యూల్‌కి విరామంలా పిల్లలు హ్యాపీగా ఫీలయ్యేలా ఉంటుందని చెబుతున్నారు. జస్ట్‌ 30 నిమిషాలా అంటే..

ఔను జస్ట్‌ 30 అంటూ సరికొత్త పేరెంటింగ్‌ టిప్‌ ‘10+10+10’ రూల్‌ని పరిచయం చేస్తున్నారు మానసిక నిపుణులు. అంటే ..పిల్లలు నిద్ర లేచినప్పుడు ఓ పది నిమిషాలు, పిల్లలు పడుకునే టప్పడు ఓ పదినిమిషాలు, అలాగే పాఠాశాల నుంచి తిరిగి రాగానే వారితో కాసేపు పది నిమిషాలు ఎలాంటి పరధ్యానం లేకుండా, ఫోన్‌తో పనిలేకుండా వాళ్ల కళ్లల్లోకి నేరుగా చూస్తూ మాట్లాడండి. అది ఇరువురి మధ్య బలమైన అనుబంధాన్ని ఏర్పరిచి పిల్లలు మానసికంగా దృఢంగా ఎదిగేందుకు ఉపకరిస్తుందని అంటున్నారు. 

ఇది వినడానికి జస్ట్‌ 30 నిమిషాలైనా అనిపించినా..చాలా ప్రభావవంతంగా ఉంటుందన్నారు. ఇక్కడ చిన్నారులు పేరెంట్స్‌ ఎంత ప్రేమ పంచారనేది చూడరు..తమ అమ్మనాన్నలు తమకెంత అందుబాటులో ఉన్నారో అర్థమవుతుందంటున్నారు. తాము భద్రంగా ఉన్నామనే భరోసా, ధైర్యం అందిస్తుంది. పైగా పిల్లలకు ఏం జరిగినా, ఏ సమస్య వచ్చినా..నేర్పుగా వ్యవహరించడం ఎలాగే తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది కూడా. అదీగాక పిల్లలను స్క్రీన్‌లకు అతుక్కుపోయే వ్యసనం బారినపడకుండా రక్షించేందుకు చక్కటి మందులా కూడా ఉపయోగపడుతుందట. 

రోజుంతో కొద్దిసేపు పిల్లలను పర్యవేక్షించే తీరు వల్ల వాళ్లు తప్పు చేసే అవకాశం, తప్పుడు మార్గంలో పయనించే అవకాశాలు తక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. అలాగే భావోద్వేగపరంగా బలంగా ఉంటారని అంటున్నారు. అంతేగాదు తమకంటే పేరెంట్స్‌కి ఏది ఎక్కువ కాదనే నమ్మకం పిల్లల్లో పెంపొందుతుంది కూడా. సో ఇంకెందుకు ఆలస్యం పిల్లల కోసం జస్ట్‌ 30 నిమిషాలు కేటాయించి చూడండి మరి..

(చదవండి: సింగిల్‌ మదర్‌గా పడ్డ కష్టానికి..కుమారుడిచ్చిన గొప్ప గౌరవం!)

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)